For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అరవై ఏళ్ళ బామ్మలతో సుడిగాలి సుధీర్ రచ్చ..చూస్తే మతిపోవాల్సిందే!

  |

  ఈటీవీలో ప్రసారం అవుతున్న మల్లెమాల ఎంటర్ టైన్మెంట్స్‌ వాళ్ళు 'శ్రీదేవి డ్రామా కంపెనీ' కామెడీ షో లాంచ్ చేసినప్పుడు పెద్దగా జనానికి ఎక్కలేదు. దీంతో ఈ షోకి హైప్ తీసుకురావడంతో కోసం జబర్దస్త్ బ్యాచ్ తో పాటు, డీలో వాళ్ళను కూడా దింపింది. ఎప్పుడు ఎవరు ఖాళీగా ఉంటే వాళ్లతో ఎపిసోడ్ లాగిచ్చేస్తోంది. సుడిగాలి సుధీర్‌ తో హోలీ సందర్భంగా స్పెషల్ ఎపిసోడ్‌ చేశారు. బుల్లితెరపై సుధీర్‌కి బీభత్సమైన ఫాలోయింగ్ ఉండటంతో శ్రీదేవి డ్రామా అప్పటి ఎపిసోడ్ కి మంచి క్రేజ్ వచ్చింది. దీంతో సుధీర్ నే కంటిన్యూ చేస్తున్నారు. ఈ వారం రిలీజ్ అయిన ప్రోమోలో కూడా పలు ఆసక్తికర అంశాలు కనిపించాయి.

  స్విమ్మింగ్ పూల్‌లో అర్ధనగ్నంగా.. హాట్ హాట్‌గా యువ హీరోయిన్ అందచందాలు

  సరికొత్త థీమ్ తో

  సరికొత్త థీమ్ తో

  నిజానికి శ్రీదేవి డ్రామా కంపెనీ నీ అనే ఈ కామెడీ షో లో ప్రతి వారం ఒక సరికొత్త థీమ్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి నవ్వించే ప్రయత్నం చేస్తున్నారు. ఎపిసోడ్ చేసే సమయానికి ఏ ఆర్టిస్ట్ కాళీగా ఉంటే ఆ ఆర్టిస్టు చేత కామెడీ చేయిస్తూ సందడి చేస్తున్నారు. జబర్దస్త్ ఆర్టిస్టులు, అనేకాక ఢీ షో లో యాంకరింగ్ చేస్తున్న దీపికా పిల్లి, భాను లాంటి వాళ్లను కూడా అవసరమైనప్పుడు వాడేస్తున్నారు. తాజా ఎపిసోడ్లో నటి హిమజ, జబర్దస్త్ వర్ష అక్క చెల్లెళ్ళుగా, రాంప్రసాద్ వారికి అన్నగా కనిపించాడు. ఈ ఎపిసోడ్ ప్రోమో లో సుడిగాలి సుధీర్ బామ్మలతో డాన్స్ హైలెట్ గా నిలిచింది.

  బామ్మలతో అదిరే డ్యాన్స్

  బామ్మలతో అదిరే డ్యాన్స్

  డాన్స్ అంటే ఆయన సింగిల్ గా వేశాడో లేక హిమజతోనో, వర్షతోనో వేశాడేమో అనుకోకండి. సరిగ్గా 60 ఏళ్లు పైబడిన బామ్మలతో కలిసి ఆయన స్టెప్పులు వేశాడు. అది కూడా ఆషామాషి సాంగ్ కాదు మెగా స్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమాలో ఈ మధ్య రిలీజ్ అయిన లాహే లాహే సాంగ్. సుధీర్ ఎంట్రీ కంటే ముందు బామ్మలు అందరూ కలిసి వేసిన స్టెప్పులు మాత్రం ఆకట్టుకున్నాయి. బామ్మల డాన్స్ అయిపోయిన తర్వాత సుధీర్ తో కూడా కలిసి ఒక నాలుగు స్టెప్పులు వేశారు. దీంతో సుధీర్ కూడా కాస్త ఎగ్జయిట్ అయ్యి ఇది కదా గ్రేస్ అంటే ఇది కదా డాన్స్ అంటే అంటూ వాళ్ళని ఉత్సాహపరిచాడు.

  వంటల తంటాలు

  వంటల తంటాలు

  ఇక ఆ తర్వాత ప్రోమోలో వంటల ఎపిసోడ్ కూడా ఆకట్టుకుంది. వంట మనిషి అయిన రాంప్రసాద్ తమ చెల్లెళ్లకు వంట నేర్పించే కాన్సెప్టుతో కామెడీ పండించాడు. బజ్జీలు వేయడం నేర్చుకోవడానికి వర్ష, హిమజలు పడే తంటాలు నవ్వులు పూయించాయి. అదే సమయంలో రాంప్రసాద్ సుడిగాలి సుధీర్ మధ్య మాస్క్ కామెడీ నడిచింది. సుడిగాలి సుధీర్ శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చాక సన్మానం చేయలేదు అని చెబుతూ తాను చేసిన చపాతీతో సన్మానం చేయబోతాడు రాంప్రసాద్. అలాగే మాస్క్ లేదని చెబుతూ ఆ చపాతీని సుధీర్ ముఖానికి అడ్డంగా కట్టే ప్రయత్నం చేసి నవ్వులు పూయించాడు.

  Sudigali Sudheer పై Nagababu కోపం గా ఉన్నారా? నెటిజన్ కి షాకింగ్ రిప్లై
  క్రికెట్ ఎపిసోడ్

  క్రికెట్ ఎపిసోడ్

  ఇక ఆ తర్వాత వచ్చిన క్రికెట్ ఎపిసోడ్ కూడా బాగా ఆకట్టుకుంది. రెండు జట్లుగా విడిపోయి క్రికెట్ ఆడుతూ ఫన్ జనరేట్ చేశారు.. ఈ కాన్సెప్ట్ లో కూడా నూకరాజు, ఇమ్మానియేల్, రాంప్రసాద్ ఆకట్టుకున్నారు. మొత్తం మీద శ్రీదేవి డ్రామా కంపెనీ మొదలుపెట్టినప్పటి కంటే జబర్దస్త్ ఆర్టిస్టుల ఎంట్రీ తర్వాత మంచి వ్యూస్ తెచ్చుకుంటూ షో ముందుకు వెళుతోంది. అందుకే వారం వారం మళ్ళీ మళ్ళీ కొత్త కొత్త థీమ్స్ ఎంటర్ చేస్తూ ఆసక్తికరంగా రూపుదిద్దుతున్నారు. జబర్దస్త్ బ్యాచ్ ఎంట్రీతో ఈ షో కూడా హిట్ షోస్ లిస్ట్ లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. చూడాలి మరి ఏమవుతుందో ?

  English summary
  Sridevi Drama Company is a comedy show planned by etv. in the latest promo sudigali sudheer dance with 60+ ladys seems quite interesting. The latest promo contains some more comedy by jabardasth artists.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X