చరిత్ర సృష్టించిన సుడిగాలి సుధీర్: వాళ్లందరిపై ఆధిపత్యం చూపిస్తూ.. ఊహించని రికార్డు సొంతం

సుడిగాలి సుధీర్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరు అనడంలో సందేహం లేదు. అంతలా దాదాపు ఆరేడేళ్లుగా తన హవాను చూపిస్తూ సత్తా చాటుతున్నాడీ లవర్ బాయ్. జబర్ధస్త్ అనే షో ద్వారా పరిచయం అయిన ఈ కుర్రాడు.. చాలా తక్కువ సమయంలోనే ఊహించిన స్థాయికి ఎదిగిపోయాడు. అందుకే విపరీతమైన ఫాలోయింగ్‌తో పాటుగా వరుస ఆఫర్లు దక్కించుకుంటున్నాడు. ఇలా చాలా కాలంగా బుల్లితెరపై సందడి చేస్తున్న సుధీర్.. తాజాగా ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. తద్వారా చరిత్ర సృష్టించాడు. ఆ వివరాలు మీకోసం!

అలా పరిచయం.. ఆల్‌రౌండర్‌గా గుర్తింపు

అలా పరిచయం.. ఆల్‌రౌండర్‌గా గుర్తింపు

మ్యాజిక్ షోలు చేసుకుంటూ కెరీర్‌ను ఆరంభించాడు సుధీర్. ఆ తర్వాత వేణు వండర్స్ టీమ్‌లో సభ్యుడిగా జబర్ధస్త్‌లోకి ప్రవేశించాడు. ఈ క్రమంలోనే తనలోని టాలెంట్‌ను నిరూపించుకుని టీమ్ లీడర్‌గా ఎదిగాడు. అప్పటి నుంచి తన హవా చూపిస్తోన్న అతడు.. కామెడీతో పాటు డ్యాన్స్‌లు చేస్తూ, పాటలు పాడుతూ బుల్లితెర ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడీ టాలెంటెడ్ యంగ్ స్టార్.

ఆమెతో ప్రేమాయణంతో మరింత పాపులర్

ఆమెతో ప్రేమాయణంతో మరింత పాపులర్

సుడిగాలి సుధీర్ తనలోని టాలెంట్ల వల్లే బాగా ఫేమస్ అయ్యాడు. అయితే, అంతకంటే ఎక్కువ గుర్తింపు రావడానికి మాత్రం రష్మీ గౌతమ్ కారణం అన్న విషయం అందరికీ తెలిసిందే. ఆమెతో ప్రేమాయణం సాగిస్తున్నాడన్న వార్తలే సుధీర్‌ను పాపులర్ అయ్యేలా చేశాయి. అలాగే, ఆ యాంకర్‌ను పెళ్లి చేసుకుంటున్నాడని కూడా ఎప్పటి నుంచో జోరుగా ప్రచారం జరుగుతూనే ఉంది.

లవర్ బాయ్ ఇమేజ్.. ఆ యాంకర్లతోనూ

లవర్ బాయ్ ఇమేజ్.. ఆ యాంకర్లతోనూ

తెలుగు రాష్ట్రాల్లో జబర్ధస్త్ కమెడియన్‌గా సుడిగాలి సుధీర్ ఎనలేని క్రేజ్‌ను అందుకున్నాడు. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లను అధిగమించాడు. దీంతో యూత్‌లో మాంచి ఫాలోయింగ్‌ను అందుకున్నాడు. అదే సమయంలో రష్మీ గౌతమ్ కాకుండా పలువురు యాంకర్లలతో అతడు ప్రేమాయణం సాగిస్తున్నాడన్న టాక్ వచ్చింది. దీంతో ఈ కమెడియన్‌కు లవర్ బాయ్ ఇమేజ్ వచ్చింది.

అలా సక్సెస్... హీరోగా మాత్రం విఫలమే

అలా సక్సెస్... హీరోగా మాత్రం విఫలమే

షోలలో తనదైన టైమింగ్‌తో కామెడీని పండిస్తూ టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్న సుడిగాలి సుధీర్.. సినిమాల్లోనూ అడుగెట్టాడు. ఈ క్రమంలోనే 'రేసు గుర్రం', 'బ్రదర్ ఆఫ్ బొమ్మాలి', 'సర్దార్ గబ్బర్ సింగ్', 'బంతిపూల జానకీ' సహా కొన్ని చిత్రాల్లో నటించాడు. ఇవన్నీ అతడికి పేరు తెచ్చిపెట్టాయి. అయితే, హీరోగా చేసిన 'సాఫ్ట్‌వేర్ సుధీర్', 'త్రీమంకీస్' మాత్రం ఘోరంగా నిరాశ పరిచాయి.

కొత్త చరిత్రను సృష్టించిన సుడిగాలి సుధీర్

కొత్త చరిత్రను సృష్టించిన సుడిగాలి సుధీర్

ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటి నుంచి తనదైన శైలి కామెడీతో దూసుకుపోతున్నాడు సుధీర్. సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లను అందుకున్నాడు. తద్వారా కొన్ని సందర్భాల్లో దేశ వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే అతడు ప్రముఖ సంస్థ ప్రకటించిన జాబితాలో ఒకటి, రెండు స్థానాల్లో నిలవడం ద్వారా తాజాగా ఓ అరుదైన ఘనతను అందుకున్నాడు.

వాళ్లందరినీ వెనక్కి నెడుతూ టాప్ ప్లేస్

వాళ్లందరినీ వెనక్కి నెడుతూ టాప్ ప్లేస్

దేశ వ్యాప్తంగా బుల్లితెరపై ఉత్తమ నటులను, ప్రభావితం చేసే క్యారెక్టర్లను, ఎంటర్‌టైనర్లను ఎంపిక చేసే ఆర్మాక్స్ మీడియా తాజాగా 2021 జనవరి నెలకు సంబంధించిన జాబితాను విడుదల చేసింది. ఇందులో ఉత్తమ ఎంటర్‌టైనర్‌ విభాగంలో సుడిగాలి సుధీర్ మొదటి రెండు స్థానాలను దక్కించుకున్నాడు. అందులో ఒకటోది ఢీ షో నుంచి, రెండో స్థానం జబర్ధస్త్ నుంచి వచ్చింది.

గత ఏడాది కూడా సుధీర్‌దే ఈ ఘనత

గత ఏడాది కూడా సుధీర్‌దే ఈ ఘనత

గత డిసెంబర్‌లో ఆర్మాక్స్ మీడియా 2020 సంవత్సరానికి సంబంధించిన జాబితాను కూడా విడుదల చేసింది. ఇందులో ఉత్తమ ఎంటర్‌టైనర్‌ విభాగంలో తెలుగు రాష్ట్రాల నుంచి సుడిగాలి సుధీర్ (ఢీ షో) ఎంపికయ్యాడు. అలాగే, హిందీలో కపిల్ శర్మ, తమిళంలో పుగజ్, బెంగాళీలో అభిర్ చటర్జీ, మరాఠీలో భానూ కదమ్ అనే ఆర్టిస్టులు ఎంపికైన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X