»   » బిగ్ బాస్ ఓటింగులో మోసం? తారక్ క్లారిటీ.... ఇంట్లోకి ఎంటరైన యాంకర్ సుమ!

బిగ్ బాస్ ఓటింగులో మోసం? తారక్ క్లారిటీ.... ఇంట్లోకి ఎంటరైన యాంకర్ సుమ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

'బిగ్ బాస్' షోలో యాంకర్ సుమ పాల్గొంటోందంటూ గతంలో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో యాంకర్ అనసూయ తదితరుల పేర్లతో పాటు సుమ పేరు కూడా వినిపించింది. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా నవదీప్, దీక్షా పంత్ రావడంతో అవన్నీ కేవలం పుకార్లే అని తేలిపోయింది.

అయితే తాజాగా సెప్టెంబర్ 2న జరిగిన ఎన్టీఆర్ హోస్ట్ ఎపిసోడ్లో.... అటు ప్రేక్షకులను, ఇటు బిగ్ బాస్ ఇంటి సభ్యులను సర్‌ప్రైజ్ చేస్తూ యాంకర్ సుమ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆమె వచ్చింది కంటెస్టెంట్‌గా కాదని, స్పెషల్ ఇన్స్‌స్పెక్షన్ ఆఫీసర్‌గా అని ఎన్టీఆర్ తెలిపారు.

విమర్శలకు చెక్ పెట్టిన ఎన్టీఆర్

విమర్శలకు చెక్ పెట్టిన ఎన్టీఆర్

బిగ్ బాస్ షోలో ఎలిమినేషన్ ప్రక్రియ పారదర్శకంగా లేదని విమర్శలు రావడంతో దీనిపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు ఎన్టీఆర్. గతవారం ఎలిమినేషన్‌కు సంబంధించిన లెక్కలు ప్రేక్షకులకు వివరించారు. కేవలం ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారమే ఎలిమినేషన్ జరుగుతోందని తెలిపారు.

Bigg Boss Telugu : Anchor Suma Entered Into Bigg Boss House
ఎలాంటి మోసం లేదు

ఎలాంటి మోసం లేదు

ప్రతి ఓటును ఒక పెద్ద సంస్థ ద్వారా ఆడిటింగ్ చేసి ఆ ఓట్లను కౌంటింగ్ లోకి తీసుకోవడం జరుగుతుందని, ఈ విషయంలో ప్రేక్షకులు ఎలాంటి సందేహం పడాల్సిన అవసరం లేదని, మోసం, మాయ, మర్మం లేదని ఎన్టీఆర్ తెలిపారు.

1.90 కోట్ల ఓట్లు

1.90 కోట్ల ఓట్లు

గతవారం ఎలిమినేషన్లో కత్తి కార్తీక, ధనరాజ్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఆ వారం మొత్తం 1.90 కోట్ల ఓట్లు ప్రేక్షకులు వేశారని, అందులో శివ బాలాజీ, అర్చనలకు ఎక్కువ ఓట్లు పడటం వల్ల సేవ్ అయ్యారని, వారికంటే తక్కువ ఓట్లు పడ్డ కత్తి కార్తీయ, ధనరాజ్ ఎలిమినేట్ అయ్యారని ఎన్టీఆర్ తెలిపారు.

ఈ వారం ఎవరు?

ఈ వారం ఎవరు?

ఈ వారం ప్రేక్షకులు మొత్తం 2 కోట్ల ఓట్లు వేశారని, ఇందులో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారు షోలో కొనసాగుతారని..... అతి తక్కువ ఓట్లు వచ్చిన వారు ఇంటి నుండి ఈవారం ఎలిమినేట్ అవుతారని, ప్రేక్షకుల ఓటింగే తమకు శిరోదార్యమని ఎన్టీఆర్ తెలిపారు.

నాటీవీలో శుక్రవారం, బాలాజీని కొరికేశారు

నాటీవీలో శుక్రవారం, బాలాజీని కొరికేశారు

శుక్రవారం జరిగిన సంఘటనలు నాటీవీ ద్వారా ఎన్టీఆర్ ప్రేక్షకులకు చూపించారు. ఈ రోజు కొన్ని ఫన్నీ సంఘటనలు చోటు చేసుకున్నాయి. అర్చన, హరితేజ, దీక్ష సేథ్ లను ఇతర సభ్యులంతా కలిసి స్విమ్మింగ్ ఫూల్ లో పడేశారు. తర్వాత శివ బాలాజీ మీద దీక్ష, ముమైత్, హరితేజ కలిసి సరదాగా దాడి చేశారు. అతడిని కొరికేశారు. దీంతో ఆగ్రహానికి గురైన శివ బాలాజీ మీకు కుక్కలా? మనుషులా? అంటూ పైర్ అయ్యాడు.

సుమ రాకతో బిగ్ బాస్ ఇంట్లో సందడి

సుమ రాకతో బిగ్ బాస్ ఇంట్లో సందడి

యాంకర్ సుమ రాకతో ‘బిగ్ బాస్' ఇంట్లో సందడి వాతావరణం నెలకొంది. ఇంట్లోని పరిస్థితులను పరిశీలించిన సుమ..... సభ్యులు ఇంటి శుభ్రత విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు తదితర అంశాల విషయంలో ఆమె తనిఖీ చేశారు.

సుమ సరదాగా

సుమ సరదాగా

సుమ రాకతో బిగ్ బాస్ ఇంట్లో సరదా సరదాగా సాగింది. ఆమె ద్వారా బిగ్ బాస్ ఇంటి సభ్యులతో గేమ్స్ ఆడించారు. ఈ ఎపిసోడ్ ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టెన్ చేసింది.

మా బతుకేమిటో..?

మా బతుకేమిటో..?

తారక్ చాలా బాగా యాంకరింగ్ చేస్తున్నాడని, ఇంత బాగా చేస్తే రేపు మా బతుకేమిటో అంటూ.... యాంకర్ సుమ చమత్కరించారు. దీనికి ఎన్టీఆర్ స్పందిస్తూ మా అందరికీ ఇన్స్‌స్పిరేషనే నువ్వే, మీరే మా గురువు అంటూ సమాధానం ఇచ్చారు. మన మధ్య గారు అనే మర్యాదలు వద్దు అని సుమకు సూచించారు. సుమ భర్త రాజీవ్ కనకాల ప్రస్తావనతో ఎన్టీఆర్ కాసేపు కామెడీ చేశాడు.

ముమైత్, దీక్ష, అర్చన

ముమైత్, దీక్ష, అర్చన

ఈ వారం ఎలిమినేషన్లో ముమైత్ దీక్ష, అర్చన మిగిలారు. వారిలో ఎవరు ఇంటి నుండి బయటకు వెళ్లిపోతారు అనేది ఆదివారం జరిగే షోలో ఎన్టీఆర్ వెల్లడించనున్నారు.

English summary
Popular anchor Suma visits the Bigg Boss House and says that she has come to inspect the house. Later, Jr NTR announces the names of the contestants who are saved from eviction!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu