For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రాత్రి మొత్తం అమ్మాయిలతోనే గడుపుతాడు: సోహెల్ నిజస్వరూపం బయటపెట్టిన సోదరుడు

  |

  బిగ్ బాస్ అంటేనే అన్ని రకాల ఎమోషన్స్‌తో నడిచే రియాలిటీ షో. అందుకే దీనికి తెలుగులో రికార్డు స్థాయిలో రేటింగ్ వస్తూ దూసుకుపోతోంది. ప్రస్తుతం ప్రసారం అవుతోన్న నాలుగో సీజన్‌కూ ప్రేక్షకులు మంచి స్పందనను అందిస్తున్నారు. దీంతో ఇది కూడా సూపర్ హిట్ దిశగా సాగిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో శనివారం హోస్ట్ అక్కినేని నాగార్జున కంటెస్టెంట్ల కోసం వాళ్ల వాళ్ల కుటుంబ సభ్యులను మరోసారి తీసుకొచ్చాడు. ఈ క్రమంలోనే సోహెల్ నిజస్వరూపం బయటపడింది. అతడి క్యారెక్టర్‌పై అందరి ముందరే సోదరుడు షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆ సంగతులు మీకోసం.!

  జూనియర్ ఎన్టీఆర్ ఫ్రెండ్.. ఫస్ట్ సినిమా ఇదే

  జూనియర్ ఎన్టీఆర్ ఫ్రెండ్.. ఫస్ట్ సినిమా ఇదే

  సయ్యద్ సోహెల్ రియాన్.. కొద్ది రోజులుగా మారుమ్రోగిపోతోన్న పేరిది. అతడి కెరీర్ చూస్తే.. ‘కొత్త బంగారు లోకం' అనే సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ‘పిచ్చిగా నచ్చావ్', ‘జనతా గ్యారేజ్', ‘సరైనోడు' వంటి చిత్రాల్లో కీలక పాత్రలు చేశాడు. అలాగే, ‘యూరేకా' అనే మూవీలో లీడ్ రోల్ చేశాడు. వీటితో పాటు ‘పసుపు కుంకుమ', ‘నాతిచరామీ' అనే సీరియల్స్‌లో నటించాడు.

  ఆమెతో కలిసి సీక్రెట్‌ రూమ్‌లో కొన్ని రోజులు

  ఆమెతో కలిసి సీక్రెట్‌ రూమ్‌లో కొన్ని రోజులు

  సినిమాలు, సీరియల్స్‌తో కెరీర్ సాఫీగా సాగిపోతోన్న సమయంలో సోహెల్.. బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అంగరంగ వైభవంగా జరిగిన ప్రీమియర్ ఎపిసోడ్‌లో అతడిని, మరో కంటెస్టెంట్ ఆరియానా గ్లోరీతో కలిసి సీక్రెట్‌ రూమ్‌లోకి పంపాడు హోస్ట్ నాగార్జున. అక్కడ ఈ ఇద్దరూ కొన్ని రోజుల పాటు కలిసున్న తర్వాత బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.

  ‘కథ వేరే ఉంటది' అంటూ ఫేమస్ అయ్యాడు

  ‘కథ వేరే ఉంటది' అంటూ ఫేమస్ అయ్యాడు

  టాస్కుల పరంగా వందకు వంద శాతం శ్రమిస్తుంటాడు సోహెల్. ఈ క్రమంలోనే ఎదుటి వారితో గొడవలకు కూడా దిగుతుంటాడు. బిగ్ బాస్ హౌస్‌లో సహనం కోల్పోయి ఎన్నో సార్లు వాగ్వాదానికి దిగాడు కూడా. దీంతో నాగార్జున ఆగ్రహానికి కూడా గురయ్యాడు. ఇక, గొడవలకు దిగిన సమయంలో సోహెల్ వాడే ‘కథ వేరే ఉంటది' అనే డైలాగ్ ఎంతగానో ఫేమస్ అయింది.

  నాగార్జునకు ప్రామిస్‌.. మొదట్లో మారినా..

  నాగార్జునకు ప్రామిస్‌.. మొదట్లో మారినా..

  తరచూ ఏదో ఒక గొడవ పడుతుండడంతో హోస్ట్ నాగార్జున.. సోహెల్ రియాన్‌కు గట్టిగా చీవాట్లు పెట్టాడు. ఆ సమయంలోనే ఈ యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇకపై కోప్పడనని ఆయనకు ప్రామిస్ చేశాడు. అందుకు అనుగుణంగానే చాలా రోజుల పాటు సహనంగా కనిపించాడు. కానీ, వారం ప్రారంభంలో జరిగే నామినేషన్ టాస్కుల్లో మాత్రం ఎదుటి వారిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నాడు.

   సోహెల్ నిజస్వరూపం బయటపెట్టిన అన్న

  సోహెల్ నిజస్వరూపం బయటపెట్టిన అన్న

  శనివారం జరిగిన ఎపిసోడ్‌లో అక్కినేని నాగార్జున కంటెస్టెంట్లు అందరికీ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. మరోసారి మీ కుటుంబ సభ్యులను తీసుకొస్తానని చెప్పిన ఆయన.. అందుకోసం తాను అడిగిన ప్రశ్నకు సేఫ్ గేమ్ ఆడకుండా జవాబు చెప్పాలని అన్నాడు. దీనిని సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేయడంతో సోహెల్ తమ్ముడు, అన్న ఎంట్రీ ఇచ్చారు. వాళ్లు చెప్పిన కొన్ని సీక్రెట్లతో పరువు పోగొట్టుకున్నాడు.

  రాత్రి మొత్తం అమ్మాయిలతోనే గడుపుతాడు

  రాత్రి మొత్తం అమ్మాయిలతోనే గడుపుతాడు

  స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చిన ఫ్యామిలీ ఫ్రెండ్ మాట్లాడుతూ.. ‘మా వాడు రాత్రి 9 దాటితే కథ వేరేలా నడిపిస్తాడు. మిడ్ నైట్ వరకూ అమ్మాయిలతో చాట్ చేస్తాడు. ప్రతి అమ్మాయితోనూ ఒకేలా మాట్లాడతాడు. నేను పనిలో ఉన్నా తర్వాత చేస్తా అని చెప్పి మరో అమ్మాయితో చాట్ చేస్తాడు. ఇలా ప్రతిరోజూ చేస్తాడు' అని సోహెల్ రియాన్ నిజస్వరూపం బయట పెట్టడంతో అంతా షాకయ్యారు.

  English summary
  Bigg Boss 4 is the fourth season of the Telugu version of the Indian reality television series Bigg Boss based on Dutch series Big Brother. The show premiered on 6 September 2020 on Star Maa and Disney+ Hotstar with Akkineni Nagarjuna hosting the season for the second time.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X