గొప్ప మనసు చాటుకున్న సోహెల్.. ఎలిమినేట్ అయినా అలా పేరు తెచ్చుకున్నాడు

బిగ్ బాస్ నాలుగో సీజన్ గ్రాండ్ ఫినాలే ఆదివారం సాయంత్రం ప్రారంభం అయింది. అంగరంగ వైభవంగా జరుగుతోన్న ఈ ఎపిసోడ్‌ను అక్కినేని నాగార్జున తనదైన శైలిలో హోస్ట్ చేస్తున్నారు. మాజీ కంటెస్టెంట్లు అందరూ దీనికి హాజరవడంతో పాటు ప్రదర్శన కూడా ఇచ్చారు. ఆ తర్వాత సినీ తారల ఆటపాటలతో స్టేజ్ ఊగిపోతోంది. ఇప్పటికే ఈ షో నుంచి టాప్ -5లోని ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. తాజాగా సోహెల్ కూడా బయటకు వచ్చేశారు. ఎలిమినేట్ అయిన సమయంలో అతడు గొప్ప మనసు చాటుకున్నాడు. అసలేం జరిగింది.? పూర్తి వివరాలు మీకోసం!

ఐదో స్థానం.. మొదటి ఎలిమినేషన్ అదే

ఐదో స్థానం.. మొదటి ఎలిమినేషన్ అదే

గ్రాండ్ ఫినాలే గెస్టుగా వచ్చిన డైరెక్టర్ అనిల్ రావిపూడి, మోహ్రీన్ హౌస్‌లోకి ప్రవేశించారు. కంటెస్టెంట్లు అందరితో ఆటలు ఆడించిన ఆయన.. చివర్లలో ఒకరిని ఎలిమినేట్ చేసే బాధ్యతను తీసుకున్నారు. ఓటింగ్‌లో చివరి స్థానంలో ఉన్న దేత్తడి హారికను ఎలిమినేట్ చేశారు. క్రెయిన్ ద్వారా ఆమెను హౌస్ నుంచి బయటకు తీసుకొచ్చారు. దీంతో షోలో నలుగురు మిగిలారు.

నాలుగో స్థానం.. బోల్డ్ బ్యూటీ బయటకు

నాలుగో స్థానం.. బోల్డ్ బ్యూటీ బయటకు

మొదటి నుంచీ అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంది బోల్డ్ బ్యూటీ ఆరియానా గ్లోరీ. అసాధారణ ప్రదర్శనతో ఫినాలే వరకు చేరిన ఆమె.. షో నుంచి బయటకు వచ్చేసింది. ఫినాలే ఎపిసోడ్‌లో హౌస్‌లోకి వెళ్లిన లక్ష్మీ రాయ్.. నలుగురు సభ్యులకు పది లక్షల రూపాయలు ఆఫర్ చేసింది. దీన్ని ఎవరూ తీసుకోలేదు. దీంతో తక్కువ ఓట్లు వచ్చిన ఆరియానా గ్లోరీ ఎలిమినేట్ అయింది.

 ఆఫర్‌కు ఆకర్షితుడైన సయ్యద్ సోహెల్

ఆఫర్‌కు ఆకర్షితుడైన సయ్యద్ సోహెల్

ఇద్దరు అమ్మాయిలు ఎలిమినేట్ అవడంతో బిగ్ బాస్ హౌస్‌లో ముగ్గురు కంటెస్టెంట్లు అభిజీత్, అఖిల్ సార్థక్, సయ్యద్ సోహెల్ రియాన్ మిగిలారు. వీళ్లకు బిగ్ బాస్ రూ. 20 లక్షలు ఆఫర్ ఇచ్చాడు. దీనికి ఎవరూ ఒప్పుకోలేదు. ఆ తర్వాత మరో ఐదు లక్షలు పెంచి దాన్ని రూ. 25 చేశారు. నాగార్జున ప్రకటించిన ఈ ఆఫర్‌కు సోహెల్ టెంప్ట్ అయ్యాడు. దీంతో బయటకు వచ్చేశాడు.

Recommended Video

Bigg Boss Telugu 4 : Netizens trolls bigg Boss for splitting winner Abhijeet prize money to Sohel
 గొప్ప మనసు చాటుకున్న కంటెస్టెంట్

గొప్ప మనసు చాటుకున్న కంటెస్టెంట్

రూ. 25 లక్షలు తీసుకుని బయటకు వచ్చేందుకు సమ్మతించిన సోహెల్.. అందులో పది లక్షల రూపాయలు అనాథలకు ఇవ్వబోతున్నట్లు ప్రకటించాడు. దీంతో స్టేజ్ కింద ఉన్న మాజీ కంటెస్టెంట్లు, కుటుంబ సభ్యులు కేకలతో అతడిని ప్రశంసించారు. ఈ ఒక్క సన్నివేశంతో సోహెల్ హీరో అయిపోయాడు. ఎలిమినేట్ అయినా అతడిపై అభినందనల వర్షం కురుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X