Just In
Don't Miss!
- News
ఇండోనేసియా భూకంపం: 42కు పెరిగిన మృతులు -వందల ఇళ్లు ధ్వంసం -చీకట్లో సులవేసి దీవి
- Finance
ఈ ఒక్కరోజులో రూ.2.23 లక్షల కోట్ల సంపద హుష్‌కాకి
- Sports
పతంగి ఎగురవేసిన ఇర్ఫాన్ పఠాన్.. కైట్ కోసం పిల్లల పాట్లు వీడియో
- Lifestyle
సినిమా థియేటర్ కు వెళ్దామనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే...
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అఖిల్ సార్థక్‌కు మరో షాకిచ్చిన సోహెల్: పులి డైలాగ్‌తో రచ్చ.. వాళ్లను కూల్ చేయమని రిక్వెస్ట్
బిగ్ బాస్ అంటేనే ఫుల్ ఆఫ్ ఎమోషన్స్‌తో సాగే షో. మొదటి సీజన్ నుంచి ఇటీవల ముగిసిన నాలుగో సీజన్ వరకు ప్రతి దానిలోనూ హౌస్‌మేట్ల మధ్య బంధాలు బలపడడం చూశాం. అన్నింటితో పోలిస్తే ఈ సారి మాత్రమే షో మరింత ఎమోషనల్‌గా సాగింది. ఈ సీజన్‌లో మూడు లవ్ ట్రాకులు నడిపినట్లు చూపించినా.. వాళ్ల కంటే కంటెస్టెంట్ల మధ్య స్నేహం బాగా హైలైట్ అయింది. అందులో మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అఖిల్ సార్థక్ - సోహెల్ రిలేషన్ గురించే. షో మొత్తం బ్రదర్స్‌లా ఉన్నారీ ఇద్దరూ. ఈ నేపథ్యంలో సోహెల్.. అఖిల్‌కు భారీ షాకిచ్చాడు. ఆ వివరాలు మీకోసం!

వాళ్లిద్దరి బంధం బాగా హైలైట్ అయింది
బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో సయ్యద్ సోహెల్ రియాన్.. మెహబూబ్ దిల్‌సే బాగా క్లోజ్ అయ్యారు. షో ఆరంభం నుంచే స్నేహంగా ఉంటూ వచ్చారు. వీళ్లతో పాటు అఖిల్ సార్థక్ కూడా ఫ్రెండ్‌షిప్ చేశాడు. మెహబూబ్ ఎలిమినేట్ అయిన తర్వాత అఖిల్ సార్థక్ - సోహెల్ రిలేషన్ మరింత బలపడింది. అన్నాదమ్ములం అని చెప్పుకుంటూ కలిసే ఉండేవాళ్లీ ఇద్దరు యంగ్ స్టార్లు.

ఆ త్యాగంతో హీరో అయిపోయిన సోహెల్
టాప్ - 5 కోసం ఏడుగురు కంటెస్టెంట్లు పోటీ పడుతున్న సమయంలో బిగ్ బాస్ ‘రేస్ టు ఫినాలే' అనే టాస్క్ ఇచ్చాడు. అందులో అఖిల్ సార్థక్ - సయ్యద్ సోహెల్ రియాన్ తుది దశకు చేరుకున్నారు. ఆ సమయంలో దాదాపు 24 గంటల పాటు అందులో పోటీ పడ్డారు. ఈ నేపథ్యంలో అఖిల్ కోసం సోహెల్ దీన్ని త్యాగం చేశాడు. తద్వారా అందరి ముందు హీరో అయ్యాడు.

ఫినాలేలో అలా చేయడంతో అఖిల్ షాక్
బిగ్ బాస్‌లో ఎవరు గెలిచినా ఒక ల్యాప్‌టాప్.. ఒక బైక్ కొనివ్వాలని అఖిల్ సార్థక్ - సోహెల్ డీల్ కుదుర్చుకున్నారు. కానీ ఫినాలేలో వీళ్లిద్దరూ గెలవకుండా అభిజీత్ విజయం సాధించాడు. అయినప్పటికీ సోహెల్ రూ. 25 లక్షలు తీసుకున్నాడు. అందులో పది లక్షలు అనాథ శరణాలయానికి, ఐదు లక్షలు మెహబూబ్‌కు ఇస్తానని చెప్పి అఖిల్‌కు భారీ షాక్ ఇచ్చాడు.

ఒంటరిగా మిగిలి.. అలాంటి కామెంట్స్‌తో
బిగ్ బాస్ షో తర్వాత టాప్ -5 కంటెస్టెంట్లకు భారీ స్థాయిలో ప్రజాధరణ లభిస్తోంది. దీంతో అందరూ ఎంతో ఉత్సాహంగా గడుపుతున్నారు. ఇలాంటి సమయంలో పలు ఇంటర్వ్యూల్లో పాల్గొని తమ సంతోషాన్ని వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో అఖిల్ సార్థక్ మాత్రం నిరుత్సాహంగా కనిపిస్తున్నాడు. తనకు ఎవరూ అండగా నిలవలేదని, ఒంటరిని చేశారని ఆవేదనను వెల్లగక్కాడు.

అఖిల్ సార్థక్‌కు మరో షాకిచ్చిన సోహెల్
గ్రాండ్ ఫినాలేలో మెహబూబ్‌కు డబ్బులు ఇస్తానని చెప్పిన సయ్యద్ సోహెల్ రియాన్.. అతడితోనే ఎక్కువగా సమయాన్ని గడుపుతూ కనిపించాడు. బయటకు వచ్చిన తర్వాత కూడా వీళ్లిద్దరూ కలిసే ఉన్నారు. అలాగే, రూ. 25 లక్షలు సంపాదించానన్న సంతోషంతో పాటు చిరు, నాగ్ ప్రశంసలతో సోహెల్ ఖుషీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో అభినీ పులితో పోల్చి అఖిల్‌కు మరో షాక్ ఇచ్చాడు.

వాళ్లను కూల్ చేయమని రిక్వెస్ట్ చేశాడు
తాజాగా అభిజీత్ ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. దానికి కాల్ చేసిన సోహెల్.. అతడిని సర్‌ప్రైజ్ చేశాడు. అంతేకాదు, ‘అభిజీత్ నిజాయితీగా ఆడాడు. అందుకే అందరి హృదయాలను కొల్లగొట్టాడు. అంతేకాదు, బిగ్ బాస్ హౌస్‌లో అభి ఒక్కడే పులి అనిపించుకున్నాడు' అని చెప్పాడు. అలాగే, బయట జరుగుతోన్న గొడవలను ఆపేలా చేయమని అభీకి రిక్వెస్ట్ చేశాడు సోహెల్.