Just In
Don't Miss!
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- News
రిపబ్లిక్ డే: ట్రాక్టర్ ర్యాలీకి రూట్ మ్యాప్.. పరేడ్ నేపథ్యంలో ఆంక్షలు.. పబ్లిక్కు కూడా..
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మోనాల్ గజ్జర్ విషయంలో నోరు జారిన సోహెల్: పొరపాటున మేటర్ లీక్ చేసి అఖిల్‌ను బుక్ చేశాడు
తెలుగులో బిగ్ బాస్ షో చూపిస్తోన్న ప్రభావం అంతా ఇంతా కాదు. టెలివిజన్ రంగంలో ఎన్నో రికార్డులను క్రియేట్ చేయడంతో పాటు ఎంతో మంది చిన్న ఆర్టిస్టులను సెలెబ్రిటీలుగా మార్చేస్తోందీ రియాలిటీ షో. ఇలా నాలుగో సీజన్‌లో పలువురు కంటెస్టెంట్లు విపరీతమైన క్రేజ్‌ను అందుకున్నారు. వారిలో సింగరేణి ముద్దుబిడ్డ సయ్యద్ సోహెల్ రియాన్ ఒకడు. గతంలో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ గుర్తింపు దక్కించుకోని అతడు.. బిగ్ బాస్ వల్ల పాపులర్ అయ్యాడు. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో మోనాల్ - అఖిల్ సీక్రెట్ లీక్ చేసి షాకిచ్చాడు. ఆ వివరాలు మీకోసం!

సోహెల్ కెరీర్... మొదలైంది ఆ మూవీతోనే
చిన్న వయసులోనే ‘కొత్త బంగారు లోకం' సినిమాతో నటుడిగా పరిచయం అయ్యాడు సయ్యద్ సోహెల్ రియాన్. అప్పటి నుంచి ఎన్నో చిత్రాల్లో నటించాడతను. మరీ ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘జనతా గ్యారేజ్', అల్లు అర్జున్ చిత్రం ‘సరైనోడు' వంటి బడా మూవీలలో కీలక పాత్రలు పోషించాడు. అదే సమయంలో కొన్ని సీరియళ్లలోనూ నటించి పేరు తెచ్చుకున్నాడీ యాక్టర్.

ఆమెతో కలిసి రహస్యంగా.. ఆడుకున్నారు
తక్కువ సినిమాలే చేసినా బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంపికైన సోహెల్.. అందరు కంటెస్టెంట్లలా కాకుండా ఆరియానా గ్లోరీతో కలిసి సీక్రెట్ రూమ్‌లోకి ప్రవేశించాడు. వీళ్లిద్దరూ కలిసి రెండు రోజుల పాటు అక్కడి నుంచి రచ్చ రచ్చ చేశారు. అదే సమయంలో మిగిలిన కంటెస్టెంట్లతో ఫోన్ కాల్ మాట్లాడుతూ ఓ ఆట ఆడుకున్నారు. ఆ తర్వాత హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.

బిగ్ బాస్ షోలో హల్‌చల్... కథ వేరే ఉంది
సోహెల్‌కు ఎక్కువగా గుర్తింపు తెచ్చింది బిగ్ బాస్ హౌస్‌లో జరిగిన టాస్కులే. అన్నింట్లోనూ ముందుంటూ తన మార్క్ చూపించాడు. ఫిజికల్ టాస్కులు మాత్రమే కాదు.. ఎలాంటి గేమ్ అయినా తనకు తానే పోటీ అన్నట్లుగా ముందుకు సాగేవాడు. అయితే, ‘కథ వేరే ఉంటది' అంటూ తరచూ గొడవలకు దిగడం అతడికి మైనస్‌గా మారింది. మధ్యలో మారినా తర్వాత కంటిన్యూ చేశాడు.

బిగ్ బాస్‌ను అలా ముగించిన యంగ్ గన్
సాదాసీదా కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి వచ్చిన సోహెల్.. బాగానే లాభపడ్డాడు. ప్రేక్షకుల ఆదరణను దక్కించుకోవడంతో పాటు ఫినాలేకు చేరుకున్నాడు. టాప్-3లో ఉన్న సమయంలో బిగ్ బాస్ ఇచ్చిన రూ. 25 లక్షల ఆఫర్‌కు ఓకే చెప్పి మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు సోహెల్. రెమ్యూనరేషన్‌తో కలిసి దాదాపు రూ. 60 లక్షల వరకూ సంపాదించాడు.

మోనాల్ విషయంలో నోరు జారిన సోహెల్
బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అందరి కంటే ముందే సినిమాను ప్రకటించాడు సోహెల్. అంతేకాదు, వరుస ఇంటర్వ్యూలతో బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌తో చిట్ చాట్ చేశాడు. ఈ సందర్భంగా యాంకర్.. ‘ఆరియానా, మోనాల్, హారికలో ఎవరిని పెళ్లి చేసుకుంటావు' అని అడగగా.. ఊహించని సమాధానం ఇచ్చాడు.

పొరపాటున లీక్ చేసి అఖిల్‌ను బుక్ చేశాడు
ఆరియానాను పెళ్లి చేసుకుంటానని చెప్పిన సోహెల్.. మోనాల్ తనకు చెల్లితో సమానం అని అన్నాడు. అక్కడితో ఆగితే బాగుండేది. కానీ, ‘మోనాల్ నాకు సిస్టర్ టైప్. అయినా ఆమెకు అఖిల్ ఉన్నాడుగా. అతడు చేసుకుంటాడు' అంటూ నోరు జారాడు. తర్వాత కవర్ చేసుకుంటూ ఏదో కథలు చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.