Just In
- 15 min ago
టాలీవుడ్లో మరో భారీ మల్టీస్టారర్: బన్నీ, విజయ్ కాంబోలో మూవీ.. చిన్న డైరెక్టర్.. పెద్ద నిర్మాత ప్లాన్!
- 42 min ago
భర్త చేసిన పనికి అప్పుడే కన్నీళ్లు పెట్టుకున్న నిహారిక.. ఏకంగా వీడియో రిలీజ్ చేసి..
- 1 hr ago
మళ్లీ ప్రేమలో పడ్డ శృతి హాసన్: అతడితో అయిపోయిందంటూ.. పుసుక్కున నోరు జారి బుక్కైంది
- 2 hrs ago
RRR నుంచి అదిరిపోయే అప్డేట్: గుడ్ న్యూస్ చెప్పిన ఎన్టీఆర్, చరణ్.. వాళ్లిచ్చే సర్ప్రైజ్ అదే!
Don't Miss!
- News
అప్పుడెందుకు వాయిదా వేశారు ? జగన్ కు మద్దతుగా పంచాయితీ పోరుపై నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు
- Finance
సెన్సెక్స్ దిద్దుబాటు! నిర్మల ప్రకటన అంచనాలు అందుకోకుంటే.. మార్కెట్ పతనం?
- Lifestyle
Zodiac signs: మీ రాశిని బట్టి మీకు ఎలాంటి మిత్రులు ఉంటారో తెలుసా...!
- Sports
ఇంగ్లండ్ అలా చేయకుంటే భారత్‌ను అవమానపరిచినట్టే.. జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్ల ఫైర్!
- Automobiles
ఇదుగిదిగో.. కొత్త 2021 ఫోర్స్ గుర్ఖా; త్వరలో విడుదల, కొత్త వివరాలు వెల్లడి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆరియానా నిజస్వరూపం బయటపెట్టిన సోహెల్: అలా చేయడం వల్లే గొడవ జరిగిందంటూ!
బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో జంటగా సీక్రెట్ రూమ్‌లోకి ఎంట్రీ ఇచ్చి మిగిలిన కంటెస్టెంట్లను ఓ ఆట ఆడుకున్నారు ఆరియానా గ్లోరీ, సయ్యద్ సోహెల్ రియాన్. అందులో కలిసి ఆడిన ఇద్దరూ.. హౌస్‌లోకి ప్రవేశించిప్పటి నుంచి ఎవరి గేమ్‌పై వాళ్లు ఫోకస్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తరచూ ఈ ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. దీంతో టామ్ అండ్ జెర్రీగా పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వీళ్ల మధ్య భీకర ఫైటింగ్ జరిగింది. దీని ప్రభావం ఓటింగ్ పైనా పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆరియానా నిజస్వరూపం బయటపెట్టాడు సోహెల్. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

ఐదుగురి కోసం గోల్డెన్ మైక్ అవకాశం
ఫినాలేకు ఒక వారమే మిగిలి ఉండడంతో ఈ సారి అఖిల్ మినహా అందరినీ నేరుగా నామినేట్ చేశాడు బిగ్ బాస్. అంతేకాదు, ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని వాళ్లను నేరుగా ఓట్లు అడగొచ్చిన వాళ్లకు ఆఫర్ కూడా ఇచ్చాడు. అయితే, అందుకోసం టాస్కుల్లో గెలవాల్సి ఉంటుందని చెప్పాడు. అందుకు అనుగుణంగానే కంటెస్టెంట్లకు వరుసగా టాస్కులు ఇస్తున్నాడు పెద్ద బాస్.

ఆమె రెండు సార్లు.... సోహెల్ ఒకసారి
‘కింగ్ ఆర్ క్వీన్' అనే మొదటి టాస్కులో ఆరియానా గ్లోరీ విజేతగా నిలిచినట్లు చెప్పడంతో ఆమె కన్‌ఫెషన్ రూమ్‌కు వెళ్లి గోల్డెన్ మైక్ ద్వారా ప్రేక్షకులను ఓట్లు అడిగింది. ఆ తర్వాత జరిగిన ఓపిక టాస్కులో సోహెల్ గెలుపొందాడు. అతడు కూడా ఓట్లు అభ్యర్ధించాడు. ఇక, ఏకాగ్రత పేరిట జరిగిన మూడో టాస్కులోనూ ఆరియానా విజయం సాధించి రెండోసారి ఆ అవకాశం అందుకుంది.

పెద్ద గొడవ.. కొట్టుకుంటారా అనేంతగా
ఓపిక టాస్క్ జరుగుతోన్న సమయంలో మొదట మోనాల్‌తో, ఆ తర్వాత సయ్యద్ సోహెల్ రియాన్‌తో గొడవలు పెట్టుకుంది ఆరియానా గ్లోరీ. మరీ ముఖ్యంగా టామ్ అండ్ జెర్రీ ఫైట్ భీకరంగా సాగింది. వీళ్లిద్దరూ కొట్టుకుంటారా అనేంతగా ఒకరి పైకి ఒకరు దూసుకుపోయారు. ఈ ఘటనలో ఆరియానా కింద పడిపోయి మరీ ఏడవగా, సోహెల్ పలుమార్లు కన్నీటి పర్యంతం అయ్యాడు.

కలిసేందుకు ప్రయత్నించినా నో యూజ్
ఈ గొడవ తర్వాత ఆరియానా సైలెంట్ అయిపోయింది. కానీ సోహెల్ మాత్రం తరచూ దీన్ని ప్రస్తావిస్తూ బిగ్ బాస్‌కు ఆమెపై కంప్లైంట్లు చేస్తున్నాడు. అదే సమయంలో ఓ సారి ఆమెతో పంచాయితీ క్లియర్ చేసుకోడానికి ప్రయత్నించాడు. కానీ, ఓ మగాడు తనపైకి అలా రావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని ఆరియానా చెప్పడంతో చేసేదేం లేక అక్కడి నుంచి వెళ్లిపోయాడు సోహెల్.

వినోదం టాస్కులో ఆమె అలా అనడంతో
శుక్రవారం కంటెస్టెంట్లకు వినోదం టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. దీని ప్రకారం.. తక్కవ సైజ్ షూ వేసుకుని గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన స్టేజ్‌పై డ్యాన్స్ చేయాల్సి ఉంటుంది. పాట ఆగిపోయినప్పుడల్లా ఒక కంటెస్టెంట్ దిగాలి. మొదటి రౌండ్‌లో రెండు సార్లు చాన్స్ వచ్చిన ఆరియానాను అంతా దిగమనగా.. తాను తర్వాత దిగుతానని మంకు పట్టు పట్టింది.

నిజస్వరూపం బయటపెట్టిన సోహెల్
ఫస్ట్ రౌండ్‌లో అభిజీత్ నిష్క్రమించాడు. ఆ తర్వాత ఆరియానా వెళ్తూ.. ‘హౌస్‌మేట్స్ అందరికీ ఛాన్స్ ఇవ్వడం కోసం దిగుతున్నా' అని చెప్పింది. టాస్క్ తర్వాత దీన్ని ప్రస్తావిస్తూ ‘చూశారా బిగ్ బాస్. మొన్న ఓపిక టాస్కులో హౌస్‌మేట్ల కోసం ఓడిపో అని అడిగితే పెద్ద గొడవ చేసింది. ఈరోజు ఇలా మాట్లాడుతుంది. ఆరియానా నిజస్వరూపం ఇదే బిగ్ బాస్' అంటూ సోహెల్ చెప్పుకొచ్చాడు.