For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బాలీవుడ్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్ సోహెల్: అందులో నటిస్తున్నట్లు పొరపాటున లీక్ చేసేశాడు

  |

  'కొత్త బంగారు లోకం' సినిమాతో నటుడిగా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు సింగరేణి ముద్దుబిడ్డ సయ్యద్ సోహెల్ రియాన్. అప్పటి నుంచి ఇండస్ట్రీలోనే ఉన్న అతడు ఎన్నో సినిమాల్లో మంచి మంచి పాత్రలు పోషించాడు. కొన్నేళ్ల క్రితం బుల్లితెరపైకీ ఎంట్రీ ఇచ్చి కొన్ని సీరియళ్లలో నటించాడు. ఇలా వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న సమయంలో బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు.

  దీని వల్ల ఊహించని రీతిలో పాపులర్ అయిన అతడు.. బయటకు వచ్చిన తర్వాత ఎన్నో ఆఫర్లను అందుకుంటున్నాడు. ఈ క్రమంలోనే సోహెల్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ విషయాన్ని అతడే పొరపాటున లీక్ చేశాడు. ఆ వివరాలు మీకోసం!

  ఆమెతో కలిసి రహస్యంగా లోపలికి

  ఆమెతో కలిసి రహస్యంగా లోపలికి

  బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో అవకాశం అందుకున్న సయ్యద్ సోహెల్ రియాన్.. అందరిలా కాకుండా ఆరియానా గ్లోరీతో కలిసి సీక్రెట్ రూమ్‌లోకి వెళ్లాడు. అక్కడి నుంచి రెండు రోజుల పాటు కంటెస్టెంట్లకు కొన్ని టాస్కులు ఇచ్చి ఆడుకున్న అతడు.. ఆ తర్వాత హౌస్‌లోకి వెళ్లాడు. వెళ్లిన కొత్త అతడిని మిగిలిన హౌస్‌మేట్స్ అంతా లైట్ తీసుకున్న విషయం తెలిసిందే.

  అసాధారణ ఆట.. కోపంతో ఫేమస్

  అసాధారణ ఆట.. కోపంతో ఫేమస్

  బిగ్ బాస్ ఇచ్చిన ఆదేశం మేరకు గొడవతోనే ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు సోహెల్. ఆ తర్వాత అన్ని టాస్కుల్లో ముందుంటూ తన మార్క్ చూపించాడు. ఫిజికల్ టాస్కులు మాత్రమే కాదు.. ఎలాంటి గేమ్ అయినా తానే కింగ్ అనిపించుకున్నాడు. అయితే, ‘కథ వేరే ఉంటది' అంటూ తరచూ గొడవలకు దిగడం అతడికి మైనస్‌గా మారినా.. తర్వాత దాన్ని అధిగమించి సత్తా చాటాడు.

  బిగ్ బాస్ ఆఫర్.. పోటీ నుంచి ఔట్

  బిగ్ బాస్ ఆఫర్.. పోటీ నుంచి ఔట్

  ఏమాత్రం అంచనాలు లేకుండా బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించిన సోహెల్.. ఊహించని విధంగా ప్రేక్షకుల ఆదరణను అందుకున్నాడు. ఈ క్రమంలోనే ఎన్నోసార్లు ఎలిమినేషన్ తప్పించుకుని గ్రాండ్ ఫినాలేలో అడుగు పెట్టాడు. ఫినాలేలో అభిజీత్, అఖిల్‌తో కలిసి టాప్-3లో ఉన్న సమయంలో బిగ్ బాస్ ఇచ్చిన రూ. 25 లక్షల ఆఫర్‌కు ఓకే చెప్పి మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు సోహెల్.

  వచ్చిన వెంటనే ప్రకటించిన సోహెల్

  వచ్చిన వెంటనే ప్రకటించిన సోహెల్

  సినిమా హీరోగా సత్తా చాటాలన్న లక్ష్యాన్ని బిగ్ బాస్ హౌస్‌ నుంచి బయటకు వచ్చిన వెంటనే నిజం చేసుకున్నాడు సోహెల్ రియాన్. గ్రాండ్ ఫినాలేలో చిరంజీవి ముందు ఇదే విషయాన్ని చెప్పిన అతడు.. తన సినిమాకు సాయం చేయాలని మెగాస్టార్‌ను కోరాడు. అందుకు ఆయన ఓకే చెప్పారు. అందుకు అనుగుణంగానే బయటికొచ్చిన వెంటనే ‘జార్జ్‌రెడ్డి' టీమ్‌తో సినిమా ప్రకటించాడు.

  బాలీవుడ్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్

  బాలీవుడ్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్

  బిగ్ బాస్ షో వల్ల వచ్చిన ఫేమ్‌తో సోహెల్ అదరగొడుతున్నాడు. ఎక్కడ చూసినా అతడే కనిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడికి ఎన్నో ఆఫర్లు కూడా వస్తున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే ఒక సినిమాను ప్రకటించిన సోహెల్.. మరికొన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్నాడని అంటున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ ఆఫర్ పట్టేసినట్లు తాజాగా అతడే రివీల్ చేయడం విశేషం.

  పొరపాటున రివీల్ చేసేసిన సోహెల్

  పొరపాటున రివీల్ చేసేసిన సోహెల్

  ‘ది రోజ్ విల్లా' అనే మూవీ ట్రైలర్ లాంచ్‌ ఈవెంట్‌కు సోహెల్ గెస్టుగా వచ్చాడు. ఈ సందర్భంగా నిర్మాత రామారావుతో ఉన్న అనుబంధం గురించి మాట్లాడుతూ.. ‘ఈ బ్యానర్ నా హోమ్ ప్రొడక్షన్ లాంటిది. బిగ్ బాస్‌కి ముందు రామారావు అన్న నాకు చాలా హెల్ప్ చేశారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ వెబ్ సిరీస్ ఛాన్స్ ఇప్పించారు. అది ఇప్పుడు చేస్తున్నా' అని ప్రకటనకు ముందే లీక్ చేశాడు.

  English summary
  Syed Sohel Ryan is an Indian actor who mostly works in the Telugu Film Industry. He was born in a middle-class family in Hyderabad. Syed Sohel Ryan in childhood He desired to become an actor since childhood.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X