»   » బిగ్ బాస్: ఓవియకు పెరిగిన క్రేజ్, శింబూ కూడా ఫిదా

బిగ్ బాస్: ఓవియకు పెరిగిన క్రేజ్, శింబూ కూడా ఫిదా

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: తమిళంలో సాగుతున్న కమల్ హాసన్ బిగ్ బాస్ షో కూడా హిట్టవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రియాల్టీ షోలో పాల్గొంటున్న నటి ఓవియాకు ఎక్కడ లేని క్రేజ్ వచ్చేసింది. ఈ రియాల్టీ షోకు ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ వ్యాఖ్యాతగా వ్యవరిస్తున్నాడు.

ఈ రియాల్టీ షోలో 14 మంది సినీ ప్రముఖులు పోటీకి దిగారు. వారిలో ఓవియా కూడా ఉంది. ఈ షోలో పాల్గొంటున్న ఓవియా ప్రవర్తనకు చాలా మంది ముగ్ధులవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి..

ఇప్పటి వరకు సినిమాల్లో పెద్దగా అవకాశాలు లేక సతమతవుతున్న ఓవియాకు మంచి క్రేజ్ వచ్చిందని అంటున్నారు. దాంతో అవకాశాలు కూడా తన్నుకుని వస్తున్నాయి.

శింబు కూడా...

శింబు కూడా...

ఓవియాకు శింబు లాంటి సినీ హీరోలు కూడా మద్దతు పలుకుతున్నారు. దీన్ని బట్టి ఆమె ఏ మేరకు పేరు సంపాదించుకుందో అర్థం చేసుకోవచ్చు. దాంతో సినిమాల్లో ఆమెకు అవకాశాలు మెండుగా వస్తున్నాయి.

Bigg Boss Telugu: Jr NTR Real Remuneration For Big Boss Show
శిరీష్ చిత్రంలో....

శిరీష్ చిత్రంలో....

మెట్రో చిత్రం ఫేమ్ శిరీష్ తన తాజా చిత్రంలో ఓవియను హీరోయిన్‌గా అవకాశం ఇస్తానని చెప్పారు. యామిరుక్క భయమే చిత్ర పార్టు - 2లో నటించే అవకాశాన్ని ఆమె సొంతం చేసుకుంది.. యామిరుక్క భయమే చిత్రంలో చిన్న పాత్రలో ఆమె ఇంతకు ముందు కనిపించింది. తాజాగా వచ్చే ఆ చిత్రం సీక్వెల్‌ల ముఖ్యమైన పాత్రను ఆమెకు ఇస్తారని సమాచారం.

విజయసేతుతో జోడీగా....

విజయసేతుతో జోడీగా....

అదే సమయంలో విజయ సేతుపతితో జోడీకి కట్టే అవకాశాన్ని ఓవియా దక్కించుకుంది. విజయసేతుపతితో నడువుల కొంచెం పక్కత్తు కానోమ్ చిత్రాన్ని బాలాజీ దరణీధరన్ ఇంతకు ముందు నిర్మించారు.. తాజాగా ఆయనతో మరో చిత్రం ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో హీరోయిన్‌గా ఓవియాకు అవకాశం కల్పిస్తారని సమాచారం.

బిగ్ బాస్ షోలో...

బిగ్ బాస్ షోలో...

అయితే, ప్రస్తుతం బిగ్ బాస్ షోలో ఉన్నందున విజయసేతుపతితో నటించే అవకాశాన్ని ఆమె కోల్పోవచ్చునని అంటున్నారు. కానీ షో నుంచి బయటకు రాగానే ఆమెకు అవకాశాలు విరివిగా వస్తాయని అంటున్నారు. బిగ్ బాస్ క్రేజ్ ఆమెను సినిమాల్లో బిజీ చేయవచ్చునని అంటున్నారు.

English summary
It is said that actress Oviya is rocking in Tamil Bigg Boss hosted by Kamal Hassan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu