»   » ఛీ కొట్టిన రెండో భార్య, విషం తాగి నటుడి ఆత్మహత్య!

ఛీ కొట్టిన రెండో భార్య, విషం తాగి నటుడి ఆత్మహత్య!

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: టీవీ నటుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటనతో తమిళ టీవీ నటుల సర్కిల్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమిళ టీవీ రంగంలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న స్టార్ సాయి ప్రశాంత్ తన నివాసంలో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మద్యంలో విషయం కలుపుకుని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు.

సాయి ప్రశాంత్ ఆత్మహత్యకు గల కారణాలు స్పష్టంగా తెలియక పోయినప్పటికీ ఒంటరి తనం భరించలేకనే అతను ఆత్మహత్యకు పాల్పడ్డట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన సాయి ప్రశాంత్ మూడు నెలల క్రితం మరో వివాహం చేసుకున్నారు.

Tamil television actor Sai Prashanth commits suicide

అయితే రెండో భార్యతో కూడా సాయి ప్రశాంత్ దాంపత్య జీవితం సరిగా సాగలేదని తెలుస్తోంది. అతనితో ఉండలేక కొన్ని రోజుల క్రితమే ఆమె వెళ్లి పోయిందని..... అప్పటి నుండి తీవ్ర మనస్తాపానికి గురైన సాయి ప్రశాంత్ మద్యానికి బానిసయ్యాడని, ఒంటరి తనం భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడని అనుమానిస్తున్నారు.

ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు...ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనే దిశగా దర్యాప్తు చేస్తున్నారు. టీవీ రంగంలో పాపులర్ అయిన సాయి ప్రశాంత్ ప్రస్తుతం సినిమాల్లో అవకాశాలు వస్తుండటంతో వరుస అవకాశాలతో దూసుకెలుతున్నాడు. ఇంతలోనే ఈ సంఘటన చోటు చసుకోవడం తోటి నటీనటులను కలిచి వేసింది.

English summary
Popular Tamil television actor Sai Prashanth has allegedly committed suicide at his residence here on Sunday, police said. According to police sources, Prashanth mixed poison in his drink.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu