»   » టీవీ సీరియల్ నటి మోసం... ఆమెపై, మొదటి భర్త,రెండో భర్త కంప్లైంట్

టీవీ సీరియల్ నటి మోసం... ఆమెపై, మొదటి భర్త,రెండో భర్త కంప్లైంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: తమిళ టీవి నటి శుభశ్రీ ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది. ఆమె ఇద్దరి భర్తలూ ఆమెపై కంప్లైంట్ పెట్టారు. ఇద్దరు భర్తలేంటి అంటారా...అవును..మొదటి భర్తకు తెలియకుండా ఆమె రెండో పెళ్లి చేసుకుంది మరి..ఇద్దరికీ ట్విస్ట్ ఇవ్వటంతో ఇద్దరూ గొల్లుమంటూ గోలెత్తి కోర్టుకు ఎక్కారు. అయితే ఇప్పుడు శుభశ్రీ కోర్టులో లొంగిపోయింది.

'సొంధంబంధం' తదితర టీవీ సీరియల్స్‌లో నటించిన తమిళ టీవీ నటి శుభశ్రీ 2007లో మన్నార్‌గుడికి చెందిన ఇంజనీర్‌ శరవణన్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఎనిమిదేళ్ల కుమార్తె ఉంది. అయితే వీరిద్దరి మధ్యా విభేధాలు వచ్చి విడిపోయారు. అందుతున్న సమాచారం ప్రకారం అప్పట్లో శరవణ్ పై డౌరీ అడుగుతున్నారని కేసు కూడా పెట్టింది. అయితే దాన్ని తర్వాత కొంత సెటిల్ మెంట్స్ తో రాజీచేసుకుని కేసు విత్ డ్రా చేసుకున్నారు.

కానీ తర్వాత ఆమె శీనివాసన్ అనే యువకుడిని రహస్యంగా పెళ్లి చేసుకుని, అన్నానగర్ లో ఉంటోంది. అయితే అతన్ని ఈ ఐదు నెలల్లో హెరాస్ చేసి డబ్బు, నగలు తీసుకుంది. అంతేకాకుండా...తన తండ్రి, సోదరుడుతో కలిసి ల్యాప్ టాప్, సెల్ ఫోన్,, ఇంకా 15 లక్షలు విలువైన గాడ్జెట్ లు ఆ ఇంటినుంచి ఎత్తుకుని వెళ్లిపోయింది. అక్కడితో ఆగకుండా శ్రీనివాసన్ పై ఓ ఫాల్స్ కేసు పోలిస్ స్టేషన్ లో పెట్టింది.

Tamil TV serial actress Subashri appears before Egmore court

అయితే ఈ లోగా తన భార్య తనకు విడాకులు కాకుండా ఇల్లీగల్ గా వేరే వివాహం చేసుకుందని మొదటి భర్త కేసు పెట్టారు. అది అలా ఉంటే ఈ రెండో భర్త శ్రీనివాసన్.. తాను ఓ యుఎస్ బేసెడ్ సాఫ్టవేర్ కంపెనీలో చేస్తున్నానని, తన మొదటి భార్యతో విడాకులు అయ్యిందని, అయితే తన కుమారుడుని తీసుకుని స్కూల్ కు వెళ్తూంటే అక్కడ అదే స్కూల్ కు శుభశ్రీ తన కుమార్తెని తీసుకువచ్చి చేర్చటంతో పరిచయం అయ్యిందని అన్నారు.

అయితే ఇప్పుడు తనను సైతం మోసం చేసి పారిపోయిందని కేసు పెట్టారు. తనను ఫాల్స్ కేసు పెట్టి పోలీసు స్టేషన్ లో పెట్టించటమే కాకుండా, తన ఆస్తి కూడా పట్టుకుని పోయిందని ఎగ్మూర్ కోర్టుకెక్కాడు.

ఈ కేసుపై విచారణ జరిపిన మేజిస్ట్రేట్‌ గోపీనాధ్‌ విచారణకు హాజరు కావాలని శుభశ్రీకి సమన్లు పంపారు. ఆ తదుపరి విచారణకు ఆమె హాజరు కాకపోవడంతో అరెస్ట్‌ వారెంట్‌ జారీ అయింది. చివరకు మంగళవారం నాడు ఆమె కోర్టులో లొంగిపోయారు. జూలై 5న జరుగనున్న తదుపరి విచారణకు శుభశ్రీ హాజరుకావాలని మేజిస్ట్రేట్‌ ఆమెకు ఆదేశాలు జారీ చేశారు.

English summary
Tamil TV serial actress Subashri appears before Egmore court
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu