»   »  'బాహుబలి': తెలుగు శాటిలైట్ రైట్స్ ఎవరికి? ఎంతకి?

'బాహుబలి': తెలుగు శాటిలైట్ రైట్స్ ఎవరికి? ఎంతకి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఓ ప్రక్కన బాక్సాఫీస్ ను 'బాహుబలి' షేక్ చేస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు. మొన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ విషయంలోనూ ఛానెల్స్ మధ్య వార్ నెలకొందని సమాచారం. అయితే మాటీవికు ఈ శాటిలైట్ రైట్స్ ని ఇచ్చేసినట్లు తెలుస్తోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


19 కోట్ల రూపాయలకు ఈ డీల్ ని ఫైనలైజ్ చేసినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ఈ రైట్స్ ...కొర్రపాటి శాయి దగ్గర ఉన్నాయని , ఆయనే అమ్మాడని అంటున్నారు. అయితే ఈ సినిమాతో పాటు ఆయన దగ్గర ఉన్న దిక్కులు చూడకు రామయ్య, తుంగభద్ర చిత్రాలు కూడా కలపి డీల్ ఖరారు చేసారని చెప్పుతున్నారు. దాంతో మిగతా ఛానెల్స్ ఇంట్రస్ట్ చూపలేదని, మాటీవి మాత్రం ఈ క్రేజ్ చూసి ఖచ్చితంగా తమ టీఆర్పీలు పెరుగుతాయని ఈ చిత్రం తీసుకున్నట్లు చెప్తున్నారు.


Telugu Movie Baahubali Satellite Rights

ఇక భారీ అంచనాల మధ్య విడుదలైన 'బాహుబలి' చిత్రం రికార్డు స్థాయిలో ఓపెనింగ్ కలెక్షన్స్ రాబడుతోంది. దాంతో ఈ చిత్రం క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. మరో ప్రక్క సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు అయిన ఫేస్ బుక్, ట్విటర్ లో 'బాహుబలి' హవా కొనసాగుతోంది. కెరీర్ లో ఇప్పటివరకు తీసిన తొమ్మిది చిత్రాలలో ఏ ఒక్కటీ ఫ్లాప్ కాలేదు. దాంతో ఈ పదో సినిమా ఎలా ఉంటుందో.. ఇంత అత్యంత భారీ బడ్జెట్ సినిమా కొన్నవాళ్లు మిగులుతారో.. లేదో అనే అనుమానాలు ఒక దశలో వచ్చాయి.


కానీ.. టైటిల్ తో పాటు అన్ని విషయాల్లోనూ అత్యంత భారీతనం కనిపించిన బాహుబలి సినిమా.... కలెక్షన్లను కూడా భారీగానే కొల్లగొట్టి సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. మూడు గంటల సినిమా.. ఎంతమంది చూస్తారులే అనుకున్నా, చూసిన ప్రతివాళ్లూ అప్పుడే అయిపోయిందా అంటున్నారంటే.. దర్శకుడు సక్సెస్ అయినట్లేనని మీడియా వర్గాలు చెబుతున్నారు.


కలెక్షన్స్ విషయానికి వస్తే... తొలి రెండు రోజుల్లోనే వసూళ్లు రూ. 100 కోట్లు దాటినట్టు తెలుస్తోంది. సుమారు రూ. 135 కోట్లు రాబట్టినట్టు సమాచారం. తొలిరోజు కలెక్షన్ రూ.68.5 కోట్ల నుంచి రూ.76 కోట్ల మధ్య ఉంటుందని ట్రేడ్ వర్గాల అంచనా. గతేడాది వచ్చిన షారూఖ్ ఖాన్ మూవీ 'హ్యాపీ న్యూ ఇయర్' వసూలు చేసిన రూ. 45 కోట్ల ఓపెనింగ్ కలెక్షన్ ను 'బాహుబలి' అధిగమించాడు.


ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఫస్ట్ డే కలెక్షన్ రూ. 30 కోట్లకు పైగా వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. తమిళనాడులో రెండు రోజుల్లో రూ.10.25 కోట్లు వసూళ్లు రాబట్టింది. బాలీవుడ్ లోనూ 'బాహుబలి' ప్రభంజనం కొనసాగుతోంది. మొదటి రెండు రోజుల్లోనే రూ. 10.50 కోట్లు కలెక్షన్లు కొల్లగొట్టింది. ఓవర్ సీస్ మార్కెట్ లోనూ 'బాహుబలి' రికార్డు బద్దలు కొడుతున్నాడు. అమెరికాలో సుమారు రూ. 11 కోట్లు, ఆస్ట్రేలియాలో దాదాపు రూ. 3 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. ఇక మూడు రోజుల వసూళ్లు రూ. 150 కోట్లుకు చేరినట్టు తెలుస్తోంది.

English summary
Telugu Movie 'Baahubali ...the Beginning' satellite rights were picked up by Maa TV for a record price of 19crores.
Please Wait while comments are loading...