twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫోటోలు: టీవీ పరిరక్షణ సమితి ఆందోళన కార్యక్రమం

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: డబ్బింగ్ సీరియల్స్‌కు వ్యతిరేకంగా తెలుగు టీవీ పరిశ్రమ మొత్తం ఏకమై ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. సీరియల్ షూటింగులకు బంద్ పిలుపు ఇవ్వడంతో పాటు నిన్న హైదరాబాద్‌లో అంతా ఒక చోట సమావేశమై డబ్బింగ్ సీరియళ్లను నిషేదించాలని డిమాండ్ చేసిన విషయాన్ని ఇప్పటికే పాఠకుల దృష్టికి తెచ్చాం.

    ఈ ఆందోళన కార్యక్రమానికి తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు దాసరి నారాయణరావు, తమ్మారెడ్డి భరద్వాజలతో పాటు టీవీ పరిశ్రమకు చెందిన నటీనటులు, నిర్మాతలు, దర్శకులు, టెక్నీషియన్స్ హాజరయ్యారు. దాసరి తదితరులు తామంతా బెల్లితెర కళాకారులకు అండగా నిలుస్తామని, డబ్బింగ్ సీరియళ్లను నిషేదించేలా తమ వంతు కృషి చేస్తామన్నారు.

    పలువురు టీవీ నటులు, నిర్మాతలు, దర్శకులు మాట్లాడుతూ.... డబ్బింగ్ సీరియళ్ల వల్ల తమ ఉపాధికి ముప్పు ఏర్పడుతుందని, వాటి జోరుకు కళ్లెం వేయక పోతే తామంతా రోడ్డున పడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేసారు. తెలుగు భాషను, తెలుగు కళాకారులను, తెలుగు సీరియళ్లను కాపాడుకునే బాధ్యత అందరిపైనా ఉందని వ్యక్తలు వ్యాఖ్యానించారు.

    ఫోటోలు: టీవీ పరిరక్షణ సమితి ఆందోళన కార్యక్రమం

    తెలుగు టీవీ పరిరక్షణ సమితి తరుపు ఏర్పాటు చేసిన ఆందోళన కార్యక్రమంలో మాట్లాడుతున్న దాసరి నారాయణరావు.

    ఫోటోలు: టీవీ పరిరక్షణ సమితి ఆందోళన కార్యక్రమం

    తెలుగు టీవీ పరిరక్షణ సమితి ఆందోళన కార్యక్రమానికి హాజరైన దాసరి, తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు.

    ఫోటోలు: టీవీ పరిరక్షణ సమితి ఆందోళన కార్యక్రమం

    తెలుగు టీవీ పరిశ్రమను కాపాడాలని, డబ్బింగ్ సీరియళ్లను నిషేదించాలని డిమాండ్ చేస్తున్న టీవీ కళాకారుడు.

    ఫోటోలు: టీవీ పరిరక్షణ సమితి ఆందోళన కార్యక్రమం

    ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న టీవీ కళాకారులు.

    ఫోటోలు: టీవీ పరిరక్షణ సమితి ఆందోళన కార్యక్రమం

    ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న టీవీ కళాకారులు.

    ఫోటోలు: టీవీ పరిరక్షణ సమితి ఆందోళన కార్యక్రమం

    ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న టీవీ కళాకారులు.

    English summary
    Telugu TV Parisrama Parirakshana Samithi held Press Meet in Hyderabad. Darshaka Ratna Dasari Narayana Rao attend this event and support to TV artists. Almost 150 crores loss is incurred due to dubbed serials. These channels should stop looting our food in this way. Due to buying dubbed serials, many local artists, technicians and studios are losing their jobs.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X