For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6: నామినేషన్స్‌లో షాకింగ్ సీన్స్.. ఆమె పరువు బజారుకు.. వాళ్ల వెకిలి చేష్టలు ఘోరంగా!

  |

  బుల్లితెరపై అప్పటి వరకూ పెట్టుకున్న సరిహద్దులను చెరిపేస్తూ.. సంచలనాత్మక కంటెంట్‌తో ప్రసారం అవుతూ.. దేశంలోనే మరే షోకూ దక్కనంత రేటింగ్‌ను సొంతం చేసుకున్న షో బిగ్ బాస్. చాలా భాషల్లో వస్తున్నా.. మన దగ్గర మాత్రమే ఇది సూపర్ సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. దీంతో నిర్వహకులు రెట్టించిన ఉత్సాహంతో సీజన్లను పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో సీజన్‌ను కూడా కొంత కంటెంట్‌తో ప్రయోగాత్మకంగా నడుపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా జరిగిన తొమ్మిదో వారం నామినేషన్స్ రచ్చ రచ్చగా సాగింది. ఆ వివరాలు మీకోసం!

  సరికొత్త కంటెంట్.. చెత్త రేటింగ్

  సరికొత్త కంటెంట్.. చెత్త రేటింగ్

  అంతకు ముందు వచ్చిన అన్ని సీజన్లు ఒకదానికి మించి ఒకటి అన్నట్లుగా సక్సెస్ అయ్యాయి. దీంతో ఆరో దానిపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఇది ఆరంభం నుంచే సరికొత్త కంటెంట్‌తో ప్రయోగాత్మకంగా సాగుతోంది. కానీ, దీనికి ఆశించిన స్థాయిలో స్పందన మాత్రం రావడం లేదు. ఫలితంగా దీనికి రేటింగ్ కూడా చాలా తక్కువగా వస్తోంది.

  శృతి మించిన అఖండ హీరోయిన్ హాట్ షో: వామ్మో గీత దాటేసిందిగా!

  21 మంది.. 8 మంది ఎలిమినేట్

  21 మంది.. 8 మంది ఎలిమినేట్

  ఆరో సీజన్‌లో కీర్తి భట్, సుదీప పింకీ, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ, రేవంత్‌‌లు వచ్చారు. వీరిలో షానీ, అభినయ, నేహా, ఆరోహి, చంటి, సుదీప, అర్జున్‌, సూర్యలు ఎలిమినేట్ అయ్యారు.

  తొమ్మిదో వారం... ప్రాసెస్ ఇలా

  తొమ్మిదో వారం... ప్రాసెస్ ఇలా

  బిగ్ బాస్ షోలో నామినేషన్స్ టాస్కులు ఎంతో ఆసక్తికరంగా సాగుతుంటాయి. అందుకు అనుగుణంగానే ఆరో సీజన్‌లోని టాస్కులు అన్నీ సరికొత్తగా సాగుతున్నాయి. అయితే, తొమ్మిదో వారానికి సంబంధించిన ప్రక్రియ మాత్రం గతంలో మాదిరిగా సాగింది. ఇందులో ప్రతి కంటెస్టెంట్.. తాను నామినేట్ చేసే ఇద్దరు సభ్యుల దిష్టిబొమ్మకు కుండను పెట్టి.. కర్రతో దాన్ని పగలగొట్టాల్సి ఉంది.

  బోల్డు షోలో హద్దు దాటిన అనన్య నాగళ్ల: కుర్రాళ్లకు ఇది కదా అసలైన విందు

  అందరి టార్గెట్ బోల్డు బ్యూటీనే

  అందరి టార్గెట్ బోల్డు బ్యూటీనే

  తొమ్మిదో వారానికి సంబంధించిన నామినేషన్స్ టాస్కు కూడా ఎన్నో గొడవలతో సాగింది. హౌస్‌లో ప్రస్తుతం మొత్తం 13 మంది సభ్యులు ఉండగా.. అందులో ఒకరిద్దరు తప్ప మిగిలిన వాళ్లు అందరూ ఇనాయా సుల్తానాను టార్గెట్ చేసి నామినేట్ చేశారు. ఈ క్రమంలోనే సూర్య పేరు ప్రస్తావిస్తూ ఆమె పర్సనల్ లైఫ్‌పై కూడా మాట్లాడారు. అలా ఇనాయా పరువును బజారుకు ఈడ్చేశారు.

  వాళ్ల వెకిలి చేష్టలతో దారుణం

  వాళ్ల వెకిలి చేష్టలతో దారుణం

  సోమవారం రాత్రి జరిగిన నామినేషన్స్ టాస్కులో కొందరు కంటెస్టెంట్లు చేసిన ఓవర్ యాక్టింగ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరీ ముఖ్యంగా శ్రీ సత్య, శ్రీహాన్ వెకిలి చేష్టలు దారుణంగా ఉన్నాయి. ఇనాయా విషయంలో వాళ్లు మాట్లాడిన తీరు, చూపించిన మేనరిజమ్స్ ఛీఛీ అనేలా అనిపించాయి. అలాగే, ఫైమా కూడా కొంత ఓవర్ యాక్టింగ్ చేసి తన ఇమేజ్‌ డ్యామేజ్ చేసుకుంది.

  ఉల్లిపొర లాంటి డ్రెస్‌లో శృతి హాసన్: లోపలివి కనిపించేలా ఘోరంగా!

  మొత్తం పది మంది నామినేట్

  మొత్తం పది మంది నామినేట్

  బిగ్ బాస్ ఆరో సీజన్‌లో ప్రతి వారంలోనూ నామినేషన్స్‌లో ఎక్కువ మంది ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే సోమవారం జరిగిన తొమ్మిదో వారం నామినేషన్స్ టాస్కులో కూడా ఏకంగా పది మంది కంటెస్టెంట్లు ఉన్నారు. అంతులో ఇనాయా సుల్తానా, గీతూ రాయల్, శ్రీ సత్య, రేవంత్, కీర్తి భట్, ఆది రెడ్డి, రోహిత్‌, మెరీనా అబ్రహం, జబర్ధస్త్‌ ఫైమా, బాలాదిత్యలు ఉన్నారు.

  ఎట్టకేలకు తప్పించుకున్నారు

  ఎట్టకేలకు తప్పించుకున్నారు


  సోమవారం రాత్రి జరిగిన నామినేషన్స్ టాస్కులో కెప్టెన్ అవడంతో శ్రీహాన్‌ నామినేషన్స్ తప్పించుకున్నాడు. అలాగే, చాలా వారాల తర్వాత వాసంతి కృష్ణన్, రాజశేఖర్‌ కూడా నామినేషన్స్‌లో లేరు. వీళ్లు ముగ్గురు తప్ప అందరూ నామినేట్ అయ్యారు. ఇక, ఈ టాస్కు వల్ల కొందరు కంటెస్టెంట్లు పరువు పోగొట్టుకున్నారు. కానీ, మరికొందరిపై మాత్రం సింపతీ పెరిగిందనే చెప్పుకోవచ్చు.

  English summary
  Bigg Boss Telugu 9th Season Running Successfully. Revanth, Inaya, Geetu, Faima, Sri Satya and other 5 Contestants Gets Nominated in 9th Week.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X