»   » ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 2’ హడావుడి మొదలైంది, సామాన్యులకూ ఛాన్స్!

‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 2’ హడావుడి మొదలైంది, సామాన్యులకూ ఛాన్స్!

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 2’ హడావుడి మొదలైంది, సామాన్యులకూ ఛాన్స్!

  బిగ్ బాస్ తెలుగు గతేడాది ప్రారంభం అవ్వగా ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ షోను హోస్ట్ చేయడంతో టీఆర్పీ రేటింగ్స్ ఆకాశాన్నంటాయి. తెలుగు టీవీ రంగంలో ఇప్పటి వరకు ఏ షోకు రానంత రేటింగ్స్ సాధించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. బిగ్ బాస్ తెలుగు తొలి సీజన్లో 14 మంది సెలబ్రిటీలు హౌస్‌లో ఎంటరై గేమ్‌లో భాగం కాగా, గ్రాండ్ ఫినాలెలో నటుడు శివ బాలాజీ విజేతగా నిలిచాడు. మరికొన్ని రోజుల్లో సీజన్ 2 మొదలు కాబోతోంది. తాజాగా స్టార్‌మా టీవీ వారు బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 అఫీషియల్ లోగో విడుదల చేశారు.

  పూర్తిగా కొత్త లుక్‌తో బిగ్ బాస్ సీజన్ 2

  బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 మొదటి దానికంటే పూర్తిగా భిన్నమైన లుక్‌తో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి కలిగించనుంది. షోకు సంబంధించి టైటిల్‌లోగో, బిగ్ బాస్ హౌస్ ప్రతి అంశంలో పూర్తిగా మార్పులు చేశారు.

  సామాన్యులకు ఈ సారి షోలో అవకాశం

  బిగ్ బాస్‌ 2లో కేవలం సెలబ్రిటీలకు మాత్రమే కాదు, సామాన్య ప్రజలకు కూడా అవకాశం కల్పించాలని నిర్వాహకులు డిసైడ్ అయ్యారు. సామాన్య ప్రజలు మే 15 వరకు తమ ఎంట్రీలు పంపించవచ్చు. మీ అదృష్టం బావుంటే మీరూ బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లే అవకాశం దక్కించుకోవచ్చు. ఇందుకోసం biggbosstelugu.startv.com వెబ్ సైట్లో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది.

  ఈ సారి ఎన్టీఆర్ స్థానంలో ఎవరు?

  ఈ సారి ఎన్టీఆర్ స్థానంలో ఎవరు?

  బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్‌ను హోస్ట్ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాల బిజీ వల్ల తప్పుకున్నారు. దీంతో నిర్వాహకులు హీరో నానిని సంప్రదించారని, నాని ఈ షో హోస్ట్ చేయడానికి ఓకే చెప్పారని సమాచారం. అయితే అఫీషియల్‌గా ప్రకటన రావాల్సి ఉంది.

  శ్రీరెడ్డి, మాధవి లత పేర్లు తెరపైకి

  శ్రీరెడ్డి, మాధవి లత పేర్లు తెరపైకి

  ఫిల్మ్ నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ మధ్య కాలంలో వివాదాలతో మీడియాలో హాట్ టాపిక్ అయిన మాధవి లత, శ్రీరెడ్డి తదితరులకు బిగ్ బాస్ నిర్వాహకులు ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. వీరితో పాటు కొందరు టీవీ యాంకర్లు, నటులకు ఆహ్వానాలు అందాయట. ఫైనల్‌గా ఎవరు బిగ్ బాస్ 2 ఇంట్లోకి ఎంటర్ అవుతారో చూడాలి. వీరితో పాటు ఈ సారి సమాన్య ప్రజలకు ఇందులో అవకాశం ఇవ్వబోతున్నారు.

  English summary
  Bigg BossTelugu Season 2 logo Released. Colours of the Naked Eye & The Colourful Mystery of the Eye. Season 2 raises the curtain to unveil the unseen spectra of the human eye. It sets its vision beyond any camera’s reach. Once the eye captures the sight, it’s a kaleidoscope of colours. According to the latest buzz, Natural Star Nani is going to host the second season of controversial reality show Bigg Boss 2.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more