Bigg Boss 9 Love Stories: బిగ్ బాస్ 9లో ట్రైయాంగిల్ లవ్ స్టోరీ.. ఒక్కడి వలలో ఇద్దరు లేడీ కంటెస్టెంట్లు!

పాపులర్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రస్తుతం ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఈ షోకు టెలివిజన్ ప్రేక్షకుల్లో ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత 8 సీజన్ల కంటే ప్రస్తుతం 9 వ సీజన్ మరింత రసవత్తరంగా కొనసాగుతుంది. కంటెస్టెంట్లకు ఇస్తున్న టాస్కులు ఆసక్తికరంగా ఉంటున్నాయి. మరోవైపు కంటెస్టెంట్లు కూడా తమ ప్రతిభను చూపించే విషయంలో ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. టాస్కుల పట్ల చాలా సీరియస్ గా ఉంటున్నారు. ఇప్పటి వరకు 3గురు ఎలిమినేట్ అవ్వగా, ప్రస్తుతం 13 మంది కంటెస్టెంట్స్ హౌజ్ లో ఉన్నారు.

ఈ క్రమంలో ఎప్పటిలాగే ఈ సీజన్లో కూడా ప్రేమ కథలు చిగురిస్తున్నాయి. ఈ విషయం కాస్త బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హోస్ట్ గా వ్యవహరిస్తున్న అక్కినేని నాగార్జునకు తెలిసిపోయింది. దీంతో తాజాగా విడుదలైన ప్రోమోలో ఈ విషయంపై ప్రస్తావించారు. హౌస్ లో జరుగుతున్న ట్రయాంగిల్ లవ్ స్టోరీ గురించి నాకు తెలిసింది. ఆ విషయాన్ని బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరైనా చెప్పగలరా అని నాగార్జున అడుగుతాడు. దాంతో వెంటనే కామనర్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రియా ముందుకు వస్తుంది. ఇక ఆమె ట్రయాంగిల్ లవ్ స్టోరీ గురించి చెప్పి షాక్ ఇస్తుంది.

Triangle Love story Revealed by Contestant Priya Shetty

హౌస్ లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ కొనసాగుతుందని అంటుంది. నటి రీతూ చౌదరిని ఇంప్రెస్ చేయాలని పవన్ కళ్యాణ్ పడాల ఎంతగానో ప్రయత్నించారని చెబుతుంది. కానీ ఇంతలో రీతూ చౌదరి పవన్ డిమాన్ కు దగ్గర కావడంతో కళ్యాణ్ తన ప్రయత్నాలను కొద్ది రోజులు ఆపాడని అంటుంది. ఈ సమయంలో సీరియల్ నటి తనూజ గౌడ తో కళ్యాణ్ పులిహోర కలిపే ప్రయత్నం చేశాడని చెప్పింది. కానీ తనూజ గౌడ కళ్యాణ్ కు ఏమాత్రం అవకాశం ఇవ్వకపోవడంతో మళ్లీ తిరిగి రీతూ చౌదరి దగ్గరికి కళ్యాణ్ వచ్చాడని వివరించింది.

ఇలా కళ్యాణ్ పడాల, రీతూ చౌదరి, తనూజ గౌడ మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ కొనసాగిందని చెబుతుంది. ఆయన ఒక్కడి వలలో ఇద్దరు లేడీ కంటెస్టెంట్లు పడాలని ప్రయత్నించారని అంటుంది. కానీ చివరికి ఏది సక్సెస్ కాక అలాగే ఉండిపోయాడని అంటుంది. డాక్టర్ ప్రియ చెప్పిన మాటలకు రీతూ చౌదరి, తనూజ గౌడ షాక్ అవుతారు. పవన్ కళ్యాణ్ పడాలను అదో రకంగా చూస్తారు. టాప్ సీక్రెట్ బయటపడడంతో ఇక మునుముందు వీరి మధ్య ఎలాంటి సంభాషణ జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.

ఇక లేటెస్ట్ గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్ లోకి టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, యంగ్ హీరోయిన్ రాశి ఖన్నా, వైవా హర్ష, రితిక నాయక్ అతిథులుగా ఎంట్రీ ఇచ్చారు. హోస్ట్ అక్కినేని నాగార్జున వారిని హౌస్ లోకి పంపించి పలు టాస్కులను అసైన్ చేశారు. ఈ క్రమంలో ఏం జరిగిందనేది ఈ రోజుటి ఎపిసోడ్ లో తెలియనుంది. మరోవైపు అక్కినేని నాగార్జున లేడీ కంటెస్టెంట్లు రీతూ చౌదరి, శ్రీజ దమ్ముకు గట్టిగా క్లాస్ పీకారు. మరోవైపు పవన్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X