Don't Miss!
- Lifestyle
ఎరుపు రంగు హ్యాండ్లూమ్ చీరలో నిర్మలా సీతారామన్, శక్తిని, ధైర్యానికి సంకేతంగా..
- News
జగన్ మీద కోపంతో చెబుతున్నారేమో అనుకున్నా?
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Finance
Stock Market: మార్కెట్ల బడ్జెట్ దూకుడు.. నష్టపోయిన స్టాక్స్.. లాభపడిన స్టాక్స్ ఇవే..
- Technology
Samsung కొత్త ఫోన్లు లాంచ్ ఈ రోజే! లైవ్ ఈవెంట్ ఎలా చూడాలి,వివరాలు!
- Sports
వికెట్ తీసిన తర్వాత అతి చేష్టలు.. స్టార్ ఆల్‌రౌండర్‌పై అంపైర్ గుస్సా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Tunisha Sharma death టెలివిజన్ నటి మరణం వెనుక సెన్సేషనల్ ట్విస్టు.. మాజీ ప్రియుడి అరెస్ట్!
టెలివిజన్ నటి తునీషా శర్మ మరణం సినీ, టీవీ పరిశ్రమలను దిగ్బ్రాంతికి గురిచేసింది. మహారాష్ట్రలోని పాల్గార్ జిల్లాలోని వాసైలో జరుగుతున్న టీవీ షో షూటింగులో ఆమె తన తోటి నటుడు షీజాన్ మహ్మద్ ఖాన్ మేకప్ రూంలో ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపింది. తునీషా శర్మ మరణం తర్వాత ఆమె మృతదేహాన్ని మహారాష్ట్ర పోలీసులు స్వాధీనం చేసుకొని పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో సహనటుడు షీజన్ మహ్మద్ ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేయడం మరింత సంచలనం రేపింది. ఈ వివారాల్లోకి వెళితే..

సహనటుడి మేకప్ రూమ్‌లో
తునీషా శర్మ షూటింగ్‌లో టీ బ్రేక్ సమయంలో తన తోటి నటుడి మేకప్ రూమ్‌లోని వాష్‌రూమ్‌కు వెళ్లింది. ఆ రూమ్‌లోనే ఉరివేసుకొని మరణించింది. అయితే గది తలుపులు వేసుకోవడంతో వాటిని పగలకొట్టడానికి చాలా సమయం పట్టింది. డోర్లు పగలకొట్టి ఆమెను బయటకు తీసే సరికి రాత్రి 1.30 గంటలు అయింది. ఆ సమయంలో హాస్పిటల్‌కు తీసుకెళ్లే సరికి మరణించారని వైద్యులు ధృవీకరించారు.

హత్యానా? ఆత్మహత్యనా? అనే కోణంలో
తునీషా శర్మ ఆత్మహత్య చేసుకొని మరణించిందని ఆమె తోటి నటీనటులు పోలీసులకు వెల్లడించారు. అయితే సంఘటనాస్థలంలో సూసైడ్ నోట్ లభించకపోవడంతో ఆమె మరణాన్ని అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు. తునీషా మరణం హత్యా? ఆత్మహత్యనా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తల్లి ఫిర్యాదుతో మాజీ ప్రియుడి అరెస్ట్
మహారాష్ట్ర పోలీసుల దాఖలు చేసిన ప్రాథమిక దర్యాప్త రిపోర్టు వివరాల్లోకి వెళితే.. తునీషా శర్మ, షీజన్ మహ్మద్ ఖాన్ ఇద్దరు కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నారు. వారిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉంటూ కొద్దికాలంగా సహజీవనం చేస్తున్నారు. అయితే 15 రోజుల క్రితమే వారిద్దరి మధ్య బ్రేకప్ జరిగింది. ఆ తర్వాత తునీషా శర్మ మానసిక ఒత్తిడికి గురైంది. ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది అని పేర్కొన్నారు.

వేధింపుల వల్లే కూతురు మరణం
తునీషా శర్మ తల్లి ఫిర్యాదుతో మాజీ ప్రియుడు షీజాన్ మహ్మద్ ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తన కూతురు షీజాన్ ఇద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఆమెను పలుమార్లు అనుమానించడం, అవమానించడంతో నా కూతురు బ్రేకప్ చేసుకొన్నది. అయితే తన కూతురు మరణించడానికి షీజాన్ మహ్మద్ ఖాన్ కారణమని తునీషా శర్మ తల్లి తన ఫిర్యాదులో ఆరోపించింది.

బాలనటిగా కెరీర్.. కత్రినా కైఫ్‌తో
తునీషా శర్మ కెరీర్ విషయానికి వస్తే.. బాలనటిగా కెరీర్ ఆరంభించింది. భారత్ కీ వీర్ పుత్ర మహారాణ ప్రతాప్ టెలివిజన్ సీరియల్‌లో చాంద్ కన్వర్ పాత్రలో నటించారు. ఆ తర్వాత టెలివిజన్ షో, సినిమాల్లో నటించారు. కత్రీనా కైఫ్ నటించిన ఫితూర్ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించారు. బార్ బార్ దేఖో, కహానీ 2: దుర్గా రాణి సింగ్, దబాంగ్ 3 చిత్రంలో నటించింది. అలాగే ఇష్క్ సుభాన్ అల్లా, గబ్బర్ పూంచ్ వాలా, షేర్ ఏ పంజాబీీ: మహారాజా రంజీత్ సింగ్, చక్రవర్తి అశోక సమ్రాట్ సీరియల్స్ నటించి మెప్పించింది.