»   » ఉదయ్ కిరణ్ మాదిరిగా...మరో నటుడి ఆత్మహత్య

ఉదయ్ కిరణ్ మాదిరిగా...మరో నటుడి ఆత్మహత్య

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బుల్లితెర నటుడు కళ్యాణ్ చక్రవర్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్లనే ఆత్మహత్యకు పాల్పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పలు టీవీ సీరియల్స్‌తో పాటు సినిమాల్లో కళ్యాణ్ చక్రవర్తి నటించారు. ఆయన స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా భీవవరం.

తహసిల్దార్‌గా పదవీ విరమణ చేసిన కళ్యాణ్ చక్రవర్తి తల్లి రెండేళ్ల క్రితమే మరణించారు. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో ఇటీవలే ఉన్న ఇల్లును కూడా అమ్మేసినట్లు సమాచారం. దీనికి తోడు సినిమా, టీవీ రంగంలో అవకాశాలు కూడా లేక పోవడంతో ఈ క్రమంలోనే తీవ్ర మానసిక వేదనకు గురైనట్లు తెలుస్తోంది. కష్టకాలంలో అతనికి ధైర్యం చెప్పి ఆదుకునే వారు కూడా ఎవరూ లేక పోవడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు చర్చించుకుంటున్నారు.

TV actor Kalyan Chakravarthy commits suicide

ఇటీవల ప్రముఖ నటుడు ఉదయ్ కిరణ్ కూడా అవకాశాలు లేక పోవడం, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఇపుడు అదే బాటలో మరో నటుడు ఆత్మహత్యకు పాల్పడటం సినీ రంగంలోని పలువురు కళాకారులను కలిచి వేస్తోంది.

పరిశ్రమలో ఇలాంటి చాలా జరుగుతున్నాయని, చాలా మంది కళాకారులు ఆర్థిక ఇబ్బందుల పాలవుతున్నారని.....అయితే వెలుగులోకి వస్తున్న సంఘటనలు కొన్ని మాత్రమే అని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కళాకారుల ఆత్మహత్యలు పెరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

English summary
TV actor Kalyan Chakravarthy commits suicide at his home in Bhimaravam, West Godavari dist.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu