»   » నిర్మాతగా, హీరోయిన్ గా మరో టీవీ యాంకర్ షాకింగ్ ఎంట్రీ!

నిర్మాతగా, హీరోయిన్ గా మరో టీవీ యాంకర్ షాకింగ్ ఎంట్రీ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టి స్వాతి....క్రమక్రమంగా హీరోయిన్ రేంజికి ఎదిగింది. మరో వైపు జబర్దస్త్ షో యాంకర్లు రష్మి, అనసూయ కూడా సినిమా రంగం వైపు అడుగులు వేసారు. తాజాగా మరో టీవీ యాంకర్ సినిమా రంగంలో తన లక్కును పరిక్షించుకునే ప్రయత్నంలో ఉంది. ఆమె మరెవరో కాదు జెమిని టీవీలో బాగా పాపులర్ అయిన ‘వెన్నెల' కార్యక్రమానికి గత కొన్నేళ్లుగా యాంకరింగ్ చేస్తున్న జయతి.

ప్రస్తుతం టాలీవుడ్లో హీరర్ అండ్ కామెడీ చిత్రాల జోరు సాగుతోంది. ఈ నేపథ్యంలో ఓ హారర్ మూవీలో హీరోయిన్ గా జయతి ఎంట్రీ ఇవ్వబోతోంది. మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రానికి నిర్మాతగా కూడా వ్యవహరించబోతోంది. ‘జె94షోస్' అనే బ్యానర్లో జయతి ఈ సినిమాను నిర్మించబోతోందట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తాను అంటోంది జయతి.

TV Anchor Jayati Turns Heroine

అందంతో పాటు ఆకట్టుకునే యాటిట్యూడ్ జయతి సొంతం. అందుకే గత ఆరేళ్లుగా ‘వెన్నెల' షోను సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తోంది. ఆమె కేవలం యాంకర్ మాత్రమే కాదు కాస్ట్యూమ్ డిజైనర్ కూడా. గత ఆరేళ్లలో ఆమె వేసి కాస్టూమ్ మళ్లీ వేయకుండా షోలు చేయడం విశేషం. చాలా మంది ఆమె కాస్టూమ్స్ చూసేందుకు, ఆమె మాట్లాడే సరదా మాటలు వినేందుకే ఈ షోను చూస్తారనే ప్రచారం కూడా ఉంది.

సినిమా రంగంలోనే తన భవిష్యత్ వెతుక్కుంటున్న జయతి.... ఇటు కాస్టూమ్ డిజైనర్ గా, అటు నిర్మాతగా, నటిగా దూసుకెళ్లేందుకు పక్కా ప్లానింగుతో ముందుకు సాగుతోంది. జయతికి ఆల్ ది బెస్ట్ చెబుదాం.

English summary
Joining the likes of Anasuya, Rashmi Gautam, yet another Telugu TV anchor is all set for her silver screen debut. Anchor Jayati is the latest to test her luck in the film industry.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu