మ్యూజిక్ ఛానెల్ టీవీ యాంకర్‌పై అత్యాచారయత్నం

ఆ సమయంలో ఫూటుగా మద్యం సేవించిన రతన్ కుమార్ సాహు (36) అక్కడికి వచ్చాడు. కారు అద్దం దింపి ఉండడంతో అందులోంచి యాంకర్‌ను బయటకు లాగడానికి యత్నించాడు. యాంకర్, ఆమె తండ్రి, స్నేహితురాలు కారు దిగి ప్రతిఘటించారు. యాంకర్ స్నేహితురాలిని సాహు బలంగా కొట్టడంతో రోడ్డు మీద పడిపోయింది. అనంతరం యాంకర్‌పై దాడికి దిగాడు.
వెంటనే ఆమె చెప్పుతో ఎదురుదాడి చేసింది. సుమారు 20 నిమిషాల అనంతరం ఇద్దరు పోలీసులు అటుగా రావడంతో సాహు, అతని స్నేహితులు పారిపోయే యత్నం చేశారు. నిందితులని పట్టుకుని కేసు కట్టామని ప్రస్తుతం వారికి బెయిల్ మంజూరైందని పోలీసులు తెలిపారు.


Click it and Unblock the Notifications











