»   » కుక్కల కోసం ప్రత్యేక ఛానెల్

కుక్కల కోసం ప్రత్యేక ఛానెల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్ :ఏం ఎంతసేపూ మనమే టీవీ చూడాలా...కుక్కలు చూడకూడదా...అనే ఆలోచన ఓ ప్రత్యేకమైన టీవి ఛానెల్ ని కుక్కల కోసం డిజైన్ చేయటానికి స్పూర్తి ని ఇచ్చింది. కుక్కలను తమ పిల్లల కన్నా ఎక్కువగా ప్రేమించే ఈ కాలంలో తప్పకుండా క్లిక్ అవుతుందని భావిస్తున్నారు డైరక్ట్ టీవీ వారు.

పిల్లలకు, పెద్దలకు, ఎంటర్టైన్మెంట్ కు, సినిమాలకు,న్యూస్ కు, ఏనిమల్ ప్లానెట్ కు... ఇలా ప్రత్యేకించి ఒక్కోవర్గానికి ఒక్కోఛానల్ ఇప్పటికే వచ్చేసిన ఈ నేఫధ్యంలో ఇలాంటి కుక్కల ఛానెల్ రావటం చిత్రమేమీ కాదంటున్నారు శునక ప్రేమికులు. అయితే కొత్తగా శునకాలకు ఓ కొత్త టీవీఛానల్ వస్తోందన్నదే మాత్రం చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది.

TV ‘goes to the dogs’ with new canine-friendly channel

మరో ప్రక్క ఈ ఛానెల్ వారు తాము వేరే పోగ్రాములు ఈ ఛానెల్ లో వేయమని కేవలం కుక్కల కోసమే, అవి చూడటానికే పోగ్రామ్ లు డిజైన్ చేస్తున్నామని చెప్తున్నారు. ఇందుకోసం రీసెర్చ్ వింగ్ కూడా పనిచేస్తోందని ఓ రేంజిలో పబ్లిసిటీ చేస్తున్నారు.

ఇంటియజమానులు ఆఫీసులకు వెళ్లాక.. కుక్కలకు ఇంట్లో బోర్ కొడుతుంది కదా..అప్పుడు వాటిని ఎంటర్టైన్ చేయటానికే ఈ ఛానెల్ పెడుతున్నామని ధీమాగా చెప్తున్నారు. కుక్కలను ఆహ్లాదపరిచేందుకు ఛానల్‌లో రకరకాల కార్యక్రమాల్ని ప్రసారం చేస్తారు. ఆ దేశంలోని సుమారు నాలుగున్నర కోట్ల మంది ఇళ్లల్లోని కుక్కల్ని ఆకర్షించే లక్ష్యంతో ఉన్నారు నిర్వాహకులు. అందుకోసం సన్నాహాలు ప్రారంభించింది డైరెక్ట్ టీవీ.

ఇక ఈ పోగ్రామ్ లలో ...శునకాల్లో ఒంటరితనాన్ని పోగొట్టేందుకు సంగీతం, యానిమేషన్ చిత్రాలతో ప్రత్యేక కార్యక్రమాలను రూపొందిస్తారని చెప్తున్నారు. కేవలం కుక్కల కోసమే ఛానల్‌ను ప్రారంభిస్తున్నందుకు జంతుప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నెలకు మూడొందలు చెల్లిస్తే చాలు ఇంట్లో కుక్కలన్నీ టీవీచూస్తూ ఎంజాయ్ చేయొచ్చు అంటున్నారు. ఇప్పటికే చాలా మంది ఈ కుక్కల ఛానెల్ కు లాగ్ ఇన్ అవుతున్నారు. క్లిక్ అయితే మనదేశమూ వచ్చేయచ్చు మరి. మన కుక్కలూ ఎంజాయ్ చేస్తాయి.

English summary

 The 24-hour channel “Dog TV” is set to be unleashed nationwide, catering to the canine attention span. NBC’s Kevin Tibbles reports. “The first channel for dogs, available through DirectTV and online, entertains dogs home alone with scientifically developed behavior patterns, movements, and sounds from a dog’s perspective.”— advertisement for DogTV
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu