అలనాటి హాట్ లేడీపై టీవీ సీరియల్

బాలీవుడ్‌లో గ్లామరస్ తారగా పేరొందిన జీనత్ అమన్ ఆ కాలంలో మిస్ ఇండియా అందాల పోటీలలో సెకండ్ రన్నరప్‌గా నిలిచారు. ఆ తర్వాత ఆమె 1970లో మిస్ ఆసియా పసిఫిక్ కిరీటాన్ని దక్కించుకున్నారు.అనంతరం గ్లామర్ ప్రపంచంలో వెనుదిరిగి చూడకుండా ముందుకు దూసుకుపోయారు.
బాలీవుడ్‌లోకి ప్రవేశించి నాటి అందమైన తారల్లో అగ్రస్థానంలో నిలిచారు. పలు హిట్ సినిమాల్లో నటించి తన అందచందాలతో అందర్నీ మైమరపించారు. అందమైన తారగా వెలుగొందిన ఆమె నాడు పలువురు యువతులకు ఆదర్శప్రాయంగా నిలిచారు. ఆధునిక యుగంలో మహిళలు మారాల్సి ఉందని ఆమె గట్టిగా చెప్పేవారు.
తాజాగా ఆమె జీవితంపై ఓ టీవీ సీరియల్ రానున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆమె జీవితంలోని కీలక ఘట్టాలను చూపించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి. జీనత్ అమన్ అంగీకారంతోనే ఈ టీవీ సీరియల్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











