»   » టీవి 9 నిర్మాతగా తెలుగు చిత్రం...డిటేల్స్

టీవి 9 నిర్మాతగా తెలుగు చిత్రం...డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగులో టాప్ న్యూస్ ఛానెల్ గా వెలుగుతున్న టీవి9 సంస్ధ నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతోంది. మరో రెగ్యులర్ నిర్మాత మధుర శ్రీధర్ తో కలిసి ఓ చిత్రం ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంకి దర్శకుడుగా రామరాజుని ఎంచుకున్నారు. మల్లెల తీరంలో ...చిత్రంతో రామరాజు దర్శకుడుగా గతంలో పరిచయమయ్యారు. ఈ విషయాన్ని నిర్దారిస్తూ నిర్మాత మధుర శ్రీధర్ ట్వీట్ చేసారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

మధుర శ్రీధర్ తాజా చిత్రం విషయానికి వస్తే...

రాజేంద్ర ప్రసాద్‌ ప్రధాన పాత్రలో నటించిన 'లేడీస్‌ టైలర్‌' సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఆ సినిమాకి దర్శకుడు వంశీ సీక్వెల్‌ తీసే ప్రయత్నంలో ఉన్నారట. 'ఉయ్యాల జంపాల', 'సినిమా చూపిస్త మావా' చిత్రాలతో ప్రేక్షులకు చేరువయిన రాజ్‌తరుణ్‌ ఇందులో ప్రధాన పాత్ర పోషించనున్నారు.

 TV9 Join Hands With Madhura Sreedhar

ఉయ్యాల జంపాల సినిమాలో రాజ్‌తరుణ్‌ నటన వంశీకి బాగా నచ్చిందట. అందుకే 'ఫ్యాషన్‌ డిజైనర్‌' పేరుతో సినిమాను తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. ఈ సినిమాకి 'సన్‌ ఆఫ్‌ లేడీస్‌ టైలర్‌' అనేది ఉపశీర్షికగా పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మధుర శ్రీధర్ నిర్మిస్తున్నారు.

English summary
Madhura Sreedhar ‏tweeted:" Me & TV9 jointly producing a movie with Ramaraju, director of brilliant & critically acclaimed movie "Mallela Theeram lo..". Details soon!"
Please Wait while comments are loading...