»   »  ఆ స్టార్ హీరోపై ‘గే’ డౌట్ , కూతురుని సహజీవనం చేసి తేల్చుకోమందా తల్లి

ఆ స్టార్ హీరోపై ‘గే’ డౌట్ , కూతురుని సహజీవనం చేసి తేల్చుకోమందా తల్లి

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబయి: కొన్ని నిజాలైనా వినటానికి చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. ముఖ్యంగా సెలబ్రెటీల జీవితంలో జరిగే సంఘటనలు మరింత ఆసక్తిని కలిగిస్తాయి. అందుకేనేమో టీవీ ఛానెల్స్ వారు అలాంటివి ప్రసారం చేసి టీవీ రేటింగ్స్ పెంచుకోవటానికి నిరంతరం ట్రై చేస్తూంటారు.

అయితే అంతే ఉత్సాహంగా స్టార్ హీరోలు, హీరోయిన్స్ తన పర్శనల్ లైఫ్ గురించి చెప్తేనే ఆ పోగ్రామ్ లు రక్తికడతాయి. హిందీలో వచ్చే కాఫీ విత్ కరణ్ పోగ్రామ్ అలాంటిదే. తనకున్న సినీ పరిచయాలతో ఈ పోగ్రామ్ ని చాలా సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తున్నాడు ప్రముఖ దర్శక,నిర్మాత కరుణ్ జోహార్. ప్రస్తుతం సీజన్ 5 నడుస్తోంది.

ఈ సారి బాలీవుడ్ మాజీ హీరోయిన్ ట్వింకిల్ ఖన్నా తన భర్త అక్షయ్ కుమార్ తో కలిసి ఈ పోగ్రామ్ కు విచ్చేసింది. ఈ సందర్బంగా తన భర్తతో పెళ్లికు ముందు సాగిన లవ్ ఎఫైర్ గురించి ముచ్చటించింది. ఆ ముచ్చట్లు కూడా మీడియాకు కాస్త వేడిక్కించేలా,కిక్ ఇచ్చేలా చేసింది. ఆమె మాట్లాడిన మాటల్లో కొన్ని ఇక్కడ అందిస్తున్నాం.

సినిమా ఫ్లాఫ్ అవటమే మా ఆయనకు కలిసొచ్చింది

సినిమా ఫ్లాఫ్ అవటమే మా ఆయనకు కలిసొచ్చింది

ఆమీర్‌ఖాన్‌, ట్వింకిల్‌ జంటగా నటించిన ‘మేళా' చిత్రం షూటింగ్‌ సమయంలో అక్షయ్‌ వచ్చి ట్వింకిల్‌ను వివాహం చేసుకుంటానని అడిగారట. అయితే అప్పటికి తనకు ఆ ఉద్దేశం లేదని, ‘మేళా' హిట్‌ అవుతుందని ఆ తర్వాత హీరోయిన్ గా తన కెరీర్‌ వూపందకుంటుందని ట్వింకిల్‌ భావించారట. అయితే ‘మేళా' ఫ్లాప్‌ కావడంతో అక్షయ్‌ అదృష్టవంతుడయ్యారని అన్నారు.

మా అమ్మ అలా అనుకుంది

మా అమ్మ అలా అనుకుంది

అయితే వెంటనే తమ వివాహం జరగలేదని, తన తల్లి డింపుల్‌ను అక్షయ్‌ ఒప్పించాల్సి వచ్చిందని అన్నారు. ఈ నేపథ్యంలో అక్షయ్‌ ‘గే' అని డింపుల్‌ భావించారని ఆమె చెప్పారు.

ఆమె బ్యాక్ కు ఆక్యుప్రెషర్ చేస్తూ

ఆమె బ్యాక్ కు ఆక్యుప్రెషర్ చేస్తూ

ఆ రోజు మా అమ్మ డింపులు కపాడియాతో అక్షయ్ మాట్లాడటానికి వచ్చాడు. నేను, మా అమ్మ ప్రక్క ప్రక్కనే కూర్చున్నాం. మాకు ఆపోజిట్ గా అక్షయ్ కూర్చున్నాడు. అంతేకాదు అక్షయ్ ప్రక్కన మా అమ్మ స్నేహితురాలు కూర్చున్నారు. అక్షయ్ ఆమె బ్యాక్ కు ఏదో ఆక్యుప్రెషర్ చేస్తున్నారు. అప్పుడు మా అమ్మ అనుమానంగా చూసింది.

నాకెందుకో డౌట్

నాకెందుకో డౌట్

మా అమ్మనాతో వెంటనే గుసగుసలాడింది. నేను ఇక్కడ నుంచి బయిటకు వెళ్లాక నీతో ఒకటి మాట్లాడాలి అంది. ఫర్వాలేదు..ఇక్కడే చెప్పు అన్నాను నేను. న్యూస్ పేపర్లో పనిచేసే మీ ఫ్రెండ్ సందీప్...అక్షయ్ గే అని చెప్పారు. నాకెందుకో డౌట్ గా ఉంది అని చెప్పింది మా అమ్మ..

సహజీవనం చేసి..

సహజీవనం చేసి..

"అక్షయ్ గురించి విన్నాను, అతను 'గే' అటకదా. ఒక సారి చూడు. ఏడాది డేటింగ్ చేసిన తరువాత నచ్చితే పెళ్లి చేసుకో" అని ట్వింకిల్ ఖన్నా తో ఆమె తల్లి చెప్పిందట. ట్వింకిల్ ఖన్నా అలా చెప్పడంతో షో నిర్వాహకులతో పాటు ప్రేక్షకులు కూడా షాక్ కి గురి అయ్యారు. ఒక ఏడాది అక్షయ్‌తో రిలేషన్ షిప్ లో ఉన్న తర్వాత పెళ్లి చేసుకోమని తన తల్లి సలహా ఇచ్చినట్లు ట్వింకిల్‌ వెల్లడించారు.

హెల్త్ సమస్యలు ఏమన్నా ఉన్నాయా

హెల్త్ సమస్యలు ఏమన్నా ఉన్నాయా

ఆ తర్వాత అక్షయ్ గే కాదనే నిజం తెలుసుకున్న డింపుల్‌ కూతురి పెళ్లికి అనుమతిచ్చింది. పెళ్లికి ముందు తన కుటుంబ సభ్యులు, వారి ఆరోగ్య వివరాల గురించి ట్వింకిల్‌ అడిగిందని, అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత పెళ్లాడిందని అక్షయ్‌ చెప్పాడు.

రాణిముఖర్జీకు ప్లస్ అయ్యింది

రాణిముఖర్జీకు ప్లస్ అయ్యింది

నేను రాణి ముఖర్జీకి కెరీర్ ఇచ్చా అంది ట్వింకిల్ ఖన్నా. ఎలా అంటే...తనకు మొదట కరణ్ జోహార్ చిత్రం కుచ్ కుచ్ హోతా హై లో ఆఫర్ వచ్చిందిట. అయితే తను రిజెక్టు చేసింది. అప్పుడు రాణి ముఖర్జీ చేసింది. ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయ్యిందని చెప్పింది.

పోలీస్ స్టేషన్ లో

పోలీస్ స్టేషన్ లో

లెవీ కాంట్రావర్శిపై ట్వింకిల్ ఖన్నా ఈ షోలో రిప్లై ఇచ్చింది. తాను నిజానికి బటన్ తీయాలని అనుకోలేదని కానీ అక్షయ్ కోసం చెయ్యాల్సి వచ్చిందని అన్నారు. లక్మే ఫ్యాషన్ షోలో అక్షయ్ ప్యాంట్ బటన్ తీయడానికి ఒక మహిళ ముందుకు వచ్చినప్పుడు అందుకు నిరాకరించి అతను ట్వింకిల్ దగ్గరకు వెళ్లాడు. ట్వింకిల్ అక్షయ్ ప్యాంట్ బటన్ తీసింది. దాంతో అసభ్యంగా ప్రవర్తించిన కేసులో అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నాను వకోలా పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం 950 రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. ఆమె రెండు గంటల పాటు పోలీసు స్టేషనులో ఉన్నారు.

జెనిటికల్ గా సమస్యలు రాకూడదనే

జెనిటికల్ గా సమస్యలు రాకూడదనే

అక్షయ్ కుమార్ కు చెందిన కుటుంబ సభ్యులందరి మెడికల్ హిస్టరీ చూసిన తర్వాతే ట్వింకిల్ ఖన్నా ..వివాహం చేసుకుంది. ఈ విషయం గురించి చెప్తూ....అవును నిజమే..ఎందుకంటే పెళ్లి అంటే మా ఇద్దరి జీవితమే కాదు కదా.తర్వాత మాకు పుట్టే పిల్లల గురించి కూడా ఆలోచించాలి కదా. అందుకే పూర్తి మెడికల్ హిస్టరీ చూస్తే రేపు జెనిటకల్ గా ఏ సమస్యలూ రావని నమ్మకంతో చూడాల్సి వచ్చిందని చెప్పారామె.

ఆయనో సల్మాన్ రష్డీ

ఆయనో సల్మాన్ రష్డీ

ట్వింకిల్ ఖన్నా పత్రికలు చాలా రాస్తూంటుంది. చాలా ఫన్నీగా ఉంటాయి. ఆ విషయమై మాట్లాడుతూ..నేను రాసేవన్నీ అక్షయ్ చదివి కొన్ని సవరణలు చెప్తాడు. ఏది తీసయ్యాలో కూడా చెప్తాడు. అతనో సల్మాన్ రష్డీ..నేనో చేతన్ భగత్ అని సరదాగా అన్నారామె.

ట్రెండింగ్ లో ఉన్న షో

ట్రెండింగ్ లో ఉన్న షో

బాలీవుడ్‌లో ఉన్న అందమైన జోడీల్లో యాక్షన్‌ హీరో అక్షయ్‌కుమార్‌, ట్వింకిల్‌ ఖన్నా ఒకరు. ప్రస్తుతం అక్కడ ట్రెండింగ్‌లో ఉన్న టెలివిజన్‌ షోల్లో ‘కాఫీ విత్‌ కరణ్‌' ఒకటి. ఆదివారం జరిగిన ఈ టెలివిజన్‌ షో కార్యక్రమానికి అక్షయ్‌, ట్వింకిల్‌ జంట హాజరయ్యారు. ట్వింకిల్‌ ఖన్నా పలు షాకింగ్‌ విషయాలను ఈ సందర్భంగా వెల్లడించడం గమనార్హం. ముఖ్యంగా అక్షయ్‌తో తన వివాహం జరగడానికి గల కారణాన్ని ఆమె అభిమానులతో పంచుకున్నారు.

కంట్రోలు తప్పాడు...

కంట్రోలు తప్పాడు...

ఒక టైమ్ లో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ గురించి చెప్పాలంటే అతని మన్మధ లీలలు గురించిన ప్రస్దానవ ఎక్కువ వచ్చేది. అయితే పెళ్లైన తర్వాత మాత్రం ఆయన భార్య కంట్రోలు చేసే ప్రయత్నం చేసింది. సినీ పరిశ్రమకు చెందిన ట్వింకిల్ ఖన్నా ఎప్పుడూ తన భర్తపైనే ఓ కన్నేసి ఉండేది. అయితే రీసెంట్ గా ఓ బాలీవుడ్ భామతో చక్కర్లు కొడుతున్నట్లు తెలియటంతో ఆమె వార్నింగ్ ఇచ్చిందిట. ఆ విషయాలు క్రింద చదవండి

స్టార్ హీరోగారి తెరవెనక రాసలీలలు, భార్య స్ట్రిక్టు వార్నింగ్, ఆమెతో కనపడ్డావా తాట తీస్తా

English summary
Twinkle Khanna made an exception as she appeared in the latest episode of Koffee with Karan season 5. She made an appearance with husband Akshay Kumar and she made some shocking but interesting revelations about her love affair.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu