For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthika Deepam శౌర్యను కలిసిన హిమ.. కార్తీక్, దీప మరణం తర్వాత అలా మళ్లీ..!

  |

  కార్తీక్, దీప మరణం తర్వాత హిమ ఇంటికి రావడంతో సహించలేని శౌర్య ఇంటి నుంచి పారిపోవడం, అలా పారిపోయి చిల్లర దొంగతనాలు చేసే ఇంద్రుడు, చంద్రమ్మ వద్ద పెరిగి ఆటో డ్రైవర్ అయింది. శౌర్య పేరును మార్చేసుకొని జ్వాలాగా పెరిగింది. అయితే జైలు నుంచి విడుదలైన ఇంద్రుడు, చంద్రుడు ఏకంగా జైలర్ జేబు కొట్టేస్తుంటే పట్టుకొన్న శౌర్య వారిని జైలర్‌కు అప్పగించింది. దాంతో వారిని జైలర్ క్షమించి.. తనకు తెలిసిన వారి ఇంట్లో వంట మనుషులుగా పెట్టడానికి సిద్ధమయ్యారు.

  అలా తన పెంపుడు తల్లిదండ్రులను తీసుకెళ్తుండగా.. తన ఆటోపై ఉన్న వదిలేదిలే అని రాసి ఉండటం చూసి.. అదేంటి? కొత్త సినిమా పేరా? అని జైలర్ అడిగితే.. ఎవరైనా సరే తప్పు చేస్తే వదిలే ప్రస్తక్తి లేదని అలా రాసుకొన్నాను అంటూ జ్వాలా అలియాస్ శౌర్య సమాధానం ఇచ్చింది. కార్తీకదీపం సీరియల్‌లో తాజా ఎపిసోడ్ 1307లో ఇంకా ఏమి జరిగిందంటే..

  హిమ బర్త్ డే సెలబ్రేషన్స్‌లో

  హిమ బర్త్ డే సెలబ్రేషన్స్‌లో

  హిమ తన బర్త్ డేను ఘనంగా జరుపుకొన్నది. తన హాస్పిటల్‌లో సిబ్బంది, డాక్టర్లకు స్వీట్లు పంచుతుండగా.. శౌర్య అంటూ పిలుపు వినిపించింది. దాంతో శౌర్య వచ్చిందా అనుకొంటూ పరిగెత్తుకెళ్లింది. నా బర్త్ డే గిఫ్టుగా ఇవ్వడానికి శౌర్య ఇక్కడికి వచ్చిందా అంటూ వెతికింది. అక్కడ తన సిబ్బందిని అడిగితే.. తానే పిలిచాను.

  శౌర్య ఇల్లు నాకు తెలుసు అంటూ సమాధానం చెప్పడంతో హిమ ఆనంద పడిపోయింది. శౌర్య ఇంటి అడ్రస్ తీసుకొని ఆమెను కలువడానికి హిమ కారులో బయలు దేరింది. శౌర్య నన్ను గుర్తుపడుతుందా? చిన్నప్పుడు కలిసి మెలిసి ఉండేవాళ్లం. శౌర్య అనవసరంగా వెళ్లిపోయింది. ఇంకా నాపై కోపం ఉందేమో అనుకొంటాను అని మనసులో అనుకొన్నది.

  నా తల్లిదండ్రులను హిమ చంపేసిందంటూ

  నా తల్లిదండ్రులను హిమ చంపేసిందంటూ

  అయితే తన తల్లిదండ్రుల మరణానికి కారణమైన హిమను గుర్తు చేసుకొని శౌర్య రగిలిపోయింది. తన తల్లి, తాను బస్తీలో ఎన్ని కష్టాలు పడ్డాం. నాన్న కలిస్తాడని ఎదురు చూశాం. చివరకు నాన్న మమ్మల్ని కలిసినా ఆ ఆనందాన్ని ఎక్కువ రోజులు ఉండనివ్వలేదు. మొదటి నుంచి నాన్న వద్దే హిమ పెరిగింది. తాతయ్య, నాన్నమ్మ, బాబాయ్‌తో ఆనందంగా ఉంటున్నది.

  నేనే అందరికి దూరమయ్యాను. వాళ్లు కూడా నన్ను వెతికే ప్రయత్నం చేయలేదు. పైగా హిమతోనే ఆనందంగా ఉంటున్నారు. ఎన్ని నాళ్లైనా హిమపై కోపం తగ్గదు. రోజు రోజు పెరుగుతుంది. ఒసేయ్ హిమ.. నిన్ను వదిల్లేదు.. ఎక్కడున్నావే అంటూ శౌర్య ఆవేశపడిపోయింది.

  శౌర్య, హిమ కలుసుకొని..

  శౌర్య, హిమ కలుసుకొని..

  శౌర్య కోసం వెతుకుతూ వెళ్తుండగా హిమ కారు రోడ్డు మధ్యలో ఆగిపోయింది. దాంతో కారును రిపేర్ చేయడానికి ప్రయత్నిస్తుండగా.. శౌర్య ఆటోలో అటుగా వచ్చింది. రోడ్డుకు అడ్డంగా ఉండటంతో.. హిమతో మాట్లాడుతూ.. రోడ్డు మీ తాతది అనుకొంటున్నావా? అని శౌర్య నిలదీసింది. కారు పాడైపోతే రోడ్డు ప్రక్కన ఆపాలి అని అంటూ.. కారును రిపేర్ చేసేందుకు ప్రయత్నించింది.

  ఒకర్ని ఒకరు చూసుకొంటూ.. ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టు ఉంది అని మనసులో అనుకొన్నది. శౌర్య కారు రిపేర్ చేస్తుంటే.. మీరు కారు మెకానిక్‌వా అంటే.. అవును.. మీ కారు చెడిపోయిందని దేవుడు మెసేజ్ పంపిస్తే.. వచ్చాను అంటూ హిమపై శౌర్య సెటైర్ వేసింది. దాంతో మీకు కాస్త కోపం, చిరాకు ఎక్కువ అనుకొంటా అని హిమ అంటే అవును.. మా ఇంటి పేరే చిరాకు అంటూ కారును శౌర్య స్టార్ట్ చేసింది. అయితే బానెట్ వేసిన సమయంలో కార్తీక్, దీప ఫోటో కిందపడిపోవడంతో హిమ తన చెల్లెలు అనే విషయం తెలియకుండా ఉండిపోయింది.

  నాకు డబ్బు ఇస్తావా అంటూ హిమకు శౌర్య షాక్

  నాకు డబ్బు ఇస్తావా అంటూ హిమకు శౌర్య షాక్

  శౌర్య కారు బాగు చేసిన వెంటనే రిపేర్‌కు ఏమైనా డబ్బు ఇవ్వాలా అని హిమ అడిగితే.. నాకు డబ్బులు ఇస్తావా? డబ్బు ఉంటే దానధర్మాలు చేయండి.. నాకు డబ్బులు ఇవ్వడం ఏమిటి? అని శౌర్య ఘాటుగా స్పందించింది. అయితే ఫీల్ కావడంతో.. ఇంటికి వెళ్లి ఫీల్ అవ్వు.. ముందు వెళ్లు అంటూ శౌర్య చెప్పడంతో ఇద్దరు అక్కడి నుంచి వెళ్లిపోయారు. తీరా అడ్రస్‌లో ఉన్న శౌర్య కోసం వెతికితే.. మరో యువతి ఉండటంతో నిరాశ చెందింది.

  అనారోగ్యంతో బాధపడుతున్న ఓ అమ్మాయి కనిపించగానే నిరాశకు గురైంది. బెడ్ మీద అనారోగ్యంతో పడుకొన్న అమ్మాయిని చూసి ఈ అమ్మాయి శౌర్యనా అని అడిగితే.. అవును ఈ అమ్మాయి పేరు శౌర్య చెప్పగానే.. నీరసపడిపోయింది. దాంతో మీరు ఎవరు? అని అడిగితే.. నేను డాక్టర్‌ని. నా అక్క తప్పిపోయింది అని చెప్పి బాధపడింది.

  ప్రేమ్‌తో శౌర్య గొడవ

  ప్రేమ్‌తో శౌర్య గొడవ

  ఇక కార్తీక్ మేనల్లుడు ప్రేమ్ కారుకు శౌర్య ఆటో అడ్డుపెట్టడంతో గొడవ జరిగింది. నా కారుకు అడ్డంగా పెడుతావా అంటూ ఆటోను గట్టిగా బాదాడు. దాంతో శౌర్య వచ్చి ప్రేమ్ భుజంపై చేతులు వేసింది. నాపై చేయి వేస్తావా అంటే.. కారు అడ్డం పెడితే.. ఆటోపై చేయి కాదు.. కాలు కూడా వేస్తాను అంటూ ప్రేమ్ గట్టిగా సమాధానం చెప్పాడు. దాంతో నా జోలికి వస్తే నీ అంతు చూస్తా అంటూ వేలు చూపిస్తూ ప్రేమ్‌ను శౌర్య హెచ్చరించింది.

  దాంతో కాస్త సర్దుకుపో.. లేకపోతే మా అమ్మాయి రెచ్చిపోతే మరో రకంగా ఉంటుందని చంద్రమ్మ హెచ్చరించింది. దాంతో నాకు తిక్క రేగితే మరో రకంగా ఉంటుందని ప్రేమ్ కూడా హెచ్చరించాడు.

   మానస్‌తో హిమ కలిసి..

  మానస్‌తో హిమ కలిసి..

  ఇదిలా ఉండగా, తాజా ప్రోమోలో హిమతో నిరుపమ్ (మానస్) కలిసి ఉంటే.. కార్తీక్ సోదరి చివాట్లు పెట్టింది. ఇంకా డ్రైవింగ్ చేస్తూనే ఉన్నావా తల్లి అంటూ ముఖంపై ఘాటుగా కామెంట్ చేసింది. దాంతో ఏంటి మమ్మీ.. ఇలా మాట్లాడుతున్నావు అంటూ నిరుపమ్ అంటే.. తోడపుట్టిన వాడిని పోగొట్టుకొన్నాను. ఇంకేలా మాట్లాడాలి. శౌర్య తెలివైంది.

  నీవు డ్రైవింగ్ చేస్తావని పారిపోయింది అంటూ నిరుపమ్ తల్లి ఆవేశంగా సెటైర్ వేసింది. ఇక ప్రేమ్ ఇంటికి శౌర్య తన పెంపుడు తల్లిదండ్రులతో వచ్చింది. శౌర్యను చూడగానే.. ఏంటి నీవు ఇక్కడకెందుకు వచ్చావు అని ప్రేమ్ నిలదీశాడు. దాంతో నీవు ఇక్కడకు ఎందుకు వచ్చావు అంటూ శౌర్య అంటే.. ఈ సత్య సార్‌కు స్వయానా కొడుకును కాబట్టి అంటూ ప్రేమ గట్టిగా జవాబిచ్చాడు. ఈ ట్విస్టు సీరియల్‌లో ఆసక్తిగా మారింది.

  English summary
  Karthika Deepam March 23rd Episode number 1307.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X