twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthika Deepam నా చేతిలో తాళి.. ఇప్పుడు చెప్పించు తాళి కడుతా.. నిరుపమ్ ఫైర్

    |

    బావ నిరుపమ్‌తో పెళ్లి ఇష్టం లేదని మరోసారి హిమ చెప్పింది. అయితే నీవు ఎన్ని చెప్పినా నా పెళ్లి నీతోనే జరుగుతుంది అని నిరుపమ్ స్పష్టం చేశారు. వాడు ఎన్నిసార్లు చెప్పినా అలా ఎందుకు రిజెక్ట్ చేస్తున్నావు. నీకు దేవుడు జీవితాన్ని ఇచ్చినప్పుడు ఎందుకు కాదనుకొంటున్నావు. నీవు ప్రేమించిన బావకు శౌర్యను ఇచ్చి పెళ్లి చేయాలని ఎందుకు అనుకొంటున్నావు అని సౌందర్య, ఆనందరావు నచ్చ చెప్పేందుకు ప్రయత్నించారు.నిరుపమ్ జోక్యం చేసుకొంటూ.. శౌర్య నీకు మంచి అవకాశం ఇస్తున్నాను. నా చేతిలో తాళి ఉంది. ఇప్పటికిప్పుడు.. పెళ్లి చేసుకొంటానని శౌర్యతో ఇప్పటికిప్పుడు చెప్పించు. నేను శౌర్య మెడలో తాళి కట్టేస్తాను అని అంటే.. ఏం మాట్లాడుతున్నావో తెలుసా అని సౌందర్య నిలదీసింది. కార్తీకదీపం సీరియల్‌ 1414 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే..

    నిరుపమ్ బావ అంటే ఇష్టమని

    నిరుపమ్ బావ అంటే ఇష్టమని

    హిమకు నేనంటే ప్రేమ. ఇప్పుడు ఇష్టపడటం లేదు. ఇక శౌర్యకు నేనంటే ఇష్టం లేదు. నాకు శౌర్యను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. మధ్యలో నీకెందుకు ఈ ప్రయత్నం. వెళ్లి నిరుపమ్ బావను పెళ్లి చేసుకొంటాను. నిరుపమ్ బావ అంటే ఇష్టమని చెప్పించు. నేను శౌర్యను పెళ్లి చేసుకొంటాను. నీవు శౌర్యతో చెప్పించగలవా? గాలిలో మ్యాజిక్ చేయాలని ప్రయత్నించు. జీవితమంటే ఆషామాషీ కాదు. మనసులో నుంచి అన్నీ తొలగించి పెళ్లి గురించి ఆలోచించ అంటూ హిమ చేతిలో తాళి పెట్టి నిరుపమ్ కోపంతో వెళ్లిపోయాడు.

    హిమపై కోపమా? నాపై ప్రేమనా?

    హిమపై కోపమా? నాపై ప్రేమనా?

    స్వప్న సలహా మేరకు డాక్టర్ శోభ నిరుపమ్ ఇంటికి వచ్చేసింది. అంటీ మీరు చెప్పినట్టే నేను మీ ఇంటికి వచ్చేశాను అని శోభ అంటే.. నీవు కళ్ల ముందు ఉంటే.. కనీసం వాడు నీపై ప్రేమ చూపిస్తాడేమో. ఎప్పుడు హిమ హిమ అంటూ నిరుపమ్ కలవరిస్తున్నాడు అని స్వప్ప అంటే.. మీరు ఎంత మంచి వారు. పెళ్లి కార్డులు ప్రింట్ అయినా నిరుపమ్‌తో నా పెళ్లి చేయాలని చూస్తున్నారు. నన్ను, నా మనసు గొప్పగా అర్ధం చేసుకొన్నారు. మీరంతా ఎందుకు చేస్తున్నారో తెలుసుకోవచ్చా? హిమపై కోపమా? నాపై ప్రేమనా? అని శోభ అడిగితే.. ఎప్పడో అడుగుతావని అనుకొన్నాను. మాళవిక ఉంది కదా.ఆమె చెప్పిన సంగతి తెలియదా? నిరుపమ్‌తో పెళ్లి చేసుకొంటావని మా క్లాస్‌మేట్ చెబితే నేను అమెరికా నుంచి వచ్చాను అని శోభ అంటే.. నేనేవరో తెలియకుండా వచ్చినందుకు థ్యాంక్స్ అని స్వప్న అంది. తొక్కేమీ కాదు. నిరుపమ్‌ను పెళ్లి చేసుకోవాలని మాత్రమే వచ్చాను అని శోభ మనసులో అనుకొన్నది.

    నీ మాట మీద నమ్మకం లేకనే.

    నీ మాట మీద నమ్మకం లేకనే.


    శోభతో స్వప్న తన సంభాషణను కొనసాగిస్తూ.. నేను మొండిదానిని. ఒకసారి నేను నిర్ణయం తీసుకొన్నానంటే.. ఆ మాట మీదే నిలుచుంటాను. నిన్ను నా కోడలిగా చేసుకొంటానని మాట ఇచ్చాను అని స్వప్న అంది. అయితే శోభ కపటం ప్రదర్శిస్తూ.. నీ మాట మీద నమ్మకం లేకనే.. నా ప్రయత్నాలు నేను చేసుకొంటున్నాను అని మనసులో అనుకొంటుండగా.. నిరుపమ్ వచ్చి శోభను చూసి షాక్ అయ్యాడు. నిరుపమ్ కొంత అంసతృప్తిగా ఉండటం చూసి.. కొన్ని రోజులు శోభ గెస్ట్‌గా ఉంటుంది. ఎలాగు కొన్ని రోజుల తర్వాత మన ఇంటి కోడలు అవుతుంది కదా అని స్వప్న అంటే.. నీ ఇష్టం అని నిరుపమ్ సమాధానం చెప్పి అసంతృప్తిగా వెళ్లిపోయాడు.

     ఎందుకు నాటకం ఆడుతున్నావు?

    ఎందుకు నాటకం ఆడుతున్నావు?

    హిమను డైరెక్టుగా శౌర్య నిలదీస్తూ.. నన్ను ఎందుకే పగబట్టావు? చిన్నప్పటి నుంచి నా మీద నీకు ఎందుకే ఇంత ద్వేషం. నీవేమో నానమ్మ, తాత వద్ద హాయిగా పెరిగావు. నేను, అమ్మ ఎన్ని కష్టాలు పడ్డామో. నాన్నను కలిశామని సంతోషపడే లోగా దూరం చేశావు. నీ ముఖం చూడవద్దని వెళ్లిపోయాను. అప్పటి నుంచి కష్టాల్లో పెరిగాను. డాక్టర్ సాబ్ ఎవరో తెలియనప్పటి నుంచి ఇష్టపడ్డాను. డాక్టర్ సాబ్ చూడగానే నాకు ఎదో తెలియని ఆనందం అని శౌర్య నిలదీసింది. అదికాదు.. అని హిమ అంటే.. ఇంకా ఎందుకు నాటకం ఆడుతున్నావు? అని శౌర్య అంటే.. మీ ఇద్దరి పెళ్లి చేయాలని ప్రయత్నిస్తున్నా అని హిమ జవాబు ఇచ్చింది. ఇంకా నాటకాలు ఆడకు. నా పెళ్లి నీ బాధ్యత అన్నావు. గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి సెట్ చేసుకొన్నావు. ఇంతకంటే మోసం ఏదైనా ఉంటుందా అని శౌర్య ఫైర్ అయింది.

    కోరికలు ఉంటే నాకు చెప్పు..

    కోరికలు ఉంటే నాకు చెప్పు..

    ఇదిలా ఉండగా, శౌర్యను సౌందర్య బుజ్జగించే ప్రయత్నం చేసింది. శౌర్య అలిగితే.. ఎందుకు అలా ఉంటావంటే.. ఇప్పుడంటే నీవు ఉన్నావు. అలిగాను. గతంలో నేను ఎలా బతికానో నీకేం తెలుసు అని శౌర్య చెప్పింది. అయితే ఇన్నాళ్లు కష్టపడ్డావు. ఇప్పుడేమైనా కోరికలు ఉంటే నాకు చెప్పు. నేను తీర్చుతాను అంటూ సౌందర్య అంటే.. ఏంటి? నిజంగా తీర్చుతావా? మాట తప్పవద్దు అని అంటే.. సాధ్యం కానివి. నా చేతిలో లేనివి అడగవద్దు అని శౌర్య అంటే.. అడగమంటావు. షరతులు పెడుతావు అంటూ శౌర్య అంటే.. ఈ ఇంట్లో నా కాళ్లముందు చాలా నాటకాలు జరుగుతాయి. వాటిని ఆపు అని అంటే.. చూసే దృష్టిని మార్చుకో. అన్నీ సవ్యంగానే కనిపిస్తాయి అని చెబుతుంటే.. నిరుపమ్ బ్యాగు సర్దుకొని అమ్మమ్మ ఇంటికి వచ్చేశాడు. ఇక్కడే ఉంటే నిన్ను చూస్తూ ఉండొచ్చు అని అన్నాడు. హిమను చేయిపట్టుకొని వస్తుంటే.. శౌర్య చూసి షాక్ తిన్నది.

    Recommended Video

    Ott చేస్తున్న దారుణం, పైరసీ ను ఎలా పెంచుతుంది అంటే? *Entertainment | Telugu OneIndia
    తలకు రివాల్వర్ పెట్టుకొని

    తలకు రివాల్వర్ పెట్టుకొని

    నిరుపమ్ తన అమ్మమ్మతో మాట్లాడుతూ.. కొన్నాళ్లు ఇక్కడే ఉంటాను అంటే.. ఇదో నాటకం. అందుకే ఆపమని చెప్పాను అని శౌర్య చెప్పింది. అయితే శోభ మా ఇంటికి వచ్చింది. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. అమ్మ పరిస్థితి బాగాలేదు. తన తలకు రివాల్వర్ పెట్టుకొని శోభను పెళ్లి చేసుకోకపోతే చస్తాను అని అన్నా అంటుంది. అందుకే భయపడి ఇక్కడికి వచ్చేశా అని నిరుపమ్ అంటే.. వీళ్లిద్దరు పెళ్లి చేసుకొంటే ఈ సమస్య తీరిపోతుంది అని శౌర్య మనసులో అనుకొన్నది. నిరుపమ్ ఇక్కడికి వస్తే.. శౌర్య ఫీల్ అవుతుందేమో అని సౌందర్య మనసులో అనుకొన్నది. స్వప్న అత్త ఇంటికి శోభ రావడంపై హిమ కంగారు పడింది. స్వప్న అతత్త బ్లాక్ మెయిల్ చేసి నిరుపమ్, శోభ పెళ్లి జరిపిస్తుందేమో కంగారు పడింది.

    English summary
    Karthika Deepam July 26th Episode number 1414.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X