Bigg Boss Telugu 5 : బిగ్ అప్డేట్ వచ్చేస్తోంది.. ఎప్పటి నుంచి అంటే!
తెలుగు వారికి బిగ్ బాస్ షో బాగా కనెక్ట్ అయింది. అందుకే నాలుగు సీజన్స్ ను బాగా ఆదరించారు. అయితే తెలుగు బిగ్ బాస్ ఫాన్స్ కి ఈ ఏడాది కరోనా సెకండ్ వేవ్ చేదు వార్త తీసుకువచ్చింది. నిజానికి గత ఏడాది కరోనా కారణంగా బిగ్ బాస్ సీజన్ ఫోర్ చాలా ఆలస్యంగా మొదలైంది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని బిగ్ బాస్ నిర్వాహకులు ఈ ఏడాది ముందుగానే బిగ్ బాస్ లాంచ్ చేయాలని భావించారు. అందుకే షెడ్యూల్ ప్రకారం జూన్ నెల నుంచి ఈ షో మొదలు పెట్టాలని భావించారు. అయితే కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో ఈ షో వాయిదా పడింది. ఇక తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఐదవ సీజన్ కోసం బ్యాక్ ఎండ్ పనులు ఇప్పుడు జరుగుతున్నాయని అంటున్నారు.
ఇప్పటికే పాల్గొనబోయే కంటెస్టెంట్ ల కోసం ఆడిషన్స్ కూడా జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతున్నాయని అంటున్నారు. ఒక ప్రస్తుతం కంటెస్టెంట్ ల జాబితా సిద్ధం చేస్తున్నారని అంటున్నారు. ఐదో సీజన్ జూలై నెలలో టెలీకాస్ట్ అయ్యే అవకశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రాబోయే కొద్ది రోజుల్లో మా టీవీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ ఐదో సీజన్ కి కూడా మూడు, నాలుగు సీజన్స్ కి హోస్ట్ గా వ్యవహరించిన అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఎన్టీఆర్ తర్వాత మళ్ళీ షోకు అంత ఆదరణ నాగార్జున తీసుకువచ్చారని నిర్వాహకులు భావిస్తున్నారు. అందుకే ఈ సీజన్ కూడా ఆయన హోస్ట్ గా నడిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మొదటి సీజన్లో శివబాలాజీ విన్నర్ గా నిలువగా రెండో సీజన్లో మంద కౌశల్ విన్నర్ గా నిలిచారు. మూడో సీజన్లో రాహుల్ సిప్లిగంజ్, నాలుగో సీజన్ లో అభిజిత్ విన్నర్ గా నిలిచారు. మరి ఈ సారి ఎవరు దక్కించుకుంటారో వేచి చూడాలి మరి.


Click it and Unblock the Notifications











