»   » యాంకర్ ఉదయభాను పిల్లలని చూసారా..? ఇన్నాళ్ళకు ఇలా మెరిసారు

యాంకర్ ఉదయభాను పిల్లలని చూసారా..? ఇన్నాళ్ళకు ఇలా మెరిసారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

యాంకర్ గా ఉదయభాను హై సక్సెస్. ఆమె ఎవరో తెలియని తెలుగు వాళ్ళు లేరేమో అన్నంతగా ఓ తరాన్ని ఏలింది. అయితే ఈ మధ్యన ఆమె జోరు పూర్తిగా తగ్గింది. ఎందుకో ఏమిటో తెలియకపోయినా ఆమె లేని లోటుని తెలుగు టీవి ఇండస్ట్రీ మాత్రం బాగా ఫీలవుతోంది.బుల్లి తెర యాంకర్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యి, హీరోయిన్‌గా కూడా సినిమాలు చేసింది.

తొలి తరం యాంకర్‌

తొలి తరం యాంకర్‌

బుల్లి తెరపై తెలుగు తొలి తరం యాంకర్‌గా ఉదయ భాను పేరు తెచ్చుకుంది. ఆమెను ఆదర్శంగా తీసుకుని ఎంతో మంది యాంకర్స్‌ బుల్లి తెరపైకి రంగ ప్రవేశం చేశారు. పాపులారిటీతో పాటూ కొన్ని వివాదాలు కూడా చుట్టుముట్టాయి. తల్లితో గొడవ, తన పర్సనల్ మేనేజర్ విజయ్ నే పెళ్లి చేసుకోవడం జరిగింది.

రెండేళ్ల నుంచి

రెండేళ్ల నుంచి

పెళ్లయిన చాలా ఏళ్ల తరువాత ఉదయభాను తల్లి అయింది. గతేడాది ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. అప్పట్నించి బుల్లితెరకు, సినిమాలకు దూరంగా ఉంటోంది. రెండేళ్ల నుంచి ఒకట్రెండు సార్లు మినహా.. ఆమె బాహ్య ప్రపంచానికి కనిపించింది లేదు. ఆమె నిన్న మొన్నటి వరకు కూడా ప్రేక్షకులను అలరిస్తూ వస్తూనే ఉంది. అయితే గర్బవతి అవ్వడంతో భాను కొంత కాలంగా బుల్లి తెరకు దూరంగా ఉంటూ వచ్చింది.

తొలిసారిగా తన కవల పిల్లలతో

తొలిసారిగా తన కవల పిల్లలతో

కవల పిల్లలకు తల్లైన ఉదయ భాను ప్రస్తుతం.. వారి ఆలనా..పాలనా చూసుకుంటోంది. అందుకే బుల్లితెరకు దూరంగా ఉంటున్నానంటోంది. తొలిసారిగా తన కవల పిల్లలతో తళుక్కున మెరిసింది ఉదయ భాను. ఇద్దరు పిల్లలనీ చేరొకళ్ళూ ఎత్తుకొని వచ్చిన ఈ జంట వైపే అందరి దృష్టీ మళ్ళింది

భర్త విజయ్ సహా

భర్త విజయ్ సహా

నిర్మాణ రంగంలో వ్యాపారం చేస్తున్న భర్త విజయ్ సహా కవల పిల్లలతో ఇటీవల జరిగిన ఓ అవార్డ్స్ ఫంక్షన్‌కు హాజరైంది ఈ యాంకర్. తమ ఇద్దరు పాపలతో ఈ భార్యా భర్తలు అవార్డ్ ఫంక్షన్‌లో ఫొటోలకు పోజులిచ్చారు. ఇక, కార్యక్రమానికి ఉదయభాను ఎలాంటి ఆర్భాటం లేకుండా సింపుల్‌గా హాజరైంది.

బుల్లితెర ఎంట్రీ లేనట్టే

బుల్లితెర ఎంట్రీ లేనట్టే

ప్రస్తుతం బుల్లితెర ఎంట్రీ లేనట్టేనని ఆ సందర్బంగా వెల్లడించింది కూడా. ప్రస్తుతం వారిద్దరి ఆలనా..పాలనా చూడడమే తన కర్తవ్యమని, వారికి కొంత వయసు వచ్చేదాకా వారిదగ్గరే ఉంటానని, తర్వాత మళ్లీ కెరీర్‌పై ఆలోచన చేస్తానని చెప్పింది ఉదయ భాను. సో మళ్ళీ యాంకర్ గా ఉదయ భాను ని చూడాలీ అంటే ఇంకా కొన్నాళ్ళు ఎదురు చూడక తప్పదన్నమాట.

English summary
Udaya Bhanu attended the Zee Apsara Awards along with her husband Vijay Kumar and twin daughters. She was seen in a pink and orange combination lehenga saree
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu