For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss 6: సీజన్ ముందు బిగ్ బాస్‌కు షాక్.. చివరి నిమిషంలో ఇద్దరు బిగ్ స్టార్స్ ఔట్

  |

  తెలుగు బుల్లితెర చరిత్రలోనే గతంలో ఎన్నడూ.. దేనికీ రాని విధంగా రేటింగ్‌ను సొంతం చేసుకుంటూ చాలా ఏళ్లుగా నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్‌ను చూపిస్తూ ప్రేక్షకులకు మజాను అందిస్తోన్న ఈ కార్యక్రమం.. ప్రతి ఏడాది రికార్డుల మీద రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది.

  ఇలా ఇప్పటికే చాలా సీజన్లను కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్.. త్వరలోనే మరో సీజన్‌తో ప్రేక్షకులను అలరించబోతుంది. ఈ నేపథ్యంలో రాబోయే సీజన్‌లో పాల్గొనబోయే కంటెస్టెంట్ల గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతోన్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇద్దరు బిగ్ సెలెబ్రిటీలు నిర్వహకులకు షాకిచ్చారని ఓ న్యూస్ లీకైంది. ఆ వివరాలేంటో మీరే చూడండి!

  ఆరవ సీజన్‌ అప్పటి నుంచే

  ఆరవ సీజన్‌ అప్పటి నుంచే

  తెలుగులో బిగ్ బాస్ షో ఎప్పుడు వచ్చినా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అందుకే ఇప్పటికే ఈ షో మన దగ్గరు ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్‌ను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో దానిని కూడా మొదలు పెట్టబోతున్నారు. సెప్టెంబర్ 4వ తేదీ నుంచి ఈ సీజన్‌ను ప్రారంభించబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. దీనిని కూడా కింగ్ నాగార్జునే నడిపించబోతున్నారు.

  బెడ్ మీద అమలా పాల్ అరాచకం: బాబోయ్ ఇదే దారుణం సామీ!

  ప్రోమోలతో భారీ అంచనాలు

  ప్రోమోలతో భారీ అంచనాలు

  సాధారణంగా తెలుగులో బిగ్ బాస్ షోకు అదిరిపోయే స్పందన దక్కుతూ ఉంటుంది. అలాంటిది ఎన్నో రోజులుగా వేచి చూస్తోన్న ఆరో సీజన్ గురించి ఇక చెప్పనక్కర్లేదు. ఈ షోను అభిమానించే వాళ్లంతా ఆరో సీజన్‌పై ఆసక్తిగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వరుసగా దీని నుంచి ప్రోమోలను వదులుతున్నారు. దీంతో ఇప్పటి వరకూ ఉన్న అంచనాలన్నీ రెట్టింపు అయిపోతున్నాయి.

   టీమ్ ఫోకస్ అంతా దానిమీదే

  టీమ్ ఫోకస్ అంతా దానిమీదే

  ఎంతో గ్రాండ్‌గా లాంచ్ కాబోతున్న బిగ్ బాస్ ఆరో సీజన్‌ కోసం నిర్వహకులు ఎప్పటి నుంచో పనులను ప్రారంభించారు. అందుకు అనుగుణంగానే అన్నింటినీ త్వరగానే పూర్తి చేసుకున్నారు. ఇక, ఈ సీజన్‌ ప్రీమియర్ ఎపిసోడ్‌ను సెప్టెంబర్ 4వ తేదీన సాయంత్రం 6 గంటల నుంచి ప్రసారం చేయనున్నారు. ఇప్పుడు షో నిర్వహకులు దీనికి సంబంధించిన పనులే చేస్తున్నారు.

  బట్టలు లేకుండా స్టార్ హీరోయిన్: డెలివరీ అయిన వెంటనే ఘోరంగా!

  కంటెస్టెంట్లు ఫిక్స్.. 21 మంది

  కంటెస్టెంట్లు ఫిక్స్.. 21 మంది

  సెప్టెంబర్ 4వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ ఆరో సీజన్‌కు సంబంధించిన కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియను నిర్వహకులు ఎప్పుడో మొదలు పెట్టారు. ప్రారంభంలో ఆన్‌లైన్ ద్వారా ఇంటర్వ్యూలు చేశారు. తర్వాత నేరుగా మాట్లాడి వాళ్లతో ఒప్పందాలు చేసుకున్నారు. ఇలా ఆరో సీజన్ కోసం ఏకంగా 21 మంది కంటెస్టెంట్లను ఎంపిక చేసుకున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది.

  క్వారంటైన్ కోసం హోటళ్లు

  క్వారంటైన్ కోసం హోటళ్లు

  బిగ్ బాస్ ఆరో సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్లను షో కంటే ముందే తీసుకొచ్చి క్వారంటైన్లలో ఉంచబోతున్నారన్న విషయం తెలిసిందే. ఇందుకోసం నిర్వహకులు దాదాపు నగరంలోని మూడు హోటళ్లను వాళ్ల కోసం బుక్ చేశారని సమాచారం. కంటెస్టెంట్లను 29వ తేదీ నుంచి ఆయా హోటళ్లలోకి పంపబోతున్నారట. ఇలా మూడు జాబితాలను రెడీ చేసుకున్నారని తెలుస్తోంది.

  హాట్ షోలో హద్దు దాటిన జాన్వీ కపూర్: శ్రీదేవి కూతురా మజాకానా!

  సీజన్‌కు ముందు భారీ దెబ్బ

  సీజన్‌కు ముందు భారీ దెబ్బ

  బిగ్ బాస్ ఆరో సీజన్ మరో వారం రోజుల్లో ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్ల పేర్లు కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆరో సీజన్‌లో పాల్గొనే ఇద్దరు కంటెస్టెంట్లు తప్పుకున్నట్లు ఓ న్యూస్ తాజాగా బయటకు వచ్చింది. వాళ్లెవరో కాదు.. సీనియర్ యాంకర్ ఉదయ భాను, యంగ్ యాంకర్ దీపిక పిల్లి అని తెలిసింది.

  అందుకే తప్పుకున్నారట

  అందుకే తప్పుకున్నారట

  ఆరో సీజన్ కోసం బిగ్ బాస్ నిర్వహకులు ఉదయ భాను, దీపిక పిల్లితో ముందుగానే సంప్రదింపులు జరిపారట. అంతేకాదు, ఈ సీజన్ కోసం వాళ్లకు భారీ రెమ్యూనరేషన్ కూడా ఆఫర్ చేశారని తెలిసింది. అయితే, వ్యక్తిగత కారణాలతో ఉదయ భాను.. డేట్స్ అడ్జస్ట్ చేయలేక దీపిక పిల్లి ఈ సీజన్‌ నుంచి తప్పుకున్నారట. వీళ్ల స్థానాల్లో మరో ఇద్దరని బిగ్ బాస్ టీమ్ ఎంపిక చేసిందని టాక్.

  English summary
  Bigg Boss Telugu Team Planing for 6th Season From September. Recently Udaya Bhanu and Deepika Pilli Rejects Bigg Boss Offer.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X