Vadinamma : రఘురామ్ కుటుంబ సభ్యుల సమస్యలకు శుభం కార్డు.. కలిసిపోయిన అన్నదమ్ములు

గత రెండున్నర సంవత్సరాల నుంచి స్టార్ మా ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన డైలీ సీరియల్ వదినమ్మ తుది అంకానికి చేరింది. ఈ సీరియల్ కు సంబంధించిన మెగా ఫినాలే ఎపిసోడ్ సోమవారం నాడు ప్రసారమైంది. సుమారు రెండు గంటల పాటు సాగిన ఈ ఎపిసోడ్ లో వదినమ్మ సీరియల్ పూర్తి చేశారు. నిజానికి గత ఎపిసోడ్ లో రఘురాం కుటుంబ సభ్యులు అందరూ కూడా శ్రీరామనవమి ఉత్సవాల కోసం గుడికి చేరుకుంటారు. అయితే అక్కడ అనూహ్యంగా రఘు రామ్ సీత ఇద్దరు పీటల మీద కూర్చుని సీతా రామ స్వామి కళ్యాణం జరిపించాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది. అక్కడితో గత ఎపిసోడ్ ముగించారు ఇక మెగా ఫినాలే ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

మారిపోయిన లక్ష్మణ్

మారిపోయిన లక్ష్మణ్

శ్రీ రామ నవమి ఉత్సవాలు ముగిసిన తర్వాత తన అన్నయ్య, వదిన ఇద్దరినీ పరామర్శించాలని లక్ష్మణ్ భావిస్తాడు కానీ అక్కడే ఉన్న శైలు లక్ష్మణ్ వారిని కలవకుండా అడ్డుకుంటుంది. అదే సమయంలో లక్ష్మణ్ ప్రవర్తన చూసి అనుమానం వచ్చిన రఘురాం అసలేం జరిగింది లక్ష్మణ్ ఎందుకో అదో రకంగా చూస్తున్నాడు అని అడుగుతాడు.

దీంతో రిషి మన బిడ్డ అనే విషయం లక్ష్మణ్ కు తెలిసింది అని సీత చెబుతుంది. ఇది విన్న తర్వాత జనార్ధన్ బావ మరిది ఇదే విషయం తీసుకువెళ్లి జనార్ధన్ కి చెబుతాడు. అలాంటి గొప్ప వాళ్ళను మనం ఏమీ చేయకుండా ఉంటే మంచిది అని అంటాడు. మరోపక్క కుటుంబ సభ్యులందరూ ఇంటికి చేరిన తర్వాత అందరూ ఎవరి పనిలో వాళ్ళు మునిగిపోతారు.

 అత్త నిజస్వరూపం తెలుసుకున్న నాని

అత్త నిజస్వరూపం తెలుసుకున్న నాని

తర్వాత జనార్ధన్ శైలు కొడుకుని సీత కుటుంబ సభ్యులు అందరూ దూరం చేసినట్లు కల రావడంతో సీతను చంపించాలని ఫిక్స్ అవుతాడు. సీతా భరత్ కలిసి స్వీట్లు వ్యాపారం కోసం బయటకు వెళ్ళిన తరుణంలో వాళ్ల మీద చేసిన హత్య ప్రయత్నం విఫలం అవుతుంది. ఆ తరువాత నాని అత్తగారి నిజస్వరూపాన్ని స్వయంగా చెవులతో విని తెలుసుకుంటాడు.

దీంతో తన అన్న వదినలకు ఎంత ఇబ్బంది పెట్టాను అనే విషయం గుర్తు తెచ్చుకుని బాధపడతాడు ఇంటికి వచ్చి భార్యను ఈ విషయంలో నీకు కూడా హస్తం ఉందా అని అడిగితే నాకు ఆ విషయంలో ఎలాంటి ప్రమేయం లేదు నిజానికి నిన్ను పెళ్లి చేసుకునే సమయంలోనే ఇల్లరికం తీసుకురావాలి అనే కండిషన్ తో పెళ్లి చేసుకున్నాను.

రఘురాంకి ప్రమాదం

రఘురాంకి ప్రమాదం

దాని కోసం చానాళ్లు మా అమ్మ చెప్పినట్లుగా విన్నాను కానీ అందులో నా తప్పుడు ఉద్దేశం ఏదీ లేదు అని చెబుతోంది. దీంతో నాని అన్న వదిన లను కలిసి వాళ్ళ కాళ్ళమీద పడి క్షమించమని కోరాలని భావిస్తుంటాడు. కానీ శైలు ఉండడంతో ఏం చేయాలో అర్థం కాక ఇదే విషయాన్ని లక్ష్మణ్ కు చెప్పి తన బాధలను పంచుకుంటాడు. అయితే సీతా, భరత్ స్వీట్ల వ్యాపారం కాదని ఒక సూపర్ మార్కెట్ లీజ్ మాట్లాడుకోవడం కోసం వేరే ప్రాంతానికి వెళతారు.

ఆ సమయంలో రఘురాం కింద పడిపోవడంతో ఆపరేషన్ చేసిన కుట్లు విడిపోయి తీవ్ర రక్తస్రావం అవుతుంది. సిరి ఒక్కతే ఆయనను హాస్పటల్కి తీసుకెళ్ళే ప్రయత్నం చేసినా అది కుదరదు లక్ష్మణ్ వెళ్ళి సహాయం చేయాలని భావిస్తూ ఉండగా శైలు అడ్డుపడి మాటలు అంటుంది. చాలా సేపు అన్న బాధపడుతున్నా ఏమీ చేయలేక నిన్ను చూసిన లక్ష్మణ్ ఇక ఏదైతే అది జరిగింది అని భావించి శైలుని పక్కకి నెట్టి మరి అన్నయ్య ను కాపాడేందుకు వెళ్తాడు.

నిజం తెలుసుకున్న శైలు

నిజం తెలుసుకున్న శైలు

శైలు అయినా వెనక్కి తగ్గకుండా వాళ్లకు అడ్డం వెళ్లే ప్రయత్నం చేయగా రాజేశ్వరి గట్టిగా చెప్పడంతో శైలు తప్పుకుంటుంది. తరువాత వచ్చి రాజేశ్వరి అసలు ఎందుకు మీ కొడుకు కాదంటేనే కదా నేను పెద్దకోడలు హోదా తీసుకున్నది మళ్ళీ ఇప్పుడు ఎందుకు అతని మీద ప్రేమ చూపిస్తున్నారు ఏదో జరిగింది చెప్పమని బలవంతం చేయడంతో నీ కొడుకు ఆరోగ్యం బాగోక పోతే వాడికి ఇచ్చి కాపాడింది రఘురాం.

అలాంటి వాడి మీద నువ్వు అలా చేస్తుంటే నాకు నచ్చడం లేదు అని అంటుంది. ఈ విషయం తెలిసిన తరువాత శైలు చాలా బాధపడుతుంది. రఘును హాస్పిటల్ కి తీసుకు వెళ్ళిన తర్వాత డాక్టర్లు ట్రీట్మెంట్ ఇచ్చి ఇంటికి పంపిస్తారు.

కలిసిపోయిన అన్నదమ్ములు

కలిసిపోయిన అన్నదమ్ములు

ఇంటికి వచ్చిన తర్వాత మారిపోయిన శైలు తనను క్షమించమని అడగడమే కాక తన కొడుకుని ఇకమీదట మీ కొడుకు లాగానే పెంచాలని కోరుతుంది అదేంటి అని అడిగితే నా కొడుకుని నేను పెంచితే నాలాగే పెరుగుతాడు మీరు పెంచితే నలుగురికీ ఉపయోగపడే విధంగా పెరుగుతాడు కాబట్టి ఇక వాడి అమ్మానాన్న మీరే అని అంటోంది.

సిరి కూడా ఇకమీదట వైదేహి మీ బిడ్డగానే పెరుగుతుంది స్కూల్ రికార్డులలో కూడా మీ పేరులే ఉంటాయి అని చెబుతోంది. ఇక నాని కూడా తనను క్షమించమని అడగడమేగాక తమకు బాబు, పాప పుట్టిన తర్వాత వాళ్లను కూడా మీకు ఇచ్చేస్తామని చెబుతాడు. అలా అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఇబ్బందులు పడిన రఘురామ్ కుటుంబం ఎట్టకేలకు ఒకటే అయింది. అలా ఈ సీరియల్ ముగించారు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X