Vadinamma : తేలు కుట్టిన దొంగలా లింగం.. దుర్గ దెబ్బకు శైలు సూసైడ్ అటెంప్ట్!

స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ ఎట్టకేలకు 716 వ ఎపిసోడ్ కి చేరింది. రఘురాం మాట మాట్లాడితే తన కొడుకు రిషి దగ్గరకు వెళుతూ ఉండడంతో శైలు గొడవ చేసి బాబుని, భర్తను తీసుకొని తన పుట్టింటికి వెళుతుంది. రఘురాం అక్కడికి కూడా వెళ్లి బాబు పడిపోతుంటే కాపాడటానికి ప్రయత్నిస్తే తప్పుగా అర్థం చేసుకుని రఘురామ్ ను దొంగగా భావించి ఇంట్లో అందరూ చితక బాదారు. రఘురాం ఇక్కడ కూడా వదలడం లేదు అనే ఉద్దేశంతో నేను అసలు మీ ఇంటికి రాను అన్నట్లు శైలు మాట్లాడుతుంది. తర్వాత రిషి పుట్టిన రోజు అత్తారింట్లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడానికి ప్లాన్ చేసినట్లు చెబుతూ రఘురాం, సీతను పిలవడం లేదని చెబుతారు లక్ష్మణ్. ఎలా అయినా అక్కడికి వెళ్లాలని ఉద్దేశంతో భరత్ సాయంతో రఘురాం సీత ముసలి వాళ్ళ వేషం వేసుకుని అక్కడికి వెళతారు. అక్కడ వంట వాళ్ళ వేషంలో సెట్ అవ్వడమే కాక వంట కూడా చేసి మెప్పు పొందారు. అంతేకాక లక్ష్మణ్ కు కూడా వాళ్ళు రావడం తెలియడంతో ఆనందంగా ఉంటాడు. మొత్తమ్మీద అలా గత ఎపిసోడ్ ముగించగా ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Photos Courtesy: Star MAA and Disney+Hotstar, ఫొటోస్ కర్టసీ : స్టార్ మా అండ్ డిస్నీ హాట్ స్టార్

ఆ మాత్రం పసిగట్టలేనా

ఆ మాత్రం పసిగట్టలేనా

తన పెద్ద కొడుకు పెద్ద కోడలు తమ కన్న బిడ్డ మీద ముందు అక్షింతలు జల్లాలి అనే ఉద్దేశంతో రాజేశ్వరి వేసిన ప్లాన్ సఫలమవుతుంది.. అందరూ కూడా ముసలి వాళ్ళ వేషం లో ఉన్న రఘు రామ్, సీత పిల్లవాడి మీద ముందు అక్షింతలు వేయాలి అని తీర్పు చెబుతారు. అయితే వాళ్లను పిలవడానికి సిరి బయటకు వచ్చిన సమయంలో లింగం అక్కడే ఉండి వాళ్ళు ఎవరూ లోపలికి రాకుండా చూసుకుంటాను అని ప్రగల్భాలు పలుకుతూ ఉంటాడు.. వాళ్ళు వస్తే నా కుక్క వాసన నుంచి తప్పించుకోలేరు పట్టుకుని కరిచేస్తాను అంటూ ఉంటాడు..

 లింగం చేతులు, కాళ్లు కట్టేసి

లింగం చేతులు, కాళ్లు కట్టేసి

అయితే అసలు నేనే రఘురామ్ ఏమో మారువేషంలో వచ్చి లోపలికి వెళుతున్నాను ఏమో అని అనుమానం వ్యక్తం చేస్తాడు రఘురాం. నువ్వు రఘురాం అయితే నాకు తెలియదా నేను ఆ మాత్రం పసిగట్టలేనా, అన్నీ జోకులు వేస్తున్నావ్ కదా అంటాడు లింగం. అయితే లోపలికి వెళుతున్న సమయంలో అనూహ్యంగా రఘురాం గడ్డం జారి పోవడంతో గడ్డం సరి చేసుకుంటూ ఉంటాడు అదే సమయంలో లింగం చూసేస్తాడు. లింగం చూసిన విషయం పసిగట్టిన రఘురాం సీతలు సర్దుకుపోతూ ఉంటే అంతలో భరత్ వచ్చి, లింగాన్ని తీసుకువెళ్లి ఒక గదిలో నోటికి ప్లాస్టర్ వేసి చేతులు, కాళ్లు కట్టేస్తాడు.

 వెతుక్కుని తీసుకురమ్మని

వెతుక్కుని తీసుకురమ్మని

రఘురాం, సీత సైలెంట్ గా లోపలికి వెళ్ళి తన పెద్దరికాన్ని కాపాడుకుంటూ వృద్ధ జంట లాగానే పిల్లవాడిని ఆశీర్వదించి బయటకు వస్తారు. మొత్తం మీద ఫంక్షన్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగిపోవడంతో జనార్ధన్ ఆనందం వ్యక్తం చేస్తాడు. రఘురాం, సీత రాకుండా తన చేతుల మీదుగా ఫంక్షన్ జరగడం చాలా ఆనందంగా ఉందని అంటాడు. నా తమ్ముడు వెదవ అని ఎప్పుడు చెప్తారు కదా, వాడు బాగా చూసుకున్నాడు అని జనార్ధన్ భార్య అంటుంది. అవును వాడు ఎక్కడ ఉన్నాడు వెతుక్కుని తీసుకురమ్మని పనివాళ్ళకు చెబుతాడు జనార్ధన్.

 లక్ష్మణ్ కు తన బాధనంతా

లక్ష్మణ్ కు తన బాధనంతా

పనివాళ్ళు వెతుకుతూ ఉంటే ఒక గదిలో లింగం నోటికి ప్లాస్టర్ వేసి కాళ్లు చేతులు కట్టేసి పొజిషన్లో కనపడతాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు అని మాట తీసుకుని తన బావ దగ్గరికి పరిగెత్తి వెళ్తాడు. అయితే ఈ విషయం చెబితే బావ నన్ను చంపేసి నట్లుగా భావించి ఎందుకైనా మంచిది ఏమీ తెలియనట్టు ఉందామని అన్నట్లు భావిస్తాడు.. అలా ఉండడం తో జనార్దన్ దగ్గరకు తీసుకుని ఏర్పాట్లు అన్నీ బాగా కుదిరాయి ఎవరిని రానివ్వకుండా బాగా చూసుకున్నావు అని అభినందిస్తాడు. మొత్తం మీద రఘు రామ సీత వచ్చి వెళ్లిన సంగతి లింగం అలాగే రఘురాం కుటుంబ సభ్యులకు తప్ప మరి ఎవరికీ తెలియదు శైలు లక్ష్మణ్ కు తన బాధనంతా చెప్పుకొని రేపు వెళ్ళగానే వెళ్లి వాళ్ళ కాళ్ళ మీద పడతాను అంటుంది. మరోపక్క దుర్గా, పార్వతీ ఎప్పటిలాగే ఎలా ఈ నిజాన్ని తెలుసుకోవాలని విషయమైన బుర్రలు బద్దలు కొట్టుకుంటూ ఉంటారు.

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
శైలు సూసైడ్

శైలు సూసైడ్

ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగించారు తర్వాత ఎపిసోడ్ కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం ఫంక్షన్ అంతా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి అయినట్లుగా చూపిస్తున్నారు. అయితే సీత రఘురాం కి చెప్పిన నిజం ఏమిటి అని తెలుసుకోవడానికి దుర్గ రఘురాం షాప్ కి వెళ్లినట్లు చూపించారు. అయితే చెల్లెలు అడిగితే ఏదైనా నిజమే చెబుతాను ఏం కావాలి అని దుర్గను అడిగితే దుర్గ ఈ విషయం అడుగుతుంది. వెంటనే రఘురాం రిషి మా కొడుకే అని నాకు చెప్పింది అనే విషయం చెప్పడంతో ఆమె ఆ విషయాన్ని పార్వతికి చేరవేయడం పార్వతి జనార్దన్ కు చేరవేయడం జనార్దన్ ద్వారా శైలు చెవిన పడటంతో ఆమె తుపాకి తీసుకుని చనిపోవడానికి సిద్ధమైనట్లు చూపిస్తున్నారు. మొత్తం మీద ఆసక్తికరంగా సాగే విధంగా కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X