Vadinamma : శైలుకి తెలిసిన నిజం.. వాళ్ళందరినీ చంపేస్తానంటూ తండ్రికి ఫోన్!

స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ ఎట్టకేలకు 720 వ ఎపిసోడ్ కి చేరింది. రఘురాం మాట మాట్లాడితే తన కొడుకు రిషి దగ్గరకు వెళుతూ ఉండడంతో శైలు గొడవ చేసి బాబుని, భర్తను తీసుకొని తన పుట్టింటికి వెళుతుంది. తర్వాత రిషి పుట్టిన రోజు అత్తారింట్లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడానికి ప్లాన్ చేసి రఘురాం, సీతను పిలవకపోతే భరత్ సాయంతో రఘురాం సీత ముసలి వాళ్ళ వేషం వేసుకుని అక్కడికి వెళతారు. అక్కడ వంట వాళ్ళ వేషంలో సెట్ అవ్వడమే కాక వంట కూడా చేసి మెప్పు పొందారు. అంతేకాక లక్ష్మణ్ కు కూడా వాళ్ళు రావడం తెలియడంతో ఆనందంగా ఉంటాడు.

రాజేశ్వరి ప్లాన్ తో అందరికంటే ముందు వాళ్ళ మీద అక్షింతలు కూడా పడతాయి. అయితే శైలు తన తప్పు తెలుసుకుని ఇంటికి వచ్చి క్షమించమని అందరినీ అడుగుతుంది. అయితే దుర్గ, పార్వతి కలిసి వంట వాళ్లే రఘురాం, సీత అని శైలుకు చెప్పడానికి ప్రయత్నిస్తుండగా గత ఎపిసోడ్ ముగించారు. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Photos Courtesy: Star MAA and Disney+Hotstar

దుర్గా, పార్వతీ ప్రయత్నాలు

దుర్గా, పార్వతీ ప్రయత్నాలు

ఎలా అయినా తమకు తెలిసిన విషయాన్ని శైలు కి చెప్పడానికి దుర్గా, పార్వతీ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ లోపు తన కూతురు సిరి నేరుగా పార్వతి కి ఫోన్ చేసి కార్తీక దీపోత్సవం చేసుకుంటున్నాము మీరు కూడా రండి అని ఆహ్వానించడంతో పార్వతి ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. అయితే పార్వతి దగ్గరకు వచ్చిన దుర్గ తో ఎలా ఈ విషయాన్ని శైలు చెవిన వేయాలి అనే విషయం మీద తర్జనభర్జనలు పడుతూ ఆలోచనలు జరుపుతారు.

అయితే ఫైనల్ గా ఒక నిర్ణయానికి వస్తారు. ఎలా అయినా ఆ నిర్ణయాన్ని వ్యక్తపరచాలి అని ఫిక్స్ అవుతారు. మరోపక్క రఘురాం కుటుంబ సభ్యులు అందరూ కూడా కార్తీక దీపోత్సవాన్ని ఘనంగా చేసుకోవడానికి సిద్ధమవుతారు.

మాకు వంట రాదు కదా

మాకు వంట రాదు కదా


రఘురాం - సీత, భరత్- సిరి, లక్ష్మణ్ - శైలు, నాని - శిల్పా అలాగే రఘు తల్లి రాజేశ్వరి సహా అందరూ కూడా కార్తీక దీపోత్సవం జరుపుకోవడానికి వెళతారు. అక్కడకు వెళ్ళిన తరువాత కార్తీక దీపోత్సవం విశిష్టత గురించి సీత తన కుటుంబ సభ్యులందరికీ వివరిస్తుంది.

ఇక ఈ తతంగం ముగిసిన తర్వాత కుటుంబ సభ్యులు అందరూ అక్కడే భోజనం చేయాలనుకుంటారు. అయితే ఈసారి కొత్తగా భోజనం ఆడవాళ్ళు కాకుండా మగవాళ్ళు చేయాలి అని సీత కండిషన్ పెడుతోంది. అయితే వాళ్లు మాకు వంట రాదు కదా అన్నట్టు మాట్లాడుతారు. అయితే సీత పొరపాటున మాట జారి మొన్న చేశారు కదా బాగానే కుదిరాయి కదా అంటుంది.

ఛాన్స్ మిస్ అయిందని

ఛాన్స్ మిస్ అయిందని

వెంటనే శైలు కల్పించుకుని మొన్న చేశారా ఎప్పుడూ? నాకు తెలియకుండా ఇదంతా ఎప్పుడు జరిగింది అని ప్రశ్నిస్తుంది. అయితే వెంటనే విషయం అర్థమవుతుంది. అర్థం అయిన వెంటనే దాన్ని కవర్ చేయడం కోసం నువ్వు మీ ఇంటికి వెళ్లిన సమయంలో నాకు ఆరోగ్యం బాగా లేకపోతే మీ బావగారు వంట చేసి పెట్టారు అని సీత చెబుతుంది.. ఈ విషయం బట్టబయలు అవుతుంది అని ఆనందపడిన పార్వతి, దుర్గా కూడా అబ్బా ఛాన్స్ మిస్ అయిందని బాధపడుతూ ఉంటారు.

 పార్వతి, దుర్గ ప్లాన్లు

పార్వతి, దుర్గ ప్లాన్లు

ఇక దాన్ని కవర్ చేసిన తర్వాత భార్య భర్తల మధ్య సరదా సరదా సన్నివేశాలు జరుగుతూ ఉంటాయి. మొత్తం మీద ఈ రోజు జరిగిన ఎపిసోడ్ అంతా కూడా దాదాపుగా కార్తీక దీపోత్సవం లో కుటుంబ సభ్యులు అందరూ ఎంజాయ్ చేస్తున్న విజువల్స్ చూపించారు. ఎక్కువగా కార్తీక దీపోత్సవం విశిష్టత కూడా సీత చేత చెప్పించే ప్రయత్నం చేశారు. అయితే ఈ ఎపిసోడ్ లో అందరూ ఎంజాయ్ చేస్తుంటే పార్వతి దుర్గ మాత్రం ఎలా వీళ్ళందరికీ అడ్డుకట్ట వేయాలని ఆలోచిస్తూనే ఉంటారు. ఇక ఈ ఎపిసోడ్ మొత్తం మీద పార్వతి, దుర్గ ప్లాన్లు వేసుకున్నట్లే కనిపిస్తున్నారు అయితే ఎలా ఈ విషయాన్ని శైలు దగ్గర మొదలు పెట్టి ఎలా ప్లాన్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
మరింత ఆసక్తికరంగా

మరింత ఆసక్తికరంగా

అయితే ఈరోజు ఎపిసోడ్ లో కూడా వాళ్ల దగ్గర ఓపెన్ అయినట్లయితే చూపించ లేదు కానీ కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం రఘురాం, సీతలు పుట్టిన రోజు ఫంక్షన్ కు వచ్చింది ఎవరో తెలుసుకున్న దుర్గ, పార్వతి ఇద్దరూ కలిసి వెళ్లి శైలు గుడికి వచ్చిన మీ ఇంట్లో వంట చేయడానికి వచ్చింది ఎవరో కాదు అని చెబుతూ కొన్ని ఫోటోలు చూపిస్తున్నారు.

ఆ ఫోటోలలో రఘురాం, సీత ఉండడంతో శైలు ముఖ కవళికలు మారిపోయి ఆమె తన తండ్రికి ఫోన్ చేసింది నేను మళ్ళీ మోసపోయాను ఒకప్పుడు ఇదంతా చూసి నాకు చనిపోవాలి అని అనిపించేది కానీ ఇప్పుడు వాళ్ళని చంపాలి అనిపిస్తుంది అంటూ చెప్పడం హైలెట్ గా కనిపిస్తోంది. ఇక తర్వాత ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X