For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Vadinamma Serial June 17th Episode:మరో ఊచించని ట్విస్ట్.. తెర మీదకు నాని లవర్.. రఘురామ్ కి పరాభవం!

  |

  రోజుకు ఒక ఆసక్తికర ట్వీట్ తో సాగిపోతున్న స్టార్ మా 'వదినమ్మ' సీరియల్ లో తాజా ఎపిసోడ్ కూడా ఆసక్తికరంగా సాగింది. సీత ప్రమాదం నుంచి బయట పడి ఇంటికి రావడంతో అందరూ సంతోషంగా ఉంటారు. ఇక తాజాగా జరిగిన ఎపిసోడ్లో ఏమైంది జరిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

  ఆనందంలో రఘురామ్ కుటుంబం

  ఆనందంలో రఘురామ్ కుటుంబం

  సీత తిరిగి రావడంతో రఘురామ్ ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది. అందరూ సీతను పరామర్శిస్తున్న సమయంలో నానికి ఒక ఫోన్ రావడం ఆ ఫోన్ ను నాని దాచడానికి ప్రయత్నించడం అందరూ గమనించే ఉంటారు. ఇక ఫోన్ కి సంబంధించిన వివరాలను ఈ రోజు వెల్లడించారు. మరో పక్క సీత తన అన్న భాస్కర్ కి ఫోన్ చేస్తుంది. అయితే సీత ఇంటికి వచ్చిన విషయం తెలియని భాస్కర్ ఇప్పుడు ఎక్కడ ఉన్నావ్ అని అడుగుతాడు, తను ఇంట్లోనే ఉన్నాను అని సీత చెబుతుంది.

  నాని ప్రేమ

  నాని ప్రేమ

  తను తమ వాళ్ళ మధ్య ఉన్నానని, వాళ్ళందరి ప్రేమాభిమానాలు పొందుతున్నానని చెప్పుకు వస్తుంది.. దీంతో భాస్కర్ నువ్వు ఇంకాస్త ఆలస్యంగా వచ్చి ఉంటే పరిణామాలు వేరేగా ఉండేవని ప్రేమించే మనసు ఎక్కువ కాలం అలాగే ఉండలేదని నీ భర్త విరక్తి చెందేవాడని చెప్పుకొస్తాడు. ఇక మరో పక్క నానికి ఇచ్చిన సీక్రెట్ ఫోన్ ఏంటో తెలిసింది.

  నాని ప్రియురాలు నాని చదువుకునే ఊరి నుంచి నానిని చూడడానికి వస్తుంది. నాని ఫోన్ కట్ చేసినందుకు ఆమె అలిగి నాని ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తదు. చివరికి నాని మెసేజ్ లు చేసి బతిమిలాడుకుంటే ఫోన్ ఎత్తి మాట్లాడుతుంది. ఫలానా చోట కలుసుకోవాలని భావించి ఇద్దరూ కలుసుకుంటారు.

  ఉద్యోగం లేకుండా పెళ్ళేంటి

  ఉద్యోగం లేకుండా పెళ్ళేంటి

  ఇంతలో తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని నువ్వు త్వరపడి ఇంట్లో చెప్పకపోతే తనను వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తారు అని ఆమె చెబుతుంది. అయితే ఉద్యోగం లేకుండా ఎలా అడగాలని నాని ప్రశ్నించగా ఉద్యోగం లేకుండా ఎందుకు ప్రేమించావు అని సదరు యువతి ప్రశ్నిస్తుంది. అయినా నీకు ఉద్యోగం చేయాల్సిన ఖర్మ ఏంటి మీ పెద్దన్నయ్య ఒక బిజినెస్ మాగ్నెట్, చిన్నన్నయ్య కన్స్ట్రక్షన్ బిజినెస్ లో ఉన్నారు ఏదో ఒక బిజినెస్ మొదలు పెట్టాలి కానీ ఉద్యోగం అంటావేంటి అని ప్రశ్నిస్తుంది.

  సందిగ్ధావస్థలో నాని

  సందిగ్ధావస్థలో నాని

  అయితే ఇంట్లో పరిస్థితి చెప్పని నాని కాస్త సందిగ్ధావస్థలో పడతాడు. దీంతో తనను పెళ్లి చేసుకునే విషయంలో ఏదైనా సెకండ్ ఒపీనియన్ ఉందా ? అని ఆమె ప్రశ్నిస్తుంది. అదేమీ లేదని నాని ఆమెకు నచ్చజెప్పి పంపిస్తాడు. ఇక అందరూ కూర్చుని అన్నం తింటూ ఉంటారు. ఇక సమస్యలన్నీ తీరిపోతాయి అని అందరూ భావిస్తున్న తరుణంలో రఘురాం మరో షాకింగ్ న్యూస్ చెప్తాడు. ఈరోజుతో తమకు ఇంటి తో ఉన్న అనుబంధం తేగిపోయిందని రేపటికి ఇల్లు ఖాళీ చేయాలని రఘు అని చెబుతాడు.

  ఆ బాధ్యత నాదన్న సీత

  ఆ బాధ్యత నాదన్న సీత

  అందరికీ ముందే తెలిసిన విషయం కావడంతో కాస్త బాధతోనే కనిపిస్తున్నా శైలు మాత్రం కంగారు పడినట్లు కనిపించింది. ఇదే విషయాన్ని రాత్రి పడుకోబోయేముందు రఘురాం సీతకు వివరిస్తాడు. పెద్దింటి అమ్మాయి మళ్ళీ ఇబ్బందుల పాలవుతోంది ఏమో అని తనకు అనిపిస్తోందని రఘురాం చెబుతాడు. అయితే శైలు మారిపోయిందని ఎలాంటి ఇబ్బంది వచ్చినా తాను చూసుకుంటానని సీత చెబుతుంది.

  వారానికి ఒకసారే స్నానం

  వారానికి ఒకసారే స్నానం

  ఇక తరువాత శైలు, సీత సామాన్లు సర్దుతూ ఉంటారు. రేపటి నుంచి షవర్ ఉండదని తెలిసి నాని రెండు మూడు సార్లు స్నానం చేసి వస్తూ ఉంటాడు. అదేమిటని అడిగితే రేపటి నుంచి షవర్ ఉండదు కదా అందుకే ఇప్పుడే వాడేస్తున్నా అని చెబుతాడు. కొత్త ఇంటికి వెళితే షవర్ ఉండదు కదా మరి స్నానం చేయవా అంటే, చేస్తానని కాకపోతే వారానికి ఒక్కసారి చేస్తానని సరదాగా ఉంటాడు.

  మరో పరాభవం

  మరో పరాభవం

  ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్ లో రఘురాం శీతలు కొత్త ఇంట్లో అడుగు పెట్టబోతున్నట్లు చూపించారు. అడుగుపెట్టక ముందే మరో పరాభవం ఎదురైంది అన్నట్లు చూపించారు. రేపటి ఎపిసోడ్ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

  English summary
  Vadinamma Episode 571: Vadinamma is a Telugu soap which airs on Star Maa and streams on Disney+Hotstar. The series premiered on 6 May 2019. It stars Prabhakar, Sujitha, Rajesh Dutta, Maheshwari, Raj and Priyanka. In the latest episode seetha comes back to house again
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X