For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Vadinamma Serial June 29th Episode: మళ్ళీ మొదటికొచ్చిన శైలు.. మొదలైన ముసలం!

  |

  తెలుగులో టాప్ ఫైవ్ సీరియల్స్ లో కొనసాగుతున్న స్టార్ మా వదినమ్మ సీరియల్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతోంది.. రఘురామ్ కుటుంబంలో ఒక సమస్య తీరింది అనుకుంటున్న తరుణంలో మరో సమస్య ఎదురవుతోంది. ఇక తాజా ఎపిసోడ్ లో ఈ కుటుంబానికి ఎదురైన సమస్య ఏమిటి ? అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

  శైలు అనుమానం

  శైలు అనుమానం

  సిరి చెప్పిన ఐడియా మేరకు శైలు వెళ్లి తన డిగ్రీ సర్టిఫికెట్లు ఇంటి నుంచి తీసుకు వస్తుంది. అలా తీసుకొచ్చి ముందు అందరినీ కాస్త టెన్షన్ పెట్టిన తరువాత తన సర్టిఫికెట్లు పెట్టి లోన్ తీసుకుందామని చెప్పి అందరినీ కుదుటపడేలా చేస్తుంది. ఇక ఆ తర్వాత శైలు ఏదో అవసరం మీద సీతను వెయ్యి రూపాయలు అడిగితే తను ₹1000 ఇవ్వలేనని, 300 ఉన్నాయి తీసుకోమని చెబుతుంది.. అయితే ముందు ఈ విషయంలో కాస్త అనుమానం పడిన శైలు సీతను అనేస్తుంది.

  మళ్ళీ కలిసిపోయిన శైలు

  మళ్ళీ కలిసిపోయిన శైలు

  వెంటనే సీత విషయం అర్థమయ్యేలా చెప్పడంతో తాను తనను క్షమించమని కోరుతుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లోకి వస్తే పని ఇంకా మారాలని సీతతో శైలు చెబుతుంది.. ఇక తాను కూడా వంట విషయంలో హెల్ప్ చేస్తాను అని చెప్పడంతో తప్పకుండా చేయమని సీతా చెబుతుంది.. అయితే తనకు వచ్చిన పని చేస్తానని చెప్పడంతో పని నేర్చుకోవడం అంటే నీకు వచ్చిన పని చేయడం కాదు అని చెప్పి కొత్త పని అప్పగిస్తుంది.

  ప్రేమ పావురాలు

  ప్రేమ పావురాలు

  ఇక మరోపక్క నాని తన ప్రేయసితో బయటకు వెళ్తాడు ఇద్దరూ కలిసి ఊరి చివర ఉన్న పార్కులో కాసేపు గడుపుతుంటారు. ఈ సమయంలో ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ, ప్రపంచాన్ని మర్చిపోతారు. ఇంతలో విషయం గుర్తొచ్చి నాని, తనను ప్రేమించింది స్టేటస్ చూసే లేక తనను చూశా అని తన ప్రేయసిని అడుగుతాడు. ఏకాంతంగా ఉన్నప్పుడు రొమాంటిక్ ఆలోచనలు రాకుండా ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి ఏంటి అని ఆమె ప్రశ్నిస్తుంది. అంతే కాక తమ ఇంట్లో తమ విషయం చెప్పేశా అని చెప్పి షాక్ ఇస్తుంది.

  టెన్షన్ లో నాని

  టెన్షన్ లో నాని

  దీంతో తమ కుటుంబం ఇబ్బందుల్లో ఉన్న విషయం చెప్పాలో లేదో, అర్థం కాక నాని సతమతమవుతూ ఉంటాడు.. ఇక మరో పక్క కిరాణా షాప్ అమ్మేయాలని రఘురాం నిర్ణయించుకుంటాడు.. సరుకులు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాకపోవడం, షాపులో సరుకు నిండుకోవడంతో షాప్ తెరవలేక ఇబ్బందులు పడుతున్నామని, అందుకే దానిని అమ్మివేద్దాం అని చెబుతాడు. ఇంతలో సీత వాళ్ళందరికీ ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తుంది. సరిగ్గా అదే సమయంలో బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేసి లోన్ వచ్చిందని చెబుతాడు. దీంతో అందరు ఆనందం వ్యక్తం చేస్తారు.

  ఒకే ఫంక్షన్ కి వేర్వేరుగా

  ఒకే ఫంక్షన్ కి వేర్వేరుగా

  ఇంతలో శైలు తన ఫ్రెండ్ ఫంక్షన్ కి వెళ్లాలని తనను దింపి వెళ్ళమని భర్తను కోరుతుంది.. లేదు తాను ముందు వెళ్లిపోవాలని లక్ష్మణ్ చెబుతాడు.. అయితే ఆఫీసర్ లేటుగా వెళితే ఏమవుతుంది అని ప్రశ్నిస్తుంది.. అలా కాదని, తానే ముందు వెళ్ళాలని చెప్పు లక్ష్మణ్ వెళ్ళిపోతాడు. ఇంతలో మిల్లుకు వెళ్లాక వర్కర్స్ ఇద్దరిని ఇంటికి పంపమని, మిల్లు ఓనర్ అడుగుతాడు. అయితే వాళ్లు వేరే ఫంక్షన్ కి వెళ్లారని చెప్పడంతో లక్ష్మణ్ మీద ఆయన కోప్పడతాడు. తానే వస్తానని చెప్పి మిల్ ఓనర్ ఇంటికి వెళతాడు లక్ష్మణ్.

  మరో కష్టం

  మరో కష్టం

  అయితే అనూహ్యంగా అదే ఫంక్షన్ కి శైలు వస్తుంది, అక్కడ వీరిద్దరూ కలిశారా ? ఒకరినొకరు ఎదురుపద్దారా ? అనే అంశాన్ని మాత్రం చూపించలేదు. ఇక తర్వాత ఎపిసోడ్ లో జరగబోయే విషయాల గురించి చూపిస్తూ సిరి కూతురికి జ్వరం వస్తుంది. ఆ జ్వరం గురించి హాస్పిటల్ కి తీసుకువెళ్లగా ఒక షాకింగ్ విషయాన్ని డాక్టర్ చెప్పినట్లు చూపించారు. ఆ విషయాలు వచ్చే ఎపిసోడ్ లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

  English summary
  Vadinamma Episode 581: Vadinamma is a Telugu soap which airs on Star Maa and streams on Disney+Hotstar. The series premiered on 6 May 2019. It stars Prabhakar, Sujitha, Rajesh Dutta, Maheshwari, Raj and Priyanka. In the latest episode family shifts into new house and again issues arise.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X