Vadinamma : శైలు దెబ్బకు దండం పెట్టిన సీత.. రఘురాం ఒంటి నుంచి రక్తం?

రఘురాం తన లివర్ ను తన కుమారుడు రిషి కోసం దానం చేసిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు వారిద్దరూ ప్రమాదం నుంచి బయట పడతారు. అయితే ముందుగా లక్ష్మణ్ సహా కుటుంబ సభ్యులు అందరూ ఇంటికి చేరుకోగా ఆ తర్వాత రఘు రాముని డిశ్చార్జ్ చేసి సీత అండ్ కో ఇంటికి తీసుకొస్తారు. అలా వస్తున్న సమయంలో సిరి రఘురామ్ కి దిష్టి తీసేందుకు ప్రయత్నించడంతో ఒళ్ళు కొవ్వెక్కి యాక్సిడెంట్లు చేసుకోవడం ఇప్పుడు మేము ఏదో చేసినట్లు దిష్టి తీయించుకోవడం ఏమీ బాలేదు అనే విధంగా శైలు మాట్లాడుతుంది.

అయితే ఆమె గురించి అంతా తెలిసిన మిగతా కుటుంబ సభ్యులు ఏమీ మాట్లాడకుండా ఉంటారు. అయితే సీత రూల్ ఉల్లంఘించింది కాబట్టి నేను ఈ ఇంటిలో ఉండ లేను వెళ్ళిపోతాను అంటూ శైలు గొడవ మొదలు పెడుతుంది. అక్కడితో గత ఎపిసోడ్ ముగించారు. తాజా ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

చేతులు జోడించి క్షమించమని

చేతులు జోడించి క్షమించమని

నేను ఈ ఇంటిని విడిచి వెళ్ళ కుండా ఉండాలి అంటే సీత తనకు చేతులు జోడించి క్షమించమని అడగాలి అని శైలు కండిషన్ పెడుతోంది.. మిగతా కుటుంబ సభ్యులు అది ఏంటి అని అడిగే ప్రయత్నం చేయకుండా గతంలో భరత్ ఈ విధంగా తన తల్లి క్షమాపణ చెప్పకపోతే అసలు తల్లి అని కూడా భావించను అని బెదిరించిన సంగతి గుర్తు చేసి అప్పుడు అనివార్యం అయితే ఇప్పుడు కూడా అనివార్యం అయినట్లే అని అంటుంది.. దానికి సిరి కోపం తెచ్చుకుని సీత అక్క ఎలాంటి పరిస్థితుల్లో బాబు ని తీసుకువెళ్లిందో అందరికీ తెలుసు.. ఆమె అలా తీసుకుని వెళ్లకుండా ఉంటే ఇప్పుడు రిషి ప్రాణాలకు ఏమయ్యేదో తెలియదు అని అంటుంది..

పని మీద వెళ్ళిన భరత్

పని మీద వెళ్ళిన భరత్

అయితే ఏమో రెండు నిమిషాలు ఆగి నేనే హాస్పిటల్ కి తీసుకు వెళ్లేదాన్ని ఏమో ఇప్పుడు మీ సీత అక్క క్రెడిట్ కొట్టేయడం కోసం నన్ను తప్పు పెట్టవద్దు అంటూ శైలు రెచ్చిపోతుంది. ఎంత చెబుతున్నా ఎవరు వినకపోవడంతో శైలు ఇంట్లో నుంచి బయటకు వెళ్లేందుకు సిద్ధం అవుతుంది. సీత వెంటనే వెళ్లి ఇదంతా తప్పు అని నీకు తెలుసు అయినా పంతం కోసం చేస్తున్నావు సరే నన్ను క్షమించు మనం అనుకున్న రూల్ ప్రకారం నడుచు కోకుండా రూల్స్ అతిక్రమించి తప్పు చేశాను అని అంటుంది.

శైలు ఇగో సాటిస్ఫై అవడంతో మళ్ళీ వెంటనే తిరిగి ఇంట్లో కి వెళుతుంది. మరోపక్క బయటకు పని మీద వెళ్ళిన భరత్ ఎంత సేపటికీ తిరిగి రాకపోవడంతో మీద కుటుంబ సభ్యులు అందరూ ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు..

బలవంతం చేసి

బలవంతం చేసి

అయితే భరత్ వస్తూనే కొన్ని సరుకులు తీసుకురావడం కనిపిస్తుంది. అది ఏంటి మన ఇంట్లో నిండుగా సరుకులు ఉన్నాయి కదా ఇప్పుడు ఎందుకు తీసుకు వచ్చావు అంటే మనం తయారు చేసి ఇవ్వాల్సిన స్వీట్లు కోసం తీసుకు వచ్చాను అని భరత్ చెబుతాడు. అదేమిటి బావ గారి పొజిషన్ ఇలా ఉండగా మనం ఎలా స్వీట్లు తయారు చేసి ఇవ్వాలి అని సీత అలాగే సిరి కూడా ప్రశ్నిస్తారు.

దానికి భరత్ మాట్లాడుతూ వ్యాపారం అంటే అదే వాళ్లకు కావాల్సిన సమయంలో మనం చేసి ఇవ్వాలి కానీ మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు తీసుకోవాలి అంటే ఎలా అని ప్రశ్నిస్తాడు. షాప్ దగ్గర సరుకు లేదని సేటు బలవంతం చేసి అడ్వాన్స్ డబ్బులు చేతిలో పెట్టాడు అని ఆ డబ్బుతోనే సరుకు తీసుకు వచ్చాను అని చెబుతాడు.

రిషిని చూడాలనిపిస్తుంది అని

రిషిని చూడాలనిపిస్తుంది అని

సరే అయిందేదో అయిపోయింది రేపటికి స్వీట్లు తయారు చేసి ఇద్దాం అని భావిస్తారు. అయితే రఘురాం తాను కూడా ఏదో ఒక సాయం చేస్తాం అని అంటాడు ముందు వద్దు అని చెప్పిన వాళ్లు కూడా తరువాత అతని మొండితనం చూసి సరేనని అంటారు. అయితే రఘురాం పనిచేస్తూ ఉండగా కడుపు నుంచి రక్తం రావడం కనిపిస్తుంది వెంటనే భరత్ ఈ విషయం రఘురాం దృష్టికి తీసుకెళ్లడంతో మీ వదిన కి చెబితే చంపేస్తాను నన్ను లోపలికి తీసుకువెళ్లు అని చెప్పి లోపలికి వెళ్ళాడు. మరోపక్క అన్న తన కుమారుడికి లివర్ దానమిచ్చి బాధపడుతున్నా సరే వెళ్లి పలకరించి లేని పరిస్థితి చూసి లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేస్తాడు ఆ తర్వాత తనకు రిషిని చూడాలనిపిస్తుంది అని చెప్పి రఘురాం బాధపడతాడు.

Recommended Video

Bithiri Sathi Tupaki Ramudu Interview Part 1
ఆడిస్తూ

ఆడిస్తూ

వెంటనే అన్నయ్యకు రిషి ముఖం చూపించాలి అనే ఉద్దేశంతో లక్ష్మణ్ వెళ్లి బాబుని తీసుకువచ్చి వాళ్ళ ముందే ఆడిస్తూ ఉంటాడు. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ లో ముగించారు తర్వాత ఎపిసోడ్ కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం షి కోసం లివర్ ఇచ్చింది రఘురాం అనే విషయం తెలుసుకుని లింగం తన బావ జనార్ధన్ కి చెబుతాడు.. ఈ విషయం విని జనార్దన్ షాక్ అవుతాడు. షాక్ అయిన తరువాత తన కుమార్తెకు కూడా ఈ విషయం చెప్పినట్లే కనిపిస్తోంది. దీంతో తన కుమారుడుని హత్తుకొని ఆడుకుంటున్న లక్ష్మణ్ దగ్గరకు వచ్చిన శైలు కుమారుడిని ఏహ్య భావంతో చూస్తున్నట్లు కనిపిస్తోంది. చూడాలి తర్వాత ఎపిసోడ్ ఏం జరగబోతుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X