Vadinamma : 'రిషి'కి అస్వస్థత..హుటాహుటిన హాస్పిటల్ కి..కుటుంబంలో మరో ముసలం?

రఘురాం కుటుంబం రెండుగా చీలి పోయిన సంగతి తెలిసిందే. రఘురాం, భరత్ ఒకవైపు నాని, లక్ష్మణ్ ఒకవైపు నివసిస్తున్నారు. రాజేశ్వరి రఘురాం తన సొంత కొడుకు కాదు అని చెప్పడంతో మిగతా వారు అందరూ రఘురాంకు ఎదురు తిరుగుతారు. కానీ భరత్ ఒక్కడే రఘురాంతో కలిసి ఉండడం కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. భరత్, రఘురాం వారి భార్యలు కలిసి చేసిన స్వీట్ల వ్యాపారం బాగా కలిసి రావడంతో ఇంట్లో వాళ్లకు చీరలు తీసుకురావడమే కాక సిరి కుమార్తె వైదేహి కోసం బొమ్మలు కూడా కొనుక్కుని వస్తాడు. రిషికి తీసుకు రావాలని ఉన్నా ఆ విషయంలో వెనకడుగు వేస్తాడు. అక్కడితో గత ఎపిసోడ్ ముగించారు తాజా ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

కుటుంబ సభ్యులు అందరూ షాక్

కుటుంబ సభ్యులు అందరూ షాక్

రిషి, వైదేహి పక్కన కూర్చుని ఆడుకుంటూ ఉన్న సమయంలో ఈ విషయం చూసిన శైలు ఆగ్రహావేశాలతో వెళ్లి ఇటు వైపు రమ్మని గట్టిగా అరవడంతో రిషి ఆడుకునే బొమ్మలు తీసుకుని అక్కడికి వెళ్తాడు. వెళ్లిన తర్వాత నీకేం కర్మ దాని బొమ్మలు తీసుకు వస్తున్నావు అంటూ ఆ బొమ్మను విసిరేసే ప్రయత్నం చేస్తుంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన రఘు రామ్ సీత అడ్డుకుంటే ఏమైంది వాడికి బొమ్మ ఇవ్వచ్చు కదా అంటూ ఉంటుంది. అయితే మీ ముష్టి బొమ్మలు మా వాడికి అవసరం లేదు మా దగ్గరే చాలా బొమ్మలు ఉన్నాయి వాడు మీ వైపు వచ్చి మీ బొమ్మలతో ఆడుకోవడం నాకు ఏ మాత్రం ఇష్టం లేదు అని అంటుంది. ఆమె మాటలతో రాజేశ్వరి సహా కుటుంబ సభ్యులు అందరూ షాక్ అవుతారు.

 క్యాప్సూల్ మింగాడు ఏమో

క్యాప్సూల్ మింగాడు ఏమో


కానీ శైలు మాత్రం ఎప్పటి లాగానే నిష్టూరాలు ఆడుతూ నా కొడుకుని నీ ఇష్టం వచ్చినట్లు చూసుకుంటా, అడగడానికి మీరెవరు అన్నట్లు మాట్లాడుతుంది. భరత్, రఘు రామ్, సీత, సిరి మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నా సరే ఆమెను కెలకకుండా ఉండడమే మంచిది అని భావిస్తారు. బాబుని అక్కడే కూర్చోబెట్టి బొమ్మలు తీసుకువస్తాను అంటూ శైలు పైకి వెళుతుంది. శిల్ప వెళ్లడంతో రాజేశ్వరి మందులు వేసుకోవడం కోసం ఒక క్యాప్సూల్ తీసి బయట పెట్టి మంచినీళ్లు తెచ్చుకుందామనే ఉద్దేశంతో వంటగది దగ్గరికి వెళుతుంది. ఆ సమయంలో గాలికి ఎగిరి వచ్చిన క్యాప్సూల్ రిషి కూర్చున్న చోట పడడంతో దానిని రిషి తిన్నాడు ఏమో అనుమానం కలుగుతుంది. ఎంత సేపటికి క్యాప్సూల్ కనపడకపోవడం, రిషి మొదలుపెట్టిన ఏడుపు ఆపకుండా ఏడుస్తూనే ఉండడంతో వాడు క్యాప్సూల్ మింగాడు ఏమో అని అనుమానం కలుగుతుంది.

అన్ని పూలు మావే అని

అన్ని పూలు మావే అని


శైలుని ఈ విషయం మీద పిలుస్తుంటే ఆమె చాలా చిరాకు పడిపోతూ వస్తుంది. వచ్చిన తర్వాత రాజేశ్వరి తన అనుమానాన్ని వ్యక్తం చేయడంతో అదేమైనా చాక్లెటా? వాడు తినడానికి మీరు వేసుకో వడానికి అష్టకష్టాలు పడుతూ ఉంటారు అలాంటిది, వాడు తిన్నాడు అంటే నేను నమ్మను మీరు టెన్షన్ పెట్టుకోవద్దు అంటూ చాలా లైట్ తీసుకుంటుంది శైలు. రిషి ఇక్కడే ఉంచితే ఏదో ఒక గోల చేస్తూనే ఉంటారు అనే ఉద్దేశంతో వాడిని పైకి తీసుకు వెళుతుంది. అక్కడికి వెళ్ళాక కూడా రిషి ఏడుపు ఆపకుండా ఏడుస్తూనే ఉంటాడు. ఇదంతా చూసిన భరత్ కి చాలా కోపం వస్తుంది. అన్నయ్య మీరు ఒక్క మాట అనండి నేను వెళ్లి వాడిని లాక్కుని వస్తాను అని మాట్లాడుతాడు. దానికి రఘురామ్ సీరియస్ అవుతూ ఎందుకు అలా మాట్లాడుతున్నావు మా వరకు మాకు అందరూ ఒకటే. మా తోటలో పూచిన అన్ని పూలు మావే అని భావిస్తాను. అన్నట్లు మాట్లాడతాడు.

బొమ్మలు కొనుక్కుని

బొమ్మలు కొనుక్కుని


అయితే రఘురాం ఉండబట్టలేక రాజేశ్వరి దగ్గరకు వెళ్లి వాడు నా రక్తం కాబట్టి వాడికి ఏమైనా జరిగినా పర్వాలేదు అని అనుకుంటున్నావేమో దయచేసి అలాంటి పనులు చేయవద్దు ఒక చిన్న పిల్లవాడిగా వాడు బాధ పడడం చూడలేకపోతున్నాను అని పేర్కొనడంతో రాజేశ్వరి కూడా గట్టిగా అరుస్తూ శైలూని పిలుస్తుంది. శైలు రావడంతో శిల్ప ఒక ఐడియా ఇస్తుంది. బొమ్మ తీసుకు వచ్చి ఇస్తాను ఏడుపు ఆపితే బొమ్మ కోసం ఏడుస్తున్నాడు అని ఆపకపోతే నిజంగా టాబ్లెట్ మింగాడు అని అనుకుంటున్నా అని అంటుంది. అలా తీసుకు వచ్చి బొమ్మ ఇస్తుంటే శైలు దానిని కోపంగా విసిరికొట్టి ఎమ్మెల్యే జనార్దన్ రావు మనవడు వీటితో ఆడుకోవడమా సమస్య లేదు అంటూ పైకి వెళ్లి తన తండ్రికి ఫోన్ చేసి బొమ్మలు కొనుక్కుని తీసుకురమ్మని చెబుతుంది.

కంప్లైంట్

కంప్లైంట్


అయితే అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగించారు. కమింగ్ ఎపిసోడ్ లో చూపిస్తుంది దాని ప్రకారం రిషిని హాస్పిటల్ కి షిఫ్ట్ చేశారు. అక్కడ అందరూ టెన్షన్ పడుతూ ఉంటే లక్ష్మణ్ మాత్రం కోపంగా వెళ్లినట్టు కనిపిస్తోంది లక్ష్మణ్ ను ఆపి ఇది పగలు ప్రతీకారాలకు సమయం కాదు దయచేసి నువ్వు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు అని భరత్ అంటాడు. కానీ నా కొడుకుని బలవంతంగా తీసుకు వెళ్లడం ఏంటి అంటూ లక్ష్మణ్ సీరియస్ అవుతున్నాడు. ఇంతలో జనార్ధన్ నా కొడుకుని లాక్కెళ్లారు అంటూ కంప్లైంట్ రాశాను, సంతకం పెట్టు అని లక్ష్మణ్ కి ఇస్తాడు. లక్ష్మణ్ కూడా సంతకం పెడుతున్నట్లు కనిపిస్తోంది చూడాలి తరువాత ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X