Vadinamma:రఘురామ్ ఇంట అనాథాశ్రమం టెన్షన్.. సీతను కలిశాక రఘుకు కొత్త టెన్షన్?
రఘు రామ్- సీతల పెళ్లి రోజు తర్వాత రఘురాంకు గుండెపోటు రావడంతో హాస్పిటల్ కి తరలిస్తారు. అయితే సీత రిషి గురించి నిజం చెప్పడంతో ఆయన కోలుకుంటాడు కానీ సీత మీద అసహ్యం పెంచుకుంటాడు, కోలుకుని ఇంటికి వచ్చిన రఘురాం ఎక్కువగా తన కొడుకు రిషితోనే సమయం గడుపుతూ ఉంటాడు. ఒకానొక రోజు రిషిని తీసుకుని షాప్ కు బయలుదేరి వెళ్ళడంతో శైలు పెద్ద రచ్చ చేస్తుంది. బాబు మెట్ల మీద నుంచి పడిపోగా, తీవ్ర గాయాలు అవుతాయి. దీంతో వాళ్ళు హాస్పిటల్ కి వెళితే అక్కడ కూడా పెద్ద రచ్చ జరుగుతుంది. బాబు కోలుకొని బయటకు వచ్చినా జనార్దన్ ఎంట్రీతో కుటుంబంలో మరిన్ని సమస్యలు మొదలయ్యాయి. ఇక రఘురాం తప్పులను భాస్కర్ ఎత్తి చూపి తన చెల్లెలి విషయంలో కళ్ళు తెరిపిస్తారు. ఇక అలా గత ఎపిసోడ్ ముగించారు. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Photo Courtesy: Star మా and Disney+Hotstar

భార్యను ఒప్పించే పనిలో
ఇంటికి వచ్చాక కూడా శైలు తన కొడుకు గురించి బాధ పడుతూ ఉంటుంది. ఎలా అయినా తన కొడుకుని తనతోనే ఉంచుకోవాలని భావిస్తూ ఆమె చేయని ప్రయత్నం అంటూ ఉండదు. అయితే ఈ విషయాలు అన్నీ పసిగడుతున్న లక్ష్మణ్ తన భార్య విషయంలో బాధపడతాడు. బాబు హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత నువ్వు అసలు బయటకు రావడం కూడా మానేసావు ఇలాగే ఉంటే నీ ఆరోగ్యం ఏమైపోతుందో ఆలోచించావా అని ప్రశ్నిస్తాడు.. నాకు అవన్నీ అనవసరం నాకు నా బాబు ముఖ్యం నా కళ్ళముందు వాడు ఉంటే నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని ఆమె అంటుంది. కనీసం తినడానికి కూడా వెళ్లకపోతే ఎలా నువ్వు వెళ్లి తిను రా అంటాడు.

ఒప్పుకోని శైలు
అయితే అందుకు ఒప్పుకోని శైలు నేను తినను అవసరమైతే ఇలాగే ఉంటాను గానీ బాబు మాత్రం వదిలి వెళ్ళను అంటుంది.. దీంతో లక్ష్మణ్ నువ్వు వెళ్లి తిని రా నేను బాబు కు రక్షణగా ఉంటాను నాతో ఆడుకుంటూ ఉంటాడు, అని చెప్పాక కూడా శైలు మాత్రం లక్ష్మణ్ మాట వినడానికి సిద్ధంగా లేదు.. ఇక తప్పని పరిస్థితుల్లో లక్ష్మణ్ స్వయంగా వెళ్లి ఆహారం తీసుకుని వచ్చి శైలు తినిపించడం మొదలు పెడతాడు. ఇక ఇదంతా బయట నుంచి చూస్తున్న రాజేశ్వరి కూడా తన కొడుకు, కోడలికి వచ్చిన కష్టానికి బాధపడుతుంది. ఎలా ఉండే శైలు ఎలా అయిపోయింది? ఇలాంటి పరిస్థితుల్లో నేనేం చేయాలి అన్నట్లుగా బాధపడుతూ ఉంటుంది.

షాక్ తగిలే విధంగా
మరోపక్క లక్ష్మణ్ శైలు తో ఆనందంగా గడుపుతూ ఆమెకు ఆహారం తినిపిస్తూ ఉంటాడు. రఘు రామ్ తన భార్య విషయంలో చేసిన తప్పులు గురించి బాధపడుతూ ఉంటాడు. గుడిలో కనిపించిన భాస్కర్ తన చెల్లెలు సీత గురించి రఘురాం కి అన్ని విషయాలను పూసగుచ్చినట్లు చెప్పడంతో తన భార్య విషయంలో తాను చేసిన తప్పును తెలుసుకున్న సంగతి తెలిసిందే.. అయితే సీతకు ఈ విషయం తెలియక పోవడంతో ఆమె ముందులాగే బావను ఎలా అయినా బుజ్జగించాలి అనే ఉద్దేశ్యంతో తాను చేసిన తప్పులు ఒప్పుకుని తనను క్షమించాల్సిందిగా కోరుతూ ఉంటుంది. అలాగే ఎంతో గొప్ప వాడివి అయిన నువ్వు నన్ను మంచం మీద పడుకోనిచ్చి నువ్వు కింద పడుకుంటున్నావు అది కరెక్ట్ కాదు అన్నట్లు చాలా బాధపడుతూ తన ఆవేదనను వ్యక్తం చేస్తుంది. అయితే ఆమెకు షాక్ తగిలే విధంగా రఘురామ్ స్వయంగా సీతను పట్టుకుని ఓదారుస్తాడు.

కళ్ళు తెరుచుకున్నాయి
నువ్వేంటో తెలిసి కూడా నేను నిన్ను అపార్థం చేసుకున్నాను నన్ను క్షమించు ఇప్పటికి నా కళ్ళు తెరుచుకున్నాయి ఇక మీదట నువ్వు అలా మాట్లాడొద్దు అని అంటాడు. నువ్వు బిడ్డని సహాయం చేసింది నా కుటుంబానికి అన్న విషయం కూడా నేను మరిచిపోయి ఇప్పటిదాకా నిన్ను చాలా ఇబ్బందులు పెట్టాను నన్ను క్షమించమని రఘురాం అడుగుతాడు. లేదు బావ నేను బాధ పెట్టాను కనీసం ఋషి మనతో ఉంటే మనం చాలా ఆనంద పడేవాళ్ళం అంటుంది సీత. మళ్లీ వెంటనే మన కంటే మన పిల్లవాడే గొప్ప ఎందుకంటే వేరే తల్లిదండ్రులను కూడా వాడు ఆనందపరుస్తూ ఉన్నాడు అని అంటుంది.
Recommended Video

మళ్ళీ జనార్ధన్ ఎంట్రీ
ఇక తెలవారుతుండగానే లక్ష్మణ్ ఇద్దరు వ్యక్తులను ఇంటికి తీసుకువస్తాడు పెద్దన్నయ్య రఘురామ్ సహా సీత ఎక్కడ ఉంది అని వెతుకుతూ ఉంటాడు. ఇంతలో సీత లేదు గుడికి వెళ్ళింది అనే విషయం తెలుసుకున్న తరువాత నెమ్మదిగా వాళ్ళు అనాధాశ్రమం నుంచి వచ్చారని పిల్లలు లేని వారికి పిల్లలను దత్తత ఇస్తారని చెబుతాడు. విషయం అర్ధం అయిన రాజేశ్వరి కావాలని మీకు పిల్లలతో పని ఏం ఉందిరా మీ పిల్లవాడిని దత్తత ఇస్తున్నారా ఏమిటి అన్నట్లు మాట్లాడుతుంది. లేదని అన్నయ్య పిల్లల కోసం పరితపిస్తున్నాడు కాబట్టి దత్తత తీసుకుంటారేమో అనే ఉద్దేశంతో ఇంటికి తీసుకు వచ్చాను అని అంటాడు లక్షణ. అక్కడితో నేటి ఎపిసోడ్ ముగించారు. తరువాతి ఎపిసోడ్ కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం జనార్ధన్ రఘురాం కలిసి రెచ్చగొట్టే విషయంలో ఏదో చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











