Just In
Don't Miss!
- News
తాజ్‌మహల్‌కు బాంబు బెదిరింపు... ఆ వ్యక్తిని పట్టుకున్న పోలీసులు... ఏం తేల్చారంటే...
- Sports
బెన్ స్టోక్స్ నన్ను తిట్టాడు.. అందుకే కోహ్లీ భాయ్ జోక్యం చేసుకున్నాడు: మహ్మద్ సిరాజ్
- Lifestyle
ఊబకాయానికి ప్రమాద కారకాలు మీకు తెలుసా? తెలివిగా దీన్ని ఎలా ఎదుర్కోవాలో మీకు తెలుసా?
- Automobiles
మళ్ళీ వివాదంలో చిక్కుకున్న దుల్కర్ సల్మాన్.. అసలు విషయం ఏంటంటే?
- Finance
మళ్లీ ఎగిసిపడిన బిట్‌కాయిన్, భారత్‌లో క్రిప్టోకు భలే డిమాండ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అక్కడ తీసేసినా ఇక్కడ చాన్స్ దొరికింది.. కొత్త ఊపుతో యాంకర్ వర్షిణి బ్యాక్
బుల్లితెరపై తళుక్కున మెరిసిన అందం పేరు వర్షిణి సౌందరరాజన్. పెళ్లి గోల అనే వెబ్ సిరీస్‌తో కుర్రకారును కట్టిపడేసింది. ఆ తరువాత బుల్లితెరపై కనిపించింది అందరి మనసులను దోచింది. అందరూ కలిసి ఆమె మీద పంచ్‌లు వేశారు. ప్రారంభంలో తింగరిబుచ్చి, అమాయకురాలు అనే ముద్రను వేసే ప్రయత్నంచేశారు. కానీ రాను రాను తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పర్చుకుంది. సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకునేంత రేంజ్‌కు వెళ్లింది.
టీవీ యాంకర్ అర్చన విజయ: బికినిలో అందాలు ఆరబోత (ఫొటోలు)

ఆ రెండు షోలతో..
వర్షిణి అంటే ముఖ్యంగా ఢీ షో గుర్తుకు వస్తుంది. కానీ అంతకు ముందు పటాస్ షోను కూడా చేసింది. శ్రీముఖి బిగ్ బాస్ షోకు వెళ్లిన తరువాత పటాస్‌లో ఖాళీ ఏర్పడింది. అలా వర్షిణి పటాస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడా తన సత్తాను చాటుకుంది. ఢీ పన్నెండో సీజన్‌లో హైపర్ ఆదితో మంచి కెమిస్ట్రీ కుదిరింది.

ఇద్దరి జంట వైరల్...
ఢీ షోలో వర్షిణి, ఆది కలిసి చేసిన రచ్చకు సోషల్ మీడియా మొత్తం షేక్ అయింది. ఇద్దరి మధ్య ఏదో నడుస్తోందంటూ, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతోన్నారంటూ రకరకాల రూమర్లు వచ్చేవి. యూట్యూబ్‌లో ఎక్కడ చూసినా ఆది వర్షిణి జంటే కనిపించేది. కానీ తమ మధ్య అలాంటిదేమీ లేదని, మంచి స్నేహితులమేనని చెప్పుకొచ్చారు.

ఢీ నుంచి బయటకు..
ఢీ కింగ్స్ వర్సెస్ క్వీన్ అనే షోలో వర్ణిణిని తీసేశారు. ఆమె స్థానంలో దీపిక పిల్లి అనే టిక్ టాక్ అమ్మాయిని తీసుకొచ్చారు. అయితే వర్షిణి వెళ్లిపోయిందా? ఢీ టీం వెళ్లమని చెప్పిందా? మల్లెమాలతో గొడవా? అన్నది ఏమి తెలియదు. కానీ మొత్తానికి వర్షిణి మాత్రం ఢీలో కనిపించడం లేదు.

కొత్త షోతో రచ్చ..
స్టార్ మాలో ఇప్పుడు ఓ కొత్త షో రాబోతోంది. బిగ్ బాస్ కంటెస్టెంట్లతో కలిసి కామెడీ స్టార్స్ అనే కొత్త షోను ప్రారంభించారు. అందులో బిగ్ బాస్ కంటెస్టెంట్లతో పాటు శేఖర్ మాస్టర్, నాటి హీరోయిన్ శ్రీదేవీలను తీసుకొచ్చి భారీగా ప్లానే చేశారు. అయితే ఇందులో యాంకర్‌గా వర్షిణిని తీసుకున్నారు.

మంచి చాన్స్..
అలా ఢీ నుంచి బయటకు వచ్చిన వర్షిణికి వెంటనే ఇలా కొత్త షో రావడం నిజంగానే లక్కీ. వర్షిణికి మొత్తంగా సోలో యాంకర్‌గా నిరూపించుకునే చాన్స్ వచ్చింది. మొత్తానికి ఇలా కొత్త షోతో అదిరింది టీంకు మంచి అవకాశం లభించింది. వర్షిణి ఈ షోతో మరింతగా ముందుకు వెళ్తుందేమో చూడాలి.