Just In
- 6 min ago
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్‌కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- 36 min ago
శ్రీను వైట్ల ఓ శాడిస్ట్.. మంచు విష్ణు సెన్సేషనల్ కామెంట్స్
- 1 hr ago
డైరెక్టర్ తేజ ఫోన్ చేసి అలా అనడంతో ఏడ్చేశా.. అసలు విషయం చెప్పిన షకీలా
- 2 hrs ago
నాటి స్కాం వీడియో.. ఆ సైగలను ఉద్దేశిస్తూ మెహబూబ్‌పై సుమ కౌంటర్ అదుర్స్
Don't Miss!
- News
ఏపీలో కొత్తగా 111 కరోనా కేసులు: ఆ రెండు జిల్లాల్లో ‘0’ కేసులు, జిల్లాలవారీగా..
- Automobiles
దక్షిణ భారత్‌లో కొత్త డీలర్షిప్ ఓపెన్ చేసిన బెనెల్లీ; వివరాలు
- Sports
సౌరవ్ గంగూలీ క్షేమం.. గురువారం రెండో స్టెంట్!!
- Finance
ప్రపంచంలోనే భారత్, చైనా అదుర్స్, మన పెట్టుబడులు మాత్రం డౌన్
- Lifestyle
Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆ కంటెస్టెంట్‌కు విజయ్ దేవరకొండ సపోర్ట్: ఫోటోతో ప్రేమను బయటపెట్టి.. బిగ్ బాస్ విన్నర్ అవ్వాలంటూ!
దాదాపు వంద రోజుల పాటు ప్రేక్షకులను మజాను పంచుతూ తిరుగులేని షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. ఇప్పటికే తెలుగులో మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో... నాలుగో దాన్ని కూడా అదే రీతిలో కంప్లీట్ చేయబోతోంది. ఎన్నో మలుపులతో సాగిన ఈ సీజన్ ఫినాలే స్టేజ్‌కు చేరుకుంది. మరో వారం రోజుల్లో విన్నర్ ఎవరో తేలిపోనుంది. ఇలాంటి సమయంలో టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేరవకొండ బిగ్ బాస్ షోపై తొలిసారి స్పందించాడు. అంతేకాదు.. ఓ కంటెస్టెంట్‌కు మద్దతు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఆ వివరాలు మీకోసం!

ఫినాలేకి చేరిన ఐదుగురు కంటెస్టెంట్లు
ఎన్నో మలుపులు.. ఊహించని సంఘటనలు.. అనూహ్యమైన ఎలిమినేషన్లు.. కంటెస్టెంట్ల మధ్య గొడవలు.. ప్రేమ కహానీలు ఇలా ఎన్నో రకాలుగా సాగింది బిగ్ బాస్ నాలుగో సీజన్. ప్రస్తుతం జరుగుతోన్న సీజన్ ఫినాలే వీక్‌కు చేరుకుంది. 14 వారాల పాటు సాగిన ఇందులో అఖిల్ సార్థక్, సయ్యద్ సోహెల్ రియాన్, అభిజీత్, దేత్తడి హారిక, ఆరియానా గ్లోరీలు టాప్-5కు చేరుకున్నారు.

ఓటింగ్ లైన్స్ ఓపెన్.. రెండు పద్దతులు
తుది పోరుకు చేరుకున్న ఐదుగురు సభ్యుల్లో మీకు నచ్చిన అభ్యర్థులకు మద్దతు తెలిపేందుకు ఆదివారం రాత్రి నుంచే ఓటింగ్ లైన్స్ ఓపెన్ చేశారు బిగ్ బాస్ నిర్వహకులు. రెండు పద్దతుల ద్వారా మీ ఓట్లను వేయవచ్చు. అందులో ఒకటి హాట్‌స్టార్ యాప్‌లో లాగిన్ అవడం ద్వారా రోజుకు పది ఓట్లు ఉపయోగించుకోవచ్చు. అలాగే, మిస్‌డ్ కాల్స్ ద్వారా కూడా ఓటింగ్‌లో పాల్గొనవచ్చు.

అందరి దృష్టిలో ఆ కంటెస్టెంటే విన్నర్
ఎవరు ఎలా ఆడినా.. ఎలాంటి సాహసాలు చేసినా.. ఈ సీజన్‌కు అభిజీతే విన్నర్ అవుతాడన్న టాక్ బాగా వినిపిస్తోంది. టాస్కుల్లో సరిగా ఆడలేకపోయినా జెంటిల్‌మెన్ గేమ్‌తో ఆకట్టుకున్న అతడు.. వివాదరహితుడిగా పేరొందాడు. అంతేకాదు, భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు. ఈ కారణంగానే ఇన్ని వారాల పాటు ఓటింగ్‌లో టాప్ పొజిషన్‌లో ఉన్నాడు.

బిగ్ బాస్ షోపై విజయ్ దేరకొండ పోస్ట్
‘పెళ్లి చూపులు' సినిమాతో హీరోగా పరిచయం అవడంతో పాటు ‘అర్జున్ రెడ్డి'తో ఎనలేని క్రేజ్‌ను అందుకున్నాడు విజయ్ దేవరకొండ. అప్పటి నుంచి వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తోన్న అతడు.. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఫైటర్' అనే మూవీ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా విజయ్.. బిగ్ బాస్ షోపై స్పందించాడు. ఈ మేరకు ఓ పోస్టును కూడా పెట్టాడు.

ఆ కంటెస్టెంట్‌కు మద్దతు తెలిపిన విజయ్
ఫినాలేకు చేరిన వారిలో అభిజీత్‌కే సినీ ప్రముఖులంతా మద్దతు తెలుపుతున్న విషయం తెలిసిందే. మెగా బ్రదర్ నాగబాబు, హీరో శ్రీకాంత్, జబర్ధస్త్ కమెడియన్లతో పాటు పలువురు సెలెబ్రిటీలు అతడికే ఓట్ చేయమని కోరుతున్నారు. ఇలాంటి సమయంలో హీరో విజయ్ దేరకొండ కూడా అభిజీత్‌కే తన మద్దతును ప్రకటించాడు. దీంతో అతడి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఫోటోతో ప్రేమను బయటపెట్టిన విజయ్
అభిజీత్ హీరోగా నటించిన ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' సినిమాలో చిన్న పాత్రను పోషించాడు విజయ్ దేవరకొండ. ఆ మూవీలో నటించిన వాళ్లతో దిగిన ఫొటోను తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసిన విజయ్ దేవరకొండ.. ‘బాయ్స్.. మీరు ఎక్కడున్నా.. ఎల్లప్పుడూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నా' అంటూ రాసుకొచ్చాడు. అంటే పరోక్షంగా అభిజీత్ విన్నర్ అవ్వాలంటూ కోరుకున్నాడు.