నాకు హార్డ్ గానే కావాలి.. విష్ణుప్రియా బోల్డ్ కామెంట్స్.. ఏమైందంటే?

యాంకర్‌గా విష్ణు ప్రియా భీమినేని తెలుగు బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. తనకు చిన్నప్పటి నుంచే నటిగా రాణించాలని గోల్ ఉండింది. అందుకు తగ్గట్టుగానే విష్ణుప్రియా భీమినేని తన స్కూల్ డేస్ నుంచే స్కూల్ లో నిర్వహించే కల్చరల్ యాక్టివిటీస్ పాల్గొంటూ వచ్చింది. విష్ణు ప్రియా హైదరాబాద్ లో పుట్టి పెరిగింది. తన చదువును కూడా ఇక్కడే పూర్తి చేసుకుంది. ఆ తర్వాత నటిగా అవకాశాలు అందుకోవాలని ప్రయత్నించింది. కానీ యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

2018లో తొలిసారిగా తెలుగు టెలివిజన్ గేమ్ షో టాలీవుడ్ స్క్వేర్ ప్రోగ్రామ్ కు గెస్ట్‌గా ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత అనుభవించు రాజా, క్యాష్ అనే ప్రొగ్రామ్స్ కు హోస్ట్ గానూ వ్యవహరించింది. తనదైన శైలిలో వ్యాఖ్యతగా వ్యవహరించి తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యింది. అంతే కాదు 2018లో జరిగిన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 7వ ఎడిషన్ కు హోస్ట్ గా వ్వయహరించి మరింత పేరు సంపాదించుకుంది. ఆ తర్వాత నుంచి వరుసగా టీవీ షోలతో అలరిస్తూనే వస్తోంది.

Vishnupriya Bhimeneni Bold Comments

తక్కువ సమయంలో తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సంపాదించుకుంది. డ్యాన్స్ జోడీ డ్యాన్స్, పోవే పోరా వంటి రియాలిటీ షోలతో మరింతగా క్రేజ్ దక్కించుకుంది. ఇక సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది. మరోవైపు తనకు సమయం ఉన్నప్పుడల్లా విష్ణుప్రియా ఇంటర్వ్యూలు, టాక్ షోలు, చిట్ చాట్ లకు హాజరవుతూ తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇక రీసెంట్‌గా విష్ణుప్రియా యాంకర్ నిఖిల్ ముద్దు ముచ్చట్లు టాక్ షోకు హాజరైంది.

యాంకర్ నిఖిల్ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరంగా సమాధానం ఇచ్చింది. నాటీ ఎడిషన్ అంటూ నిఖిల్ ఒక ప్రశ్న అడిగారు. ఎందుకు ఏమిటీ అడగకుండా సమాధానాలు చెప్పాలని కండీషన్ పెట్టాడు. లైట్స్ ఆన్ లేదా ఆఫ్ అంటూ ప్రశ్నించాడు. అందుకు విష్ణుప్రియా వెలుతురు చీకటికి మధ్యలో అని చెప్పింది. టాకింగ్ - టెక్ట్స్ లో టాకింగ్ అని, పబ్లిక్ ఫర్ట్ - ప్రైవేట్ ఫ్రీక్ లో ఏదైనా ఓకే అని, ఇక నాకు ఒక పర్సన్ నచ్చితే మాత్రం చుట్టు పక్కల ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోతానని, అతను అడిగినవన్నీ ఇస్తానని చెప్పింది.

ఇక నిఖిల్ ఒకడుగు ముందు వేసి కాస్తా డేరింగ్ ప్రశ్నను అడిగాడు. హార్డ్ వే - రొమాంటిక్ వే అని ప్రశ్నించగా.. విష్ణుప్రియా రెండు ఓకే అని నిర్మోహమాటంగా చెప్పేసింది. నిఖిల్ ప్రశ్న పూర్తవ్వకుండానే బోల్డ్ గా ఆన్సర్స్ ఇచ్చేస్తున్నావంటూ ఫన్నీ కామెంట్ చేశారు. అయితే ఇలా విష్ణుప్రియా ఇచ్చిన సమాధానాలు బోల్డ్ గా ఉన్నాయని, డబల్ మీనింగ్ కూడా ఉందని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియో క్లిప్ మాత్రం నెట్టింట వైరల్ గా మారింది. ఇక విష్ణు ప్రియాకు సోషల్ మీడియాలో 1.3 మిలియన్ ఫాలోవర్స్ ఉండటం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X