For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వాళ్లు ఎక్కువగా అవే చూపిస్తారు.. అందుకే జాగ్రత్తగా ఉండండి: బిగ్ బాస్‌పై వితిక సంచలన వ్యాఖ్యలు

  |

  తెలుగులో బిగ్ బాస్ షో ఎంతో స్పెషల్ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీని వల్ల ఎంతో మంది చిన్న చిన్న ఆర్టిస్టులు భారీ స్థాయిలో ఫాలోయింగ్‌ను అందుకున్నారు.. అదే సమయంలో చాలా మంది గొప్ప వాళ్లు చెడ్డ పేరును మూటగట్టుకున్నారు. అందుకే ఈ షోలోకి ఎంట్రీ ఇవ్వాలంటే చాలా మంది ఆలోచిస్తుంటారు. ఇదిలా ఉండగా, బిగ్ బాస్ షో మాత్రం మరో వారం రోజుల్లో నాలుగో సీజన్‌ను కూడా పూర్తి చేసుకోబోతుంది. ఇలాంటి సమయంలో సీజన్ -3 కంటెస్టెంట్ వితిక షేరు బిగ్ బాస్ షోపై సంచలన వ్యాఖ్యలు చేసింది. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

  బిగ్ బాస్ చరిత్రలో తొలిసారి వాళ్లే

  బిగ్ బాస్ చరిత్రలో తొలిసారి వాళ్లే

  బిగ్ బాస్ షోలోకి ఎంతో మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇస్తుంటారు. అయితే, షో చరిత్రలోనే తొలిసారి భార్య భర్తలు జంటగా ప్రవేశించారు. అది కూడా తెలుగులో ప్రసారం అవుతోన్న షోలోనే కావడం విశేషం. టాలీవుడ్‌లో హీరో హీరోయిన్లుగా వెలుగొందుతూ ప్రేమ వివాహం చేసుకున్న వరుణ్ సందేశ్, వితిక షేరు బిగ్ బాస్ మూడో సీజన్‌లోకి కంటెస్టెంట్లుగా ప్రవేశించిన విషయం తెలిసిందే.

  రొమాన్స్‌లో మునిగి తేలిన జంట

  రొమాన్స్‌లో మునిగి తేలిన జంట

  హౌస్‌లోకి ఎంటరైన తర్వాత వరుణ్ సందేశ్.. వితిక కలిసే కనిపిస్తుండేవారు. ఒకరి బాగోగులు మరొకరు చూసుకోవడం.. మధ్య మధ్యలో డబుల్ మీనింగ్ డైలాగులతో బాతాకానీలు పెట్టడం వంటివి చేశారు. తరచూ ముద్దులు, హగ్గులు ఇచ్చుకుంటూ ఉండేవారు. ఒకానొక సందర్భంలో బాత్ టబ్‌లో, దుప్పట్లో దూరిపోయి రొమాన్స్ చేయడం వంటి వాటితో ఈ జంట మరింత హైలైట్ అయింది.

  నిరాశనే మిగిల్చిన రియాలిటీ షో

  నిరాశనే మిగిల్చిన రియాలిటీ షో

  ఈ షోలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచే జెంటిల్‌మన్ ఆటతో ఆకట్టుకున్నాడు వరుణ్ సందేశ్. అదే చివరి వరకూ కొనసాగించి ఫినాలేకు చేరుకున్నాడు. కానీ, గ్రాండ్ ఫైనల్ ఎపిసోడ్‌లో ముందుగానే ఎలిమినేట్ అయ్యాడు. వితిక అయితే కన్నింగ్ ఆట ఆడుతుందన్న చెడ్డ పేరును మూటగట్టుకుంది. ఫలితంగా షో మధ్యలోనే బయటకు వచ్చేసింది. ఫలితంగా ఈ షో వాళ్లకు నిరాశనే మిగిల్చింది.

  నాలుగో సీజన్‌ ఫినాలేకు చేరింది

  నాలుగో సీజన్‌ ఫినాలేకు చేరింది

  ఇదిలా ఉండగా, ప్రస్తుతం జరుగుతోన్న నాలుగో సీజన్ ఫినాలే వీక్‌కు చేరుకుంది. 14 వారాల పాటు సాగిన ఇందులో అఖిల్ సార్థక్, సయ్యద్ సోహెల్ రియాన్, అభిజీత్, దేత్తడి హారిక, ఆరియానా గ్లోరీలు టాప్-5కు చేరుకున్నారు. ఇక, డిసెంబర్ 20న బిగ్ బాస్ నాలుగో సీజన్ గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఇందుకోసం ఆదివారం రాత్రి నుంచి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయిపోయాయి.

  షోపై వితిక షేరు సంచలన వ్యాఖ్యలు

  షోపై వితిక షేరు సంచలన వ్యాఖ్యలు

  తాజాగా సోషల్ మీడియాలో లైవ్ చాట్ నిర్వహించింది వితిక షేరు. ఆ సమయంలో ఆమెకు బిగ్ బాస్ షో గురించి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. అదే సమయంలో నాలుగో సీజన్ విన్నర్ ఎవరు అవుతారంటూ కొందరు.. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారంటూ మరికొందరు ఆమెను ప్రశ్నించారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ షోపై వితిక షేరు సంచలన వ్యాఖ్యలు చేసింది.

  Bigg Boss Telugu 4 : Vijay Devarakonda Supports His Life Is Beautiful Co Star Abhijeet
  వాళ్లు ఎక్కువగా అవే చూపిస్తారు

  వాళ్లు ఎక్కువగా అవే చూపిస్తారు

  నెటిజన్ల ప్రశ్నలపై స్పందిస్తూ... ‘బిగ్ బాస్ షోలో చూపించేవి నమ్మకండి. ఎడిటర్లకు నచ్చిన కంటెంట్‌నే వాళ్లు ఎక్కువగా చూపిస్తారు. దీని వల్ల ఒరిజినల్ క్యారెక్టర్లు బయట పడవు. కాబట్టి.. మీకు బాగా నచ్చిన, తెలిసిన కంటెస్టెంట్‌కే ఓట్లు వేయండి. నేనైతే నాకు తెలిసిన వాళ్లనే ఓట్లు వేస్తున్నాను. దయచేసి షోలో చూసి వాళ్లపై అభిప్రాయాలు ఏర్పరచుకోకండి' అంటూ చెప్పుకొచ్చిందామె.

  English summary
  Jeedigunta Vithika, also known as Vithika Sheru, is an Indian actress, who has acted in Telugu, Tamil and Kannada. She was one of the participants in the Bigg Boss Telugu 3 show.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X