"ఓ స్త్రీ రేపురా..!" అన్నట్టు ఇంకా త్వరలోనే అట... ఇంతకీ చిరు హాట్ సీట్ మీదకి ఎప్పుడొస్తాడు

మీలో ఎవరు కోటీశ్వరుడు సీజన్ 4 కి చిరు హోస్ట్గా వ్యవరిస్తున్నట్టు ప్రోమోలు వేస్తున్నారు తప్ప ప్రోగ్రాం మాత్రం రావటం లేదు .

మీలో ఎవరు 'కోటీశ్వరుడు' పేరు చెప్పగానే 'నాగార్జున' పేరు గుర్తుకొస్తుంది. వరుసగా 3 సీజన్ల పాటు ఆ కార్యక్రమాన్ని రక్తికట్టించిన ఘనత మన్మధుడిదే. అన్ని వర్గాల ప్రేక్షకులతో పాటు.. బుల్లితెరపై అత్యథిక వ్యూవర్ షిప్ కలిగిన మహిళా ప్రేక్షకుల్ని ఎట్రాక్ట్ చేయడంలో నాగ్ వందకు 2వందల శాతం సక్సెస్ అయ్యారు.అయితే కొన్ని కారణాల వల్ల నాగార్జున ఈ కార్యక్రమాన్ని నిర్వహించలేకపోవటం, ఒకే హోస్ట్ ఉంటే మొనాటనీ వచ్చే ప్రమ్మాదం కూడా ఉండటం వల్ల కొన్నాళ్ళు తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు.

మరి ఆ కార్యక్రమానికి అంతే రేంజ్ ఉన్న స్టార్ కావాల్సి వచ్చినప్పుడు అదే చానెల్ లో భాగస్వామిగా కూడా ఉన్న మెగాస్టార్ సరైన ఆప్షన్ అనిపించటం తో చిరు నే హోస్ట్గా ఒప్పించారు. ఇక నాలుగో సీజన్‌లో మెగా స్టార్ చిరంజీవి ఆ బాధ్యతలను తీసుకుంటున్నారు. తద్వారా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి బుల్లితెరపై కనిపించబోతున్నారు అనగానే మెగా అభిమానుల్లో ఆనందం వెల్లువెత్తింది...

మీలో ఎవరు కోటీశ్వరుడు:

మీలో ఎవరు కోటీశ్వరుడు:

చాలా కాలం విరామం తర్వాత 150వ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తోన్న చిరంజీవి... ఇక బుల్లి తెరపై కూడా మెరవనున్నారు. నాగార్జున ఆధ్వర్యంలో ఇప్పటి వరకూ సాగిన మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమాన్ని ఈ సీజన్ నుంచి మెగాస్టార్ నిర్వహించనున్నారు అంటూ చాలా కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి.

 కమాన్ లెట్స్ ప్లే:

కమాన్ లెట్స్ ప్లే:

తాజాగా ఆ కార్యక్రమానికి సంబంధించిన టీజర్‌ను మాటీవీ రిలీజ్ చేసింది. శనివారం సాయంత్రం 7 గంటలకు చిరంజీవి హోస్ట్‌గా దర్శనమిచ్చిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు' టీజర్‌ను విడుదల చేశారు. ‘‘వెండితెరపై మీరు నన్ను గెలిపించారు. బుల్లితెరపై మిమ్మల్ని గెలిపించేందుకు వస్తున్నాను. కమాన్ లెట్స్ ప్లే'' అంటూ టీజర్‌లో మెగాస్టార్ ఓ మెసేజ్‌ను కూడా ఇచ్చాడు.

చెప్పాం కదా త్వరలో:

చెప్పాం కదా త్వరలో:

అయితే ఈ మధ్య ఈ ప్రకటనలు కూడా కనిపించడంలేదు. దీనితో కొందరు మెగా వీరాభిమానులు ఇంతకీ ఈ కార్యక్రమం ఎప్పుడు ప్రసారం అవుతుంది అనే ప్రశ్నతో ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయబోతున్న ఛానల్ ఆఫీస్ ను సంప్రదిస్తే చెప్పాం కదా త్వరలో అని సమాధానం వస్తున్నట్లు టాక్.

ముగింపు ఎప్పుడు :

ముగింపు ఎప్పుడు :

దీనితో ఈ ‘త్వరలో..' అనే ట్యాగ్ కు ముగింపు ఎప్పుడు అని మెగా అభిమానులు మధన పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అప్పట్లో ఆ షోకు సంబంధించిన ప్రోమోను కూడా రిలీజ్ చేశారు. చిరు సూట్ లో నడుస్తూ వస్తున్న లుక్ చూస్తే ఈ గ్యాంగ్ లీడర్ అభిమానులను స్మాల్ స్క్రీన్ మీద కూడా మెస్మరైజ్ చేస్తాడనిపిస్తుంది.

డిసెంబర్ 12 అన్నారు:

డిసెంబర్ 12 అన్నారు:

విజయదశమి నుండి స్టార్ట్ అంటూ వచ్చిన వార్తలు కూడా ఇప్పుడు ఆగిపోయాయి. ఆతర్వాత డిసెంబర్ 12 అన్నారు అదీ అవలేదు విజయ దశమే కాదు దీపావళి క్రిస్టమస్ కూడా వెళ్ళిపోయాయి, కొత్త సంవత్సరమూ వచ్చింది ఏకంగా ఆ ప్రోగ్రాం పేరుతోనే ఒక సినిమాకూడా వచ్చిందీ వెళ్లిందీ కానీ ఇంకా చిరంజీవి మాత్రం హాట్ సీట్ మీదకి రాలేదు.

ఎందుకు ప్రసారం చేయడం లేదు:

ఎందుకు ప్రసారం చేయడం లేదు:

దీనితో ఈ క్లార్యక్రమానికి చిరంజీవి హోస్టుగా ఎలా ఉంటాడు? అని ఆత్రంగా ఎదురు చూస్తున్న మెగా అభిమానుల జోష్ కు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఇది వరకు అమితాబ్ ఆ తర్వాత తెలుగునాట నాగార్జున హోస్ట్ చేసిన ఈ షోకు మెగాస్టార్ ఎలా ఉంటాడనే ఆసక్తి అందరిలోనూ బాగా పెరిగి ఉన్న నేపధ్యంలో ఈ కార్యక్రమానికి సంబంధించి కొన్ని భాగాలు రికార్డు అయి కూడ ఎందుకు ప్రసారం చేయడం లేదు అన్న విషయం సమాధానం లేని ప్రశ్నగా మారింది..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X