»   » ఆ నలుగురు ఎవరు?? చివరకు మిగిలే ఒకే ఒక్కడు?: తెలుగు బిగ్‌బాస్ పై తెలియని ఉత్కంఠ

ఆ నలుగురు ఎవరు?? చివరకు మిగిలే ఒకే ఒక్కడు?: తెలుగు బిగ్‌బాస్ పై తెలియని ఉత్కంఠ

Posted By:
Subscribe to Filmibeat Telugu
Bigg Boss Telugu : Who Is The Winner In Bigg Boss ?

బిగ్‌బాస్‌ ఇప్పటివరకూ తెలుగు చానెల్స్ లో ఉన్న రియాలిటీషో ల రూపాన్ని పూర్తిగా మార్చేసిన షో. హాలీవుడ్ లో మొదలై సంచలనాలను నమోదు చేసిన ఈ సెలబ్రిటీ గేమ్ ఇండియాలో బాలీవుడ్ కీ అక్కడినుంచి తమిళ్ తెలుగు లకూ వచ్చింది. అయితే ఇక్కడ ఇలాంటి షో వర్క్ ఔట్ అవుతుందా? అన్న అనుమానాలతో పాటుగా, బ్లమైన వ్యతిరేకత కూడా వచ్చింది. పూర్తి నెగెటివ్ ఇంప్రెషన్ తో మొదలైన ఈ కాంట్రవర్షియల్ గేమ్ తర్వాత తర్వాత చాలామందిని తనవైపుకు తీప్పుకుంది.

ఒక కొత్త ఎన్టీఆర్‌

ఒక కొత్త ఎన్టీఆర్‌

సెలబ్రిటీలలో మనం మాలుగా చూడలేని రకరకాల కోణాలనీ, మనుషుల్లో ఉండే విపరీతమైన ఎమోషన్స్ నీ చూపించటమే కాదు ఎన్టీఆర్‌ లాంటి ఒక హీరోలో ఉన్న ఈజ్ నీ, ఒక విభిన్నమైన మనస్తత్వాన్ని కూడా ఈ షో బయటపెట్టింది. హౌస్మేట్స్ తో జూనియర్ మాట్లాడిన తీరూ, ప్రేక్షకులని ఆకట్టుకునేలా షోని హోస్ట్ చేసిన విధానం ప్రేక్షకులకి ఒక కొత్త ఎన్టీఆర్‌ ని చూపించింది.

షో చివరి దశకు వచ్చేసింది

షో చివరి దశకు వచ్చేసింది

సరే ఇవన్నీ పక్కన పెడితే... ఇప్పుడు ఈ షో చివరి దశకు వచ్చేసింది.. ఒక్కొక్కరూ వెళ్ళిపోగా చివరకు మిగిలిన ఆ నలుగురిలో ఎవరు ఇప్పుడు "బిగ్ బాస్" టైటిల్ ని గెల్చుకుంటారు? అన్న ప్రశ్న ఇప్పుడు అందరినీ తొలుస్తోంది.... ప్రస్తుతం బిగ్‌ బాస్‌ హౌస్‌లో ఆరుగురు సభ్యులు మిగిలారు. 1. నవదీప్‌ 2. శివబాలాజీ 3. అర్చన 4. హరితేజా 5. ఆదర్శ్‌ 6. దీక్షా.

ఈ వారం నామినేట్‌

ఈ వారం నామినేట్‌

ఈ వారం నామినేట్‌ అయిన వారిలో అర్చన, హరితేజా, ఆదర్శ్, దీక్షా ఉన్నారు. వీరిలో ఇద్దరు- ఆదర్శ్, దీక్షాను పంపించేయవచ్చని... ఆఖరు వారానికి నవదీప్, శివబాలాజీ, అర్చన,హరితేజా మిగులుతారని ఎక్కువమంది భావిస్తున్నారు. అయితే ఎవర్ని పంపిస్తారన్న విషయం ఖచ్చితంగా చెప్పలేం... అయితే ఈ ఆరుగురిలోనే ఫైనల్స్ కి నలుగురు వెళ్తారు. మరి ఫైనల్కి వెళ్తే బిగ్ బాస్ తైటిల్ ఎవరు గెలుచుకోవచ్చు అన్నదే ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న...

ప్రేక్షకులకు మింగుడు పడటం లేదు

ప్రేక్షకులకు మింగుడు పడటం లేదు

బిగ్‌బాస్‌ మొదలైనప్పటి నుంచి ఆ షో ఎన్నో మలుపులు తిరుగుతూ ఉంది. చివరి వరకూ ఉంటారనుకున్న ధన్‌రాజ్, ప్రిన్స్‌ షో నుంచి ఎలిమినేట్‌ కావాడం వాళ్ల అభిమానులకే కాదు చాలామంది ప్రేక్షకులకు మింగుడు పడటం లేదు. హౌస్‌లో ఎక్కువసార్లు నామినేట్‌ అయిన అర్చన, దీక్షా, శివబాలాజీ వంటి వారు షోలో మిగిలి తక్కువసార్లు నామినేట్‌ అయిన ప్రిన్స్, ధన్‌రాజ్‌ బయటకు వచ్చేయడం ఊహించని మలుపుగా భావించవచ్చు.

అర్చన

అర్చన

అయితే ఇప్పుడు ఉన్న వాళ్ళలో అర్చన విషయానికి వస్తే ఈమె టైటిల్ గెలిచే అవకాశం ఉందన్నది మాత్రం చాలామందికి అనుమానమే... హీరోయిన్‌గా ఒకప్పుడు నటించి, ఆ తర్వాత ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్న అర్చన బిగ్‌బాస్‌ షోకు గ్లామర్‌ యాడ్‌ చేసిందని చెప్పవచ్చు. యూత్‌ మెచ్చే బట్టలు ధరిస్తూ ఎప్పుడూ లిప్‌స్టిక్‌ చెరగకుండా చూసుకుంటూ బ్యూటీ కాన్షియస్‌నెస్‌తో ఆమె ఈ షోలో స్క్రీన్‌కు అట్రాక్షన్‌ ఇస్తోంది. అయితే ఆమె ప్రవర్తనలో నస పెట్టే స్వభావం మాత్రం హౌస్మేట్స్ లోనే కాదు ప్రేక్షకులకూ నచ్చటం లేదు. . చిన్న విషయాన్ని కూడా అర్చన రోజుల తరబడి చర్చ చేయడం గమనించదగ్గ విషయం. మరి ఈ లోపాలతో ఉన్న అర్చన ఇప్పుడు టైటిల్ని పొందగలదా అంటే అనుమానమే...

నవదీప్

నవదీప్

ఇక నవదీప్ విషయానికి వస్తే... షో లోకి రాకముందే డ్రగ్స్ కేసులో వివాదాస్పదుడు గా పెరుతెచ్చుకొని ఒక నెగెటివ్ ఇంప్రెషన్ తో హౌస్ లో అడుగు పెట్టాడు. అయితే నెగెటివ్ మనస్తత్వం తో కనిపించే నవదీప్ ఇక్కడ మాత్రం ఎక్కడా నటించినట్టు కనపడలేదు. తన స్వభావాన్ని పూర్తిగా అలాగే చూపించాడు. కొన్ని సారి మరీ ఇంత పొగరా అనిపించాల్సిన సందర్భాలలోనూ నా స్వభావం ఇదే అన్నట్టు ఉన్న నవదీప్ మంచి మార్కులనే కొట్టేసాడు అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే నవదీప్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కాబట్టి ఇతనుఇకి కూడా బిగ్ బాస్ టైటిల్ దక్కే అవకాశం తక్కువే...

ఆదర్శ్

ఆదర్శ్

ఆదర్శ్ .... షో మొదటినుంచీ ఉన్నవాళ్ళలో ఇతనూ ఒకడు అయినా,,,, బిగ్‌బాస్‌ షోలో పాల్గొన్న ఆదర్శ్, ప్రిన్స్‌ల మధ్య స్నేహం ఉంది. షోలో వీరు కలిసి కట్టుగా పాల్గొన్నారు. అయితే గత వారం ప్రిన్స్‌ ఎలిమినేట్‌ అయినప్పుడు మాత్రం ఆదర్శ్ కేకాదు చూసే ప్రేక్షకులకూ ఆశ్చర్యం అనిపించిన విషయం ‘మీ స్నేహాన్ని అడ్డు పెట్టుకుని ఆదర్శ్‌ గేమ్‌ ఆడాడా?' అనే ప్రశ్నకు ప్రిన్స్‌ ‘ఔను' అని సమాధానం చెప్పడం. ప్రిన్స్ చెప్పిన సమాధానానికి షాక్ తిన్న ఆదర్శ్‌ అలా ప్రిన్స్‌ ఎందుకు అన్నాడో తెలుసుకోవడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు. వాస్తవానికి బిగ్‌బాస్‌ షోలో కంపోజ్డ్‌గా జాగ్రత్తగా ఉన్న హౌస్‌మేట్స్‌లో ఆదర్శ్‌ ఒకడు. షోను గెలవదగ్గ స్థాయి పరిణితి కూడా అతడికి ఉంది. కానీ ప్రిన్స్ వేసిన నెగెటివ్ ముద్రకూదా ఉంది... ఆదర్శ్ టైటిల్ గెలవగలిగే చాన్స్ ని ఈ విషయం సగానికి సగం తగ్గించేసింది.

శివ బాలాజీ

శివ బాలాజీ

అయితే ఇక్కడ అన్నిటికంటే ఆశ్చర్యం ఏమిటంటే... మొదటినుంచీ కాస్త కన్నింగ్ అన్న ఇంప్రెషన్ తో ఉన్న శివ బాలాజీ ఫైనల్స్ వరకూ ఉండటం. నవదీప్ వచ్చిన సమయం లో ఈ ఇద్దరి మధ్యా గొడవ జరగొచ్చని అభిప్రాయ పడ్డారు చాలామంది. కానీ సివబాలాజీ చాలా సేఫ్ గేమ్ ఆడాడు. అయినా ఇప్పటికీ బాలాజీ గట్టి పోటీ ఇస్తూనే ఉన్నాడు చివరికి బిగ్ బాస్ ఇతనికే కిరీటం అని ప్రకటించినా ఆశ్చర్యం అవసరం లేదు. కనీ ఎందుకో చాలామంది ప్రేక్షకులకు మాత్రం శివబాలాజీ ఈ టైటిల్ కొట్టగలడన్న నమ్మకం కనిపించటం లేదు..

హరి తేజ

హరి తేజ

హరి తేజ... ఇప్పటి వరకూ మొదటినుంచీ ఈమె అంత ఎక్కువ ఇంప్రెషన్ అటు పార్టిసిపెంట్లలోనూ ఇటు ప్రేక్షకులలోనూ ఎవ్వరూ కొట్టేయ్యలేదు. మొదట్లో ఎలా ఉందో చివరి వరకూ అదే రకమైన ఓపెన్ నెస్ తో ఉంది అంతే కాదు ఎక్కడా ఎవరినీ మాటమాత్రం నొప్పించకుండా ఉంటూనే తేడా వచ్చినప్పుడు ఆమె ఏదైతే సరైందో అటువైపే నిలబడింది... ఇక ఈమధ్య కాలం లో ఆమె బుర్రకథ చెప్పాల్సి వచ్చిన సమయం లో ఆమె టైమింగ్ కీ కామెడీకీ, ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇక హౌస్ మేట్ల విషయం లోకూడా హరితేజ పట్ల ఎవ్వరికీ ఎక్కువ కోపం కానీ, మరీ ఎక్కువ వ్యతిరేకత కానీ లేవు. ఇప్పటికి దాదాపుగా ఈ టైటిల్ ని ఎగరేసుకు పోయే సత్తాఉన్న పార్టిసిపెంట్ హరితేజా అనే అన్నది చాలామంది నమ్మకం...

దీక్షా పంత్

దీక్షా పంత్

అందరికంటే చివరగా మిగిలింది దీక్షా... పాపం ఇప్పటివరకూ ప్రేక్షకుల్లో కనీస గుర్తింపు రానిది ఈ అమ్మాయికే నిజానికి దీక్ష మీద ఎక్కువ నెగెటివ్ ఇంప్రెషన్ లేదు గానీ పాజిటివ్ కూడా ఏమీలేదు... ఆటలో అరటిపండు లాగా ఉంటూ షో కి కాస్త గ్లామర్ అద్దటానికి పనికి వచ్చిన ఒక యాడెడ్ అట్రాక్షన్ గా మాత్రమే పనికి వచ్చిందీ అమ్మాయి.

వైల్ద్ కార్డ్ ఎంట్రీ కాబట్టి

వైల్ద్ కార్డ్ ఎంట్రీ కాబట్టి

ఒక సినిమా మధ్యలో స్పెషల్ ట్రాక్ లోఉండే క్యారెక్టర్ లాగా ఉండటం తప్ప దీక్ష పెద్దగా చేసిందేమీలేదు.. అంతేకాకుండా ఆమె కూడా వైల్ద్ కార్డ్ ఎంట్రీ కాబట్టి దీక్షా ని టైటిల్ రేస్ లో నిర్మొహమాటంగా పక్కనపెట్టొచ్చు. అయితే ఏమో గుర్రమెగరావచ్చు..బిగ్ బాస్ ఈ పిల్లకే టైటిల్ ఇవ్వావచ్చు... అంతా ఆ జగన్నాటక సూత్ర ధారి అయిన బిగ్ బాస్ కే తెలియాలి...

సెలబ్రిటీలు కూడా మనకంటే భిన్నంగా ఏమీ ఉండరు

సెలబ్రిటీలు కూడా మనకంటే భిన్నంగా ఏమీ ఉండరు

ఇక ఇప్పుడు ఈ విషయాలని పక్కన పెట్టి చూస్తే మనిషిలో ఉండే స్వభావాలని బయటకు తేవటంలోనూ, మనం చూసే సెలబ్రిటీలు కూడా మనకంటే భిన్నంగా ఏమీ ఉండరన్న విషయాన్ని చెప్పటం లోనూ బిగ్ బాస్ సక్సెస్ అనే చెప్పాలి. బాస్‌ షోలో పాల్గొన్న ముమైత్‌ ఖాన్‌ తొలి నుంచి కత్తి మహేశ్‌తో, ధన్‌రాజ్‌తో స్నేహంగా మెలిగింది.

ముమైత్‌ ఖాన్‌

ముమైత్‌ ఖాన్‌

వారిరువురు కూడా ఆమెతో స్నేహం పాటించారు. అయితే మొదటి వారం నుంచి కూడా ముమైత్‌ బిగ్‌బాస్‌లో ‘కెప్టెన్సీ' కోసం పాకులాడటం కనిపించింది. కాని టీమ్‌మేట్స్‌ పెద్దగా సహకరించలేదు. ఒక దశలో ధన్‌రాజ్‌ తాను కెప్టెన్‌ కావడానికి అడ్డుపడ్డాడని ముమైత్‌ భావించింది. అంతే అప్పటి వరకూ ఉన్న స్నేహాన్ని పక్కన పెట్టి ధన్‌రాజ్‌ మీద పగబట్టి అతణ్ణి వెంటాడింది. ‘దుర్బాషలాడటం' ఏ స్థాయిలో ఉండిందంటే ధన్‌రాజ్‌ కళ్లనీళ్లు పెట్టుకొని షో నుంచి విరమించుకునే దశకు వెళ్లాడు.

కల్పన విషయంలో

కల్పన విషయంలో

అలాగే కల్పన విషయంలోనూ పార్టిసిపెంట్ గా, హౌస్ కేప్టెంగా బయటకు వచ్చాక హోస్ట్ ఎన్టీఆర్‌ తో ఆమె ఉన్నతీరూ ఇలా రకరకాల షేడ్స్ లో కనిపించి అందర్నీ అయోమయం లో పడేసింది. బయటకు వచ్చిన సందర్భంలో ఒక్కొక్కరూ తామేం నేర్చుకున్నాం అని చెప్పిన విషయాలు కూడా గమనించదగ్గవే.

కత్తిమహేష్

కత్తిమహేష్

ఇక కత్తిమహేష్ అటు హౌస్ నుంచి బయటకు రాగానే ఇటు కంట్రవర్సీల్లో పడ్డాడు. నిజానికి అంతకు ముందుకూడా ఇలాంటి వివాదాల్లోనే ఉన్నా ఇప్పుడు మరింత ప్రభావం బిగ్ బాస్ వల్ల పడిందన్న విషయం ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సిందే...

సీజన్‌ 2 లో ఇంకా పెద్ద సెలబ్రిటీలు

సీజన్‌ 2 లో ఇంకా పెద్ద సెలబ్రిటీలు

ఏమైనా ఈ షో ముగియడానికి వచ్చింది. విజేతలు ఎవరైనా... మానసిక కాలుష్యం కలిగించే చాలా సీరియల్స్‌ కంటే ఈ షో ప్రేక్షకులకు ఆహ్లాదం పంచిందని చెప్పవచ్చు. ఈ షోకు వచ్చిన డిమాండ్‌ చూస్తుంటే సీజన్‌ 2లో ఇంకా పెద్ద సెలబ్రిటీలు పాల్గొంటారని, ఆ సీజన్‌ ఇంకా పెద్ద హిట్‌ కావచ్చని అనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు.

English summary
However, one of the contestants will surely not be the lucky one to win that big amount as he/she is going to be eliminated, this week.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu