For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  తీవ్ర విషాదంలో యష్ మాస్టర్.. ఆయన మరణం వేటాడుతూనే ఉంటుంది.. అంటూ ఎమోషనల్!

  |

  తెలుగు టీవీ ప్రేక్షకులందరికీ యష్ మాస్టర్ సుపరిచితమే. ఢీ షో ద్వారా ఫేమస్ అయిన డాన్స్ మాస్టర్లు ఎంతో మంది ఉన్నా ఈ మధ్య కాలంలో యష్ మాస్టర్ పేరు మరింత ఎక్కువగా వినిసిస్తోంది. ఢీ షోలో విన్నర్ అయిన యష్ మాస్టర్.. డ్యాన్స్ ప్లస్ షోలో జడ్జ్‌గా దుమ్ములేపేశాడు. ఇక ఢీ షోలో ఆయన ప్రతిభను గమనించి సినీ అవకాశాలు తన్నుకు వచ్చాయి. అలా ఆయన ఫేమస్ అయ్యాడు. ఇప్పుడు ఆయన పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆ వివరాల్లోకి వెళితే

  టీం ఫామ్ చేసుకుని

  టీం ఫామ్ చేసుకుని

  ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా గుత్తిలో జన్మించిన యశ్వంత్ మాస్టర్ చిన్నప్పటి నుంచి డాన్స్ మీద అమితమైన ప్రేమ పెంచుకున్నాడు. హుబ్లీలో తన చదువు పూర్తి చేసుకున్న తర్వాత కన్నడ రియాలిటీ షో అయినా డాన్సింగ్ స్టార్స్ అనే ఒక రియాలిటీ షోలో పాల్గొన్నారు. ఈ షో ఈటీవీ కన్నడ ఛానల్ లో ప్రసారం అయింది. ఆ తర్వాత తెలుగులో ఢీ షో ద్వారా ఆయన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా ఎంట్రీ ఇచ్చాడు. అలా ముందు క్యాట్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా కొన్నాళ్ళు పనిచేసి ఆ తర్వాత సొంతంగా ఒక టీం ఫామ్ చేసుకుని కొరియోగ్రాఫర్ గా మారాడు.

  యూటర్న్ సినిమా

  యూటర్న్ సినిమా

  ఇక తన టాలెంట్ తో అనతికాలంలోనే యశ్వంత్ మాస్టర్ మంచి పేరు తెచ్చుకున్నాడు. సమంత హీరోయిన్ గా నటించిన యూటర్న్ సినిమా ద్వారా పూర్తిస్థాయి కొరియోగ్రాఫర్ గా మారిన ఆయన ఆ తర్వాత అనేక సినిమాలకు కూడా కొరియోగ్రాఫర్ గా సేవలందించాడు. చివరిగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన యష్ ఇప్పుడు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

   ఫినాలే తొలి రౌండ్‌లో

  ఫినాలే తొలి రౌండ్‌లో

  గత ఏడాది ఈ టీవీలో ప్రసారమైన ఢీ ఛాంపియన్స్ షో పూర్తయిన తర్వాత ఆయన ఓంకార్ ఆధ్వర్యంలో ప్రారంభమైన డాన్స్ ప్లస్ అనే రియాలిటీ షోలో ఒక జడ్జిగా పాల్గొని ప్రేక్షకులను అలరించారు. అయితే యశ్వంత్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ గా కెరీర్ ప్రారంభించిన కేవల్ ను ఈ షో ద్వారా కొరియోగ్రాఫర్ ను చేశారు. ఓంకార్ డ్యాన్స్ ప్లస్ షోలో జియాకు కేవల్ కొరియోగ్రాఫ్ చేశారు. టైటిల్ ఫేవరెట్ అయిన ఆమె ఫినాలే తొలి రౌండ్‌లో ఎలిమినేట్ అయింది.

  బ్లడ్ క్యాన్సర్ బారిన

  బ్లడ్ క్యాన్సర్ బారిన

  అయితే అనూహ్యంగా కొద్దీ రోజుల క్రితమే కేవల్ బ్లడ్ క్యాన్సర్ బారిన పడ్డాడు. జూలై 29న వెల్లూరులో ఉన్న హాస్పిటల్ లో చేర్పించామని అర్జెంటుగా 12 మంది రక్తం ఎక్కించాలని యష్ మాస్టర్ అప్పట్లో ఒక వీడియో విడుదల చేశారు. ఇలా సోషల్ మీడియా ముందుకు వస్తానని కలలో కూడా అనుకోలేదని కానీ ఇప్పుడు పరిస్థితి చేయి దాటి పోయే పరిస్థితిలో ఇలా అడగడం తప్ప ఏమీ చేయలేకపోతున్నానని చెప్పుకొచ్చాడు. యష్ మాస్టర్ మాత్రమే కాక ప్రియమణి కూడా తన సోషల్ మీడియా వేదికగా బ్లడ్ కావాలని కోరారు. కేవల్ బ్లడ్ క్యాన్సర్ తో పోరాడుతున్నాడని అతనికి మీ సపోర్ట్ కావాలంటూ ఆమె ఇంస్టాగ్రామ్ ద్వారా కోరారు.

  Recommended Video

  Prakash Raj Speech About MaaMembers | CineMAABidalu | MaaElections
  తీవ్ర విషాదంలో

  తీవ్ర విషాదంలో

  అయితే అప్పటి నుంచి ప్రాణాల కోసం పోరాడుతున్న ఆయన ఈరోజు మరణించారు. దీంతో యాష్ మాస్టర్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కేవల్ దీన్ని నేను తీసుకోలేను, RIP బ్రదర్, ఈ నొప్పి నన్ను ఎప్పటికీ వేటాడేలా ఉంది, నేను నిన్ను ఇంకా అనుభూతి చెందగలను'' అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

  English summary
  Yash Master becomes Very Emotional as his assistant Kewal tamang who is suffering from blood cancer, passes away
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X