For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సినిమాల్లో డ్రామాలు.. ఇక్కడ కూడా డ్రామాలు అంటూ స్కిట్.. కంటతడి పెట్టుకున్న రోజా!

  |

  జబర్దస్త్ షోతో చాలా కాలం పాటు కొనసాగిన రోజా ఆ తర్వాత మంత్రిగా హోదా దక్కడంతో మళ్లీ రెగ్యులర్ గానే టెలివిజన్ షోలలో కనిపించడం లేదు. ఇక అప్పుడప్పుడు కేవలం కొన్ని ప్రత్యేకమైన షో లలో మాత్రమే కనిపిస్తున్నారు. ఇక దసరా సందర్భంగా ఈటీవీలో ప్రసారం కాబోయే ఒక ప్రోగ్రాంలో ఆమె హైలెట్ కాబోతున్నట్లు తెలుస్తోంది అందుకు సంబంధించిన ఒక ప్రోమో కూడా విడుదల చేయగా అందులో ఊహించిన విధంగా రోజు పొలిటికల్ అంశంపై స్కిట్ చేయడం మారింది.. ఆ వివరాల్లోకి వెళితే..

  జబర్దస్త్ కు దూరంగా..

  జబర్దస్త్ కు దూరంగా..

  ఒకవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరొకవైపు సినిమాల్లో సహాయనిటిగా కూడా కొనసాగిన రోజా ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ కొంతకాలం సినిమాలలో నటించడం తగ్గించారు. కానీ ఆ తర్వాత మాత్రం ఆమె జబర్దస్త్ లో రెగ్యులర్ గా కొనసాగుతూ వచ్చారు. ఇక మళ్ళీ మంత్రిగా ఆమె కొత్త తరహా బాధ్యతను అందుకోవడంతో ఈసారి ఆ కామెడీ షో కు మళ్లీ దూరమయ్యారు.

  రాజా రాజకీయాలపై

  రాజా రాజకీయాలపై

  అయితే జబర్దస్త్ కు దూరమైనప్పటికీ కూడా అప్పుడప్పుడు రోజా పలు స్పెషల్ ఈవెంట్స్ లలో పాల్గొనే ప్రయత్నం చేస్తున్నారు. రీసెంట్ గా ఆమె ఈటీవీ దసరా స్పెషల్ షో దసరా వైభవం లో పాల్గొన్నారు. దసరా రోజు ఈ షో ప్రత్యేకంగా ఈటీవీలో ప్రసారం కాబోతోంది. అయితే ఈ షోలో రోజా రాజకీయాలపై వచ్చిన కామెంట్స్ పై కూడా యోదా టీమ్ ఒక ఎమోషనల్ స్కిట్ చేశారు.

  అవన్నీ పెళ్లి తరువాతే..

  అవన్నీ పెళ్లి తరువాతే..

  ముందుగా నరేష్ కోసం ఒక అమ్మాయి వచ్చి నేను నరేష్ ను ఇష్టపడుతున్నాను అని చెబుతుంది. ఈవెంట్ చేయడానికి ఒకసారి మా ఊరికి వచ్చి బుగ్గ గిల్లాడు అని అమ్మాయి చెప్పింది. కానీ నరేష్ మాత్రం నాకు తెలియదు అని అన్నాడు. ఇక తర్వాత నన్ను నువ్వు పెళ్లి చేసుకోవాలి అంటే నా ఫ్యామిలీ లో ఉన్న 100 మందికి సమాధానం చెప్పాలి అని నరేష్ అనడంతో ఆమె కోటిమందికైనా సరే సమాధానం చెబుతాను అంటుంది. ఇక నరేష్ కు ఒక ముద్దు ఇస్తాను అన్నప్పుడు అవన్నీ పెళ్లి తర్వాతే అని కామెడీగా పంచ్ వేశాడు.

  రోజా ఎమోషనల్

  రోజా ఎమోషనల్

  ఇక తర్వాత రోజా పొలిటికల్ జీవిత ఆధారంగా జబర్దస్త్ యోధ కూడా ఒక మంచి స్కిట్ చేసింది. రోజా పాత్రలో ఆమె ఒదిగి నటించే ప్రయత్నం చేసింది. అయితే రోజాపై వస్తున్న కామెంట్ల గురించి కూడా అందులో వివరణ ఇచ్చారు. సినిమాల్లో డ్రామాలు వేసి ఇక్కడ కూడా డ్రామాలు వేస్తే ఓట్లు ఎవరు వేస్తారు అని కామెంట్ కూడా చేయడంతో యోధా అందుకు దీనంగా హవ భావాలు చూపించింది. దీంతో రోజా కూడా చాలా ఎమోషనల్ అయిపోయింది.

  పిల్లలను గుర్తు చేసుకొని ఏడ్చిన రోజా

  పిల్లలను గుర్తు చేసుకొని ఏడ్చిన రోజా

  అయితే రోజా అనంతరం తన పిల్లల గురించి చెప్పుకుంటూ కంటతడి పెట్టుకుంది. అందరికీ ఉన్నట్లే నా పిల్లలకు కూడా మమ్మీ అన్న పెడితే బావుంటుంది అని ఉంటుంది. కానీ అప్పుడు నేను వెళ్ళలేను. అందరికీ కోవిడ్ అనేది కష్టమైన సమయం కానీ నాకు నా పిల్లలకి మాత్రం అదే హ్యాపీ మూమెంట్ చాలా సంతోషకరమైన పీరియడ్. అని చెబుతూ రోజా చాలా ఏడ్చేసింది. మరి ఫుల్ ఎపిసోడ్లో ఆమె ఇంకా ఎలాంటి విషయాలపై రియాక్ట్ అవుతారో చూడాలి.

  English summary
  yodha emotional skit on roja selvamani and shared her emotional moment
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X