For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  దేత్తడి హారిక నా గర్ల్ ఫ్రెండ్ అంటూ యూట్యూబర్ వీడియో.. హారిక రియాక్షన్ అదుర్స్!

  |

  'దేత్తడి' ద్వారా తెలుగువారికి దగ్గరైంది అలేఖ్య హారిక. ఒకదానికి మరొకటి ఏమాత్రం సంబంధం వెబిసోడ్స్ లో తనదైన తెలంగాణ యాసలో మాట్లాడుతూ హారిక విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. సోషల్ మీడియాలో లభించిన క్రేజ్ తో బిగ్ బాస్ 4 ఫైనల్ దాకా వెళ్లింది ఈ భామ. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హారిక ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటుంది. అయితే ఆమె తన గర్ల్ ఫ్రెండ్ అంటూ రచ్చ రేపాడు ఒక యూట్యూబర్. ఆ వివరాల్లోకి వెళితే

  ప్యాషన్ తో

  ప్యాషన్ తో


  అమెజాన్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న హారిక తన లక్ష్యం అదికాదని తెలిసి యూట్యూబ్ ఛానల్లో వెబిసోడ్స్ చేయడం మొదలు పెట్టింది. అలా హారిక చేసే 'దేత్తడి' యూట్యూబ్ చానెల్‌కు లక్షల సంఖ్యలో సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఈ ఛానల్ ద్వారా ఆమెకు బిగ్ బాస్ ఫోర్ లో అవకాశం వచ్చింది. బిగ్ బాస్ హౌస్ లో హారిక తనదైన శైలిలో ప్రేక్షకులకు దగ్గరయింది.

  అభిజిత్ తో ప్రేమ

  అభిజిత్ తో ప్రేమ

  హౌస్ లో ఉండగా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అభిజిత్ - హారిక మధ్య ప్రేమాయణం ఏదో ఉందని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రాగానే హారిక తనకు చెల్లెలు లాంటిదని హౌస్ లో కూడా చాలాసార్లు చెల్లి అని పిలిచానని అభిజిత్ అందరికీ షాక్ ఇచ్చాడు.

  బిగ్ బాస్ క్రేజ్

  బిగ్ బాస్ క్రేజ్


  అయితే బిగ్ బాస్ లో ఫైనల్ దాకా వెళ్లిన దేత్తడి హారిక చివరిలో ఐదో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కానీ ఈ షో ద్వారా ఆమె మరింత మందికి చేరువ అయ్యింది. ఈ షో నుంచి బయటకు వచ్చాక ఆమె శ్రీకారం అనే సినిమా కూడా చేసింది. ఇక ఆమెకు అవకాశాలు వస్తున్నా ప్రాధాన్యత ఉన్న పాత్ర అయితేనే చేస్తానని చెబుతోంది.

  ట్రెండింగ్ లో

  ట్రెండింగ్ లో


  హారిక మళ్ళీ ఎప్పటిలాగే తన ఛానల్ ద్వారా వీడియోలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ మధ్యలో ఏమండోయ్ ఓనర్ గారు అనే ఒక వెబ్ సిరీస్ కూడా చేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి కొన్ని ఎపిసోడ్స్ కూడా రిలీజ్ అయ్యాయి. ఎపిసోడ్ రిలీజయినప్పుడల్లా ఆ ఎపిసోడ్ ట్రెండ్ అవుతోంది.

  హారిక నా గర్ల్ ఫ్రెండ్

  హారిక నా గర్ల్ ఫ్రెండ్


  ఇక తాజాగా ఆమె తన గర్ల్ ఫ్రెండ్ అని చెబుతూ యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర సింహ ఒక వీడియో పోస్ట్ చేశారు. అందులో హారిక డ్యాన్స్ వేస్తూ ఉండగా తన కుటుంబ సభ్యుల రియాక్షన్స్ ఇలా ఉంటాయని చెబుతూ ఆ వీడ్యో పోస్ట్ చేశాడు ఆయన. అలాగే ఆ వీడియోకి కొత్త గర్ల్ ఫ్రెండ్ అనే ట్యాగ్ కూడా పెట్టాడు.

  #17YearsOfAarya : Allu Arjun ఎమోషనల్, లో బడ్జెట్ హెవీ ప్రాఫిట్స్ ! || Filmibeat Telugu

  భలే ఫన్నీగా ఉంది

  అయితే ఇలా పోస్ట్ పెడితే హారిక కోప్పడుతుందని అందరూ అనుకుంటే ఆమె మాత్రం భలే ఫన్నీగా ఉందీ వీడియో అంటూ కామెంట్ చేసింది.. ప్రస్తుతానికి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. హారిక పని చేస్తున్న తామాడ మీడియా అనే డిజిటల్ మీడియా సంస్థలోనే నిఖిల్ కూడా ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడు. కాస్కో అనే పేరుతో ఉన్న ఈ ఛానల్ కూడా సబ్ స్క్రైబర్స్ లక్షల్లోనే ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి

  Read more about: dethadi harika
  English summary
  Alekhya Harika is a telugu famous Youtuber and Actress from Hyderabad. She is known for her setairic videos in Telangana slang. Alekhya came into the limelight for her channel called “Dhethadi”. Later she entered in bigg boss 4 and got more craze. recently youtuber Nikhil Vijayendra simha mentions dethadi harika as his girlfriend.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X