నీ ముఖం కంటే నా చెయ్యి పెద్దగా.. దవడ విరిగిపడుతుంది.. ఊగిపోయిన హీరోయిన్
బాలీవుడ్‌లో అందాల తార జరీన్ ఖాన్ చటుక్కున మెరిసి అలా మాయమైంది. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌తో తొలి చిత్రం చేసినప్పటికీ స్టార్ హీరోయిన్‌గా ఎదుగలేకపోయింది. అయితే తాజాగా ఎంటీవీలో ప్రసారమయ్యే రియాలిటీ షోలో ఓ నెటిజన్‌పై మండిపడింది. సోషల్ మీడియాలో తనపై చేసిన కామెంట్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దుర్బాషలాడింది. ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఏమైందంటే..

ఎంటీవీ ట్రోల్ పోలీస్
ఎంటీవీలో ట్రోల్ పోలీస్ అనే పేరుతో ఓ కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో తమను కామెంట్లతో వేధించిన వారిని సెలబ్రిటీలు కలుసుకునే అవకాశం ఉంటుంది.

జరీనాఖాన్ ఆగ్రహం
ఎంటీవీ ట్రోల్ పోలీస్ కార్యక్రమంలో జరీనా ఖాన్ పాల్గొన్నది. తనపై సోషల్ మీడియాలో రెచ్చిపోయిన నెటిజన్‌ను కలుసుకొన్నది. ఈ సందర్భంగా తనపై కామెంట్ చేసిన వ్యక్తికి గోడపై ఉన్న పోస్టర్లను చూపిస్తూ.. సోషల్ మీడియాలో నాపై మీరు రాసిన కామెంట్లు ఇవి. వాటిపై మీరు మాట్లాడాలి అని విరుచుకుపడింది.

చెంపదెబ్బతో దవడ
మౌనంగా నిలుచున్న నెటిజన్‌పై ఓ దశలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నీ ముఖం కంటే నా చేయి పెద్దగా ఉంటి. ఒక్క చెంపదెబ్బ కొడితే దవడ విరిగి పడుతుంది అంటూ ఊగిపోయింది. నీవు ఓ డాక్టర్. నిన్ను చూస్తే నీ తల్లితండ్రులను గౌరవించేలా లేవు అని తీవ్రంగా మందలించింది.
నా తల్లి చ్చిపోయి ఉండేది..
తన సోషల్ మీడియా అకౌంట్‌లో అశ్లీల పదజాలంతో కామెంట్లు పెట్టిన విషయంపై మాట్లాడుతూ.. నెటిజన్లు పెట్టే కామెంట్లు కేవలం మమ్మల్నే కాదు.. కుటుంబ సభ్యులను కూడా బాధిస్తాయి. మా అమ్మ సోషల్ మీడియాలో లేదు కాబట్టి బతికిపోయింది. ఇలా కామెంట్లు చూస్తే మానసికంగా చచ్చిపోయేదేమో అని జరీన్ ఖాన్ వెల్లడించింది.


Click it and Unblock the Notifications











