»   » సల్మాన్‌తో గొడవపడి బిగ్‌బాస్ సెలబ్రిటీ ఆత్మహత్యాయత్నం

సల్మాన్‌తో గొడవపడి బిగ్‌బాస్ సెలబ్రిటీ ఆత్మహత్యాయత్నం

Posted By:
Subscribe to Filmibeat Telugu
Bigg Boss Contestent Zubair Khan Sensational Comments On Salman Khan

హిందీ బిగ్‌బాస్ సీజన్ 11 ప్రారంభమై వారం గడవకముందే అనేక వివాదాల్లో కూరుకుపోయింది. బిగ్‌బాస్ హౌస్ కొట్లాటలకు, వివాదాలకు నిలయంగా మారింది. ఇదెక్కడి రియాలిటీ షో రా బాబు అని ప్రేక్షకులు అనుకునే స్థాయికి చేరుకొన్నది. ఏకంగా హోస్ట్ సల్మాన్ ఖాన్‌పైనే ఇంటి సభ్యుడు జుబేర్ ఖాన్ కేసు పెడుతాననడం, అంతేకాకుండా అనేక ఆరోపణలు చేయడం మరింత వేడిని రాజేస్తున్నది. అంతేకాకుండా బిగ్‌బాస్ షో అంతా బోగస్ అని విమర్శలు చేయడం ఈ వివాదంలో కొసమెరుపు. సల్మాన్‌పై జుబేర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇవే..

 సల్మాన్‌తో జుబేర్ వాగ్వాదం

సల్మాన్‌తో జుబేర్ వాగ్వాదం

ఆదివారం జరిగిన బిగ్‌బాస్ ఎపిసోడ్‌లో సల్మాన్‌ ఖాన్‌తో జుబేర్ వాగ్వాదానికి దిగాడు. వారి మధ్య మాటల యుద్ధం జోరుగానే సాగింది. దాంతో ఆదివారం ఎపిసోడ్ రచ్చరచ్చగా మారింది. ఆ తర్వాత జుబేర్‌ను ఎలిమినేట్ కావడం వివాదం బిగ్‌బాస్ హౌస్‌ నుంచి రోడ్డు మీదకు వచ్చింది.

 బిగ్‌బాస్ ఫేక్ రియాలిటీ షో

బిగ్‌బాస్ ఫేక్ రియాలిటీ షో

బిగ్‌బాస్ హౌస్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత సల్మాన్ ఖాన్‌పై తీవ్ర ఆరోపణలు చేశాడు. సల్మాన్‌ఖాన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ముంబైకి సమీపంలోని లోనావాలాకు వెళ్తున్నాను అని మీడియాతో పేర్కొన్నాడు. బిగ్‌బాస్ ఫేక్ షో. ఇంటి సభ్యులకు ఏమి చేయాలో వారే సలహాలు, సూచనలు ఇస్తుంటారు అని బిగ్‌బాస్ గుట్టును బయటపెట్టాడు.

 డబ్బు కోసం అర్థనగ్నంగా డాన్సులు

డబ్బు కోసం అర్థనగ్నంగా డాన్సులు

ఇక బిగ్‌బాస్ హోస్ట్‌ సల్మాన్ ఖాన్‌పై జుబేర్ నిప్పులు చెరిగాడు. సల్మాన్ ఖాన్ ఓ ఆటబొమ్మ. డబ్బు కోసం స్టేజీల మీద అర్థనగ్నంగా డాన్సులు చేస్తాడు. నేను భయపడటానికి వివేక్ ఓబెరాయ్‌ని కాదు. సోషల్ మీడియాలో సారీ భాయ్ అని చెప్పడానికి సింగ్ అర్జిత్ సింగ్‌నూ కాదు. నేను ఓ డైరెక్టర్‌గా గేమ్ షోలో పాల్గొనడానికి వెళ్లాను. నన్ను దావూద్ చెల్లెలు హసీనా పార్కర్ బంధువు అని చెబుతారని ఊహించలేదు అని అన్నాడు.

పబ్లిసిటీ కోసం కాదు

పబ్లిసిటీ కోసం కాదు

పబ్లిసిటీ కోసం నేను బిగ్‌బాస్‌లో వివాదంగా మారడం లేదు. ఒకవేళ ప్రచారం కోసం నేను ప్రయత్నిస్తే నా సినిమాకు లఖీర్ కా ఫకీర్ అనే అడ్డమైన పేర్లు పెట్టుకొనే వాడిని. అలాంటి చర్యలకు పాల్పడటం ఇష్ట లేదు. దావూద్ ఇబ్రహీం పేరును వాడుకోని గేమ్ షో ద్వారా రేటింగ్ పెంచుకోవాలని చానెల్ చూస్తున్నది అని జుబేర్ మండిపడ్డాడు.

బిగ్‌బాస్ వదిలి వచ్చాను

బిగ్‌బాస్ వదిలి వచ్చాను

బిగ్‌బాస్ హౌస్‌ను నేనే వదిలి వచ్చాను. నన్ను ఎవరూ ఎలిమినేట్ చేయలేదు. కెమెరా ద్వారా సల్మాన్ ఖాన్ నన్ను బెదిరించాడు. హౌస్‌లో నన్ను చాలా నీచంగా చూశాడు. ఇంటిలో ఉన్న శివాని జీ సాధ్వీ తప్ప మిగితా వారు నాకు మద్దతుగా ఎవరూ రాలేదు. చానెల్‌తో ఉన్న ఒప్పందం వలన సెలబ్రిటీలు భయపడుతున్నారు.

 బాల కార్మికుడిగా పనిచేశా

బాల కార్మికుడిగా పనిచేశా

ఎవరి అండతో కాకుండా సొంతంగా ఎదుగుతూ వచ్చాను. పహ్లాజ్ నిహ్లనికి చెందిన నిషాంత్ థియేటర్‌లో బాల కార్మికుడిగా పనిచేశాను. అందులో ఐస్ క్యాండిల్స్ అమ్మాను. డైరెక్టర్ కావడానికి ముందు చాలా పనులు చేశాను. నాకు సల్మాన్ ఖాన్‌కు ఉన్నట్టు సలీంఖాన్ లాంటి తండ్రి లేడు. అలాంటి వాడైన సల్మాన్ నా రాతను ఎలా నిర్ణయిస్తాడు అని జుబేర్ మండిపడ్డాడు.

 ఆత్మహత్యకు ప్రయత్నించాను

ఆత్మహత్యకు ప్రయత్నించాను

బిగ్‌బాస్ షోకు రప్పించేందుకు నిర్వాహకులు మళ్లీ ప్రయత్నిస్తున్నారు. సల్మాన్‌తో గొడవపడిన తర్వాత ఆత్మహత్యకు ప్రయత్నించాను. నేను నా భార్యబిడ్డల కోసం బయటకు వచ్చాను. బిగ్‌బాస్‌లో తిట్టుకునే సీన్లే చూపిస్తున్నారు. టీవీలలో కూడా నేను చెప్పేవీ ఏమీ చూపించడం లేదు. అంతా ఎడిట్ చేసి వార్తలను కూడా ప్రసారం చేస్తున్నారు అని జుబేద్ ఆవేదన వ్యక్తం చేశాడు.

English summary
Zubair Khan, one of the contestants on the controversial reality show Bigg Boss 11, left the house, as he claims, after a heated argument with its host, Bollywood actor Salman Khan on Sunday. On the show, he was evicted after getting the least number of votes among all the nominated contestants. He said “Salman Khan is a puppet and can dance shirtless for money. I am not Vivek Oberoi who will get scared of him. I am also not Arjit Singh who will say ‘sorry bhai’ on social media.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu