twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    40 years of Erra Mallelu: నాంపల్లి టేషన్ కాడ అంటూ.. చరిత్ర సృష్టించిన విప్లవ కథా చిత్రం

    |

    తెలుగు సినిమా పరిశ్రమలో విప్లవ భావాలను రగిలిస్తూ రూపొందిన చిత్రం ఎర్రమల్లెలు. 1981లో నవతరం పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం మే 1 తేదీ, 2022 సంవత్సరానికి 40 ఏళ్లు పూర్తి చేసుకొన్నది. మాదాల కొదండరామయ్య, మాదాల రంగారావు నిర్మించిన ఈ చిత్రానికి ధవళ సత్యం దర్శకత్వం వహించారు. కే చక్రవర్తి సంగీతం అందించారు. ఈ చిత్రంలో మురళీమోహన్, మాదాల రంగారావు, గిరిబాబు ప్రధాన పాత్రలు పోషించారు.

    మునసబు, కరణం, కామందు లాంటి ముగ్గురు దుష్టశక్తుల అరాచకాలు గ్రామ ప్రజలను చాలా ఇబ్బందికి గురిచేస్తాయి. ఈ క్రమంలో గ్రామానికి వచ్చిన టీచర్, ఓ చైతన్యకారుడు అలాంటి దుష్టశక్తులను ఎదురించి గ్రామానికి మేలు చేశారనేది సంక్షిప్తంగా కథ. కానీ ఆ రోజుల్లో ఈ చిత్రం విశేషమైన ప్రజాదరణ పొందింది. బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లను సాధించింది. ఆ ఏడాది కలెక్షన్లపరంగా రికార్డులు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

    40 years of Erra Mallelu: Box office biggest hit in 1981

    ఎర్రమల్లెలు చిత్రంలో విప్లవభావాలతో సాగే, చైత్యన్యాన్ని రగిలించే పాటలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ఈ చిత్రంలో ప్రముఖ గాయని ఎస్పీ శైలజ పాడిన నాంపల్లి టేషన్ కాడి రాజాలింగో పాట అత్యంత ప్రేక్షకాదరణ పొందింది.

    నటీనటులు: మురళీ మోహన్, గిరిబాబు, మాదాల రంగారావు, రంగనాథ్, పీఎల్ నారాయణ, సాక్షి రంగారావు, పీజే శర్మ, సాయిచంద్, చలపతిరావు, నర్రా వెంకటేశ్వరరావు, ఎంపి.ప్రసాద్, వీరభద్రరావు, పుష్పకుమారి, కృష్ణవేణి, లక్ష్మీచిత్ర, శ్రీలక్ష్మి, జయశీల, నవత, శివ పార్వతి, కే విజయ, టి.కృష్ణ తదితరులు
    దర్శకుడు: ధవళ సత్యం
    నిర్మాతలు: మాదాల కోదండరామయ్య, మాదాల రంగారావు
    ఛాయాగ్రహణం: జి.మోహనకృష్ణ
    కూర్పు: నాయని మహేశ్వరరావు
    సంగీతం: కె.చక్రవర్తి
    పాటలు: సి.నారాయణరెడ్డి, కొండవీటి వెంకట కవి, అదృష్టదీపక్, ప్రభు, ధవళ సత్యం
    విడుదల తేదీ: 1981 మే 1

    English summary
    Actor Madala Rangarao's Erra Mallelu completed 40 years in Tollywood. This movie was released on May 1 1981. This movie gets huge response from all corners of the Telugu state. This movie becomes biggest hit of the year.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X